May-10 Current affairs articles
కోస్టారికా అధ్యక్షుడిగా కార్లోస్ అల్వరాడో
Event-Date: | 10-May-2018 |
Level: | International |
Topic: | Persons in News |

-------------------------------------------------------------------------------------------
వరల్డ్ రెడ్‌క్రాస్ రెడ్ క్రెసెంట్ డే
Event-Date: | 10-May-2018 |
Level: | International |
Topic: | Miscellaneous(General) |

మహేంద్ర చౌదరికి వి.కె.కృష్ణ మీనన్ అవార్డు
Event-Date: | 10-May-2018 |
Level: | International |
Topic: | Awards and honours |

ఫేస్‌బుక్ టీంలో తొలిసారి భారీ మార్పులు
Event-Date: | 10-May-2018 |
Level: | International |
Topic: | Science and Technology |

- ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ యాప్ లాంటి ప్రధాన విభాగాలకు కొత్త వారిని నియమించింది.
- బ్లాక్‌చెయిన్ టూల్‌ను తిరిగి ప్రారంభించింది.
- సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ మునుపటిలాగానే సీఈవోగా కొనసాగుతారు. సీఈవో తర్వాత రెండవ అతి కీలకమైన ఎగ్జిక్యూటివ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా షెరిల్ సాండ్‌బర్గ్ ఉంటారు.
- జుకర్‌బర్గ్ సర్కిల్‌లో దీర్ఘకాల సభ్యుడు, చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా ఉన్న క్రిస్ కాక్స్‌కు సంస్థ ప్రమోషన్ ఇచ్చింది. ఇకపై క్రిస్ ఫేస్‌బుక్ యాప్, స్మార్ట్‌ఫోన్‌సేవలు, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెసెంజర్ యాప్‌లకు ప్రధాన ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు.
- జేవియర్ ఆలివాన్ సోషల్ ప్రొడక్ట్ సర్వీసెస్ విభాగ నిర్వహణ బాధ్యతలను చేపడతారు.
- బిట్ కాయిన్‌కోసం బ్లాక్‌చెయిన్ టెక్నాలజీని పునరుద్ధరించింది.
- మెసెంజర్ చాట్ యాప్‌కు చెందిన డేవిడ్ మార్కస్ దీనికి నాయకత్వం వహిస్తారు.
- న్యూస్ ఫీడ్ మాజీ హెడ్ ఆడమ్ మోస్సేరిని ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌కు (కెప్టెన్ కెవిన్ వీల్ స్థానంలో) నియమించింది.
- వాట్సాప్ కో ఫౌండర్ జాన్ కోమ్ రాజీనామా అనంతరం అతని స్థానంలో క్రిస్ డేనియల్స్‌ను నియమించింది.
- ఒబామా మాజీ పరిపాలన అధికారి, క్రేన్‌మేర్ గ్రూపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన జెఫ్ జింట్స్‌ను ఫేస్‌బుక్ బోర్డులోకి చేర్చుకుంది.
కాంగోలో మళ్లీ ఎబోలా
Event-Date: | 10-May-2018 |
Level: | International |
Topic: | Miscellaneous(General) |

- బికోరో పట్టణం సమీపంలోని ఓ కుగ్రామంలో 21 మంది కొద్దిరోజుల క్రితం ఎబోలా వ్యాధి లక్షణాతో ఆస్పత్రిలో చేరారు. వారికి ఎబోలా వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించారు. వ్యాధి బారిన పడిన వారిలో 17 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు.
- కాంగో దేశంపై ఎబోలా వైరస్ దాడి చేయడం ఇది తొమ్మిదోసారి. 1970లో మొదటిసారి దీన్ని గుర్తించారు. ఎబోలా వైరస్ చాలా వేగంగా వ్యాపిస్తుంది. రెండేళ్ల క్రితం పశ్చిమాఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ తీవ్రంగా వ్యాపించి ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు కలిగించింది. దాదాపు 28,600 మందికి ఈ వైరస్ సోకింది. 11,300 మంది మరణించారు.
- ఎబోలా వైరస్ గబ్బిలం లాలాజలం ద్వారా మనుషులకు వ్యాపించింది.
ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యంత శక్తిమంతుల జాబితాలో జిన్‌పింగ్‌కు ప్రథమ స్థానం
Event-Date: | 10-May-2018 |
Level: | International |
Topic: | Persons in News |

- గత నాలుగేళ్లుగా ప్రథమ స్థానంలో ఉంటున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అధిగమించి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తొలిసారి అగ్రస్థానం దక్కించుకున్నారు.
- ఈ జాబితాలో భారత ప్రధాని నరేంద్రమోడికి 9వ స్థానం దక్కింది.
- ప్రపంచ గతిని మార్చిన 75 మంది ప్రముఖులతో 2018 ఏడాదికి ఫోర్బ్స్ ఈ జాబితాను వెలువరించింది.
- ఈ జాబితాలో మోడితో పాటు చోటు దక్కించుకున్న మరో భారతీయుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ.
- ఈ భూమ్మీద మొత్తం 7.5 బిలియన్ల మంది జీవిస్తున్నారు. అందులో ఈ 75 మంది ప్రపంచ గతిని మార్చారు. ప్రతి 100 మిలియన్ల మందికి ఒకరి చొప్పున ఈ ఏడాది అత్యంత శక్తిమంతుల జాబితాను రూపొందించాం అని ఫోర్బ్స్ వ్యాఖ్యానించింది.
- భారత్‌లో మోదీకి ఆదరణ కొనసాగుతోందన్న ఫోర్బ్స్.. 2016 నాటి నోట్లరద్దు నిర్ణయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. జియో సేవలు ప్రారంభించిన రిలయన్స్ భారత టెలీ మార్కెట్‌లో చవక టారిఫ్ యుద్ధానికి తెరతీసిందని పేర్కొంది.
1 జిన్‌పింగ్, చైనా అధ్యక్షుడు
2 వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు
3. డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
4. ఏంజెలా మెర్కెల్, ఛాన్స్‌లర్, జర్మనీ
9 నరేంద్రమోడి, భారత ప్రధాని
13 మార్క్ జుకర్‌బర్గ్, ఫేస్‌బుక్ సీఈఓ
14 థెరిసా మే, బ్రిటన్ ప్రధాని
15 లీకెకియాంగ్, చైనా ప్రధాని
24 టిమ్ కుక్, యాపిల్ సీఈఓ
32 ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత
40 సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సీఈఓ
Paytmతో APSRTC ఒప్పందం
Event-Date: | 10-May-2018 |
Level: | Local |
Topic: | Govt Schemes and Programmes |

- Paytm వ్యవస్థాకుడు - విజయ్‌శేఖర్ శర్మ
- Paytm ఏర్పాటు - 2010
- Paytm ప్రధాన కార్యాలయం - నోయిడా
2018-19లో భారత వృద్ధి 7.4% :IMF
Event-Date: | 10-May-2018 |
Level: | National |
Topic: | Economic issues |

- IMF ప్రధాన కార్యాలయం - వాషింగ్టన్ డి.సి.
- IMF సీఈఓ - క్రిస్టినె గార్డె
ప్రపంచంలోనే తొలిసారిగా గర్భస్థ శిశువు గుండె చప్పుడు వినే ‘సునో’ పరికరం ఆవిష్కరణ
Event-Date: | 10-May-2018 |
Level: | Local |
Topic: | Science and Technology |

- తాము అభివృద్ధి చేసిన ‘సునో’ పరికరాన్ని యాప్‌తో మొబైల్‌కు అనుసంధానం చేసి, గుండె చప్పుడును ఎన్ని సార్లైనా వినొచ్చని, దీని నుంచి ఎటువంటి వంటి తరంగాలు విడుదల కావన్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ఇటువంటి పరికరాలపై అవగాహన ఉందని, సునోను త్వరలో విదేశీ మార్కెట్లలోకి కూడా విడుదల చేయనున్నామన్నారు. పరికరం ధర రూ.2,499 కాగా.. తమ వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఆఫర్ ధర కింద రూ.1,999కి విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.
ఆఫ్ఘాన్-తజికిస్థాన్ సరిహద్దులో భూకంపం
Event-Date: | 10-May-2018 |
Level: | International |
Topic: | Miscellaneous(General) |

ప్రయాణికుడికి రైలు ఎక్కిదిగేటప్పుడు జరిగే నష్టానికి పరిహారం పొందే హక్కు ఉంది : సుప్రీం
Event-Date: | 10-May-2018 |
Level: | National |
Topic: | Judiciary and Judgement |

పాన్‌కు దరఖాస్తు చేసుకునే ట్రాన్స్‌జెండర్లకు వెసులుబాటు
Event-Date: | 10-May-2018 |
Level: | National |
Topic: | Govt Schemes and Programmes |

- ఇంతవరకూ పాన్ దరఖాస్తుల్లో స్త్రీ, పురుష కేటగిరీలను ఎంచుకునే అవకాశం మాత్రమే ఉండేది. తాజాగా ఐటీ శాఖ ట్రాన్స్‌జెండర్ కేటగిరీని చేరుస్తూ ఆదాయపు పన్ను నిబంధనల్లో మార్పు చేసింది.
విజయ్ ప్రహార్ విజయవంతం
Event-Date: | 10-May-2018 |
Level: | National |
Topic: | Miscellaneous(General) |

డిల్లీలో మొబైల్ డిజిటల్ మూవీ థియేటర్ ప్రారంభం
Event-Date: | 10-May-2018 |
Level: | National |
Topic: | Places in News |

- ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సతీష్ కౌశిక్, పారిశ్రామికవేత్త సునీల్ చౌదరి కలిసి ‘పిక్చర్ టైం’ బ్రాండ్ పేరుతో ఈ సదుపాయాన్ని తీసుకొచ్చారు.
- ఓ కంటెయినర్, బెలూన్ లాంటి పెద్ద టెంటు సాయంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 6030 అడుగుల వైశాల్యంలోఉండే ఈ తాత్కాలిక థియేటర్‌లో సుమారు 150 నుంచి 200 సీట్లు పడతాయి. వర్షాలు, అగ్నిప్రమాదాలను తట్టుకొని నిలిచే మెటీరియల్ ఇందుకోసం వాడుతున్నారు. దీనిలో ఏసీ సదుపాయం కూడా ఉంది. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో అప్పటికప్పుడు ఈ థియేటర్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. సినిమాలకు దూరంగా ఉన్న మారుమూల గ్రామీణ ప్రాంతాలకు దీంతో మేలు జరుగుతుంది. సినిమా స్థాయిని బట్టి టికెట్టు ధర రూ.30 నుంచి రూ.60వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ అంతటా ‘మన కూరగాయలు’ పథకం
Event-Date: | 10-May-2018 |
Level: | Local |
Topic: | Govt Schemes and Programmes |

- ఈ పథకం అమలుకు మార్కెటింగ్ శాఖనే నోడల్ ఏజెన్సీగా నియమించారు.
- పొలాల దగ్గరే టోకు ధరలకు కొని, పంపిణీ కేంద్రాలకు తెచ్చి గ్రేడింగ్, ప్యాకింగ్ చేసి విక్రయ కేంద్రాల్లో రైతుబజారు ధరకు విక్రయించడం ఈ పథకం లక్ష్యం.
- రోజూ బోయిన్‌పల్లి మార్కెట్ టోకు ధర ప్రకారం రైతుకు చెల్లించి కూరగాయలు సేకరిస్తారు. రైతుకు చెల్లించిన ధరకు 30 శాతానికి మించకుండా గరిష్ఠ చిల్లర ధర (ఎమ్మార్పీ) ఉండాలని నిర్ణయించారు.
- రాష్ట్రంలో అంతగా పండని ఆలుగడ్డ, ఉల్లిగడ్డ వంటి కూరగాయలను బోయిన్‌పల్లి టోకు ధరకు కొని విక్రయిస్తారు. వీటికి కొరత ఏర్పడితే దేశంలో ఏ పెద్ద మార్కెట్ నుంచి అయినా తెచ్చుకోవచ్చు.
- కూరగాయల ధరలు అనూహ్యంగా పెరిగితే వాటిని నియంత్రించడానికి రాష్ట్ర స్థాయి ‘మన కూరగాయల కమిటీ’ తగు నిర్ణయం తీసుకుంటుంది. ఈ కమిటీకి మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా ఉంటారు.
- వరుసగా 5 రోజులు కూరగాయల ధర పెరుగుతూ పోతే వెంటనే ఈ కమిటీ స్పందించాలి. ప్రతిరోజు ధరను సమీక్షించాలి. అంతకుముందు రోజుకంటే 50 శాతంకన్నా ఎక్కువ పెరిగితే నియంత్రించేందుకు నిర్ణయాలు తీసుకోవాలి.
- కూరగాయలు కోసిన తర్వాత ప్రజలకు అమ్మేలోగా అవి పాడవకుండా రైతులకు కోత అనంతర పద్ధతులపై శిక్షణ ఇస్తారు.
- ఉద్యాన, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ సహకారంతో కూరగాయల సాగు విస్తీర్ణానికి ఈ పథకం కింద రైతులను ప్రోత్సహిస్తారు.
- కూరగాయల సేకరణ, విక్రయాల్లో పాయింట్ ఆఫ్ సేల్ (పోస్) యంత్రాల ద్వారానే చెల్లింపులు జరపాలి.
- మన కూరగాయలు విక్రయ కేంద్రం ఏర్పాటు చేయాలంటే కనీసం 400 చదరపు అడుగుల స్థలంలో దుకాణం, దానిముందు వాహనాలు నిలపడానికి స్థలం ఉండాలి.
విజయ్ మాల్యా పరారీలో ఉన్న నిందితుడు : బ్రిటన్ హైకోర్టు
Event-Date: | 10-May-2018 |
Level: | International |
Topic: | Persons in News |

యురేనియం శుద్ధిని తిరిగి ప్రారంభిస్తాం : ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ
Event-Date: | 10-May-2018 |
Level: | International |
Topic: | Govt Schemes and Programmes |

JCPOAకు కట్టుబడి ఉంటామని ఇరాన్ అణు ఒప్పంద భాగస్వామ్య దేశాల ప్రకటన
Event-Date: | 10-May-2018 |
Level: | International |
Topic: | Govt Schemes and Programmes |

- ఇజ్రాయెల్, సౌదీలు స్వాగతించాయి.
- భాగస్వామ్య పక్షాలు దౌత్యం, సంప్రదింపుల ద్వారా ఇరాన్ అణు సమస్యకు పరిష్కారం కనుగొనాలని భారత్ పునరుద్ఘాటించింది.