Type Here to Get Search Results !

May-19

May-19 Current affairs articles

దివాళా పిటిషన్‌ దాఖలు చేసిన కేంబ్రిడ్జి అనలిటికా
బ్రిటన్‌కు చెందిన రాజకీయ సహా సంస్థ కేంబ్రిడ్జి అనలిటికా అమెరికా కోర్టులో స్వచ్ఛంద దివాళా పిటిషన్‌ను సమర్పించింది. న్యూయార్క్‌లోని సదరన్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో 2018 మే 16న చాప్టర్‌ 7 దివాళా పిటిషన్‌ను ఆ సంస్థ న్యాయవాది దాఖలు చేశారు. కోర్టుకు అందజేసిన పత్రాల ప్రకారం ఆ సంస్థ ఆస్తులు 1,00,001 డాలర్ల నుంచి 5 లక్షల డాలర్ల వరకు ఉండగా, అప్పు పది లక్షల డాలర్ల నుంచి కోటి డాలర్ల వరకు ఉన్నాయి. 2016 ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తరఫున ప్రచారం చేసిన ఈ సంస్థ ఫేస్‌బుక్‌ నుంచి వ్యక్తుల సమాచారాన్ని సేకరించిందన్న ఆరోపణలు ఎదుర్కొంది. 
-------------------------------------------------------------------------------------------
జస్టిస్‌ చలమేశ్వర్‌ సుప్రీంకోర్టులో చివరి పనిదినం 
Event-Date:19-May-2018
Level:National
Topic:Persons in News
సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి అయిన జస్టిస్‌ జె.చలమేశ్వర్‌ చివరి పనిదినమైన 2018 మే 18న ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ దీపక్‌ మిశ్రతో కలిసి ఒకే వేదికపై ఆసీనులయ్యారు. జస్టిస్‌ చలమేశ్వర్‌ 2018 జూన్‌ 22న పదవీ విరమణ చేయనున్నారు. వేసవి సెలవుల దృష్ట్యా మే 18నే కోర్టుకు చివరి పనిదినం.
  • సంప్రదాయం ప్రకారం పదవీ విరమణ చేసే న్యాయమూర్తులను చివరి రోజున ప్రధాన న్యాయమూర్తి పక్కన కూర్చోబెట్టి గౌరవిస్తుంటారు. ఈ మేరకు జస్టిస్‌ జె.చలమేశ్వర్‌ ఒకటో నెంబరు కోర్టులో జస్టిస్‌ దీపక్‌ మిశ్రా పక్కన ఆశీనులయ్యారు.
  • ప్రధాన న్యాయమూర్తి పనితీరుపై విలేకరుల సమావేశంలో విమర్శలు చేసిన జస్టిస్‌ చలమేశ్వర్‌ ఈ ఆచారాన్ని పాటిస్తారా లేదా అని న్యాయవాద వర్గాల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ ఇచ్చే వీడ్కోలు సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు.
  • ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు నుంచి బదిలీ అయినప్పుడు కూడా తాను వీడ్కోలు సమావేశానికి అంగీకరించలేదని, ఈ సారి కూడా దాన్నే పాటిస్తానని ఆయన బార్‌ అసోసియేషన్‌ సభ్యులకు చెప్పారు. అందుకే సందేహాలు నెలకొన్నాయి.
  • సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ దత్తా, న్యాయవాదులు ప్రశాంత్‌ భూషణ్‌, గోపాల్‌ శంకర్‌ నారాయణ్‌లు క్లుప్తంగా వీడ్కోలు ప్రసంగాలు చేశారు. అనంతరం జస్టిస్‌ చలమేశ్వర్‌ ముకుళిత హస్తాలతో కోర్టు రూంను వీడారు.
తెలంగాణకు 2 బిజినెస్‌ వరల్డ్‌ అవార్డులు
Event-Date:19-May-2018
Level:Local
Topic:Awards and honours
తెలంగాణ రాష్ట్రానికి రెండు బిజినెస్‌ వరల్డ్‌ అవార్డులు దక్కాయి. టీ-యాప్‌ ఫోలియో మొబైల్‌ యాప్‌ ద్వారా పౌర సేవలు అందిస్తున్నందుకు బెస్ట్‌ ఇంప్లిమెంటేషన్‌ ఫర్‌ సిటిజన్‌ సర్వీస్‌, బెస్ట్‌ ఇంప్లిమెంటేషన్‌ ఫర్‌ డిజిటల్‌ పేమెంట్స్‌ అవార్డులు దక్కాయి. 2018 మే 18న డిల్లీలో జరిగిన బిజినెస్‌ వరల్డ్‌ 4వ డిజిటల్‌ ఇండియా సమ్మిట్‌లో ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌, ఓఎస్డీ రమాదేవి స్వీకరించారు. 

































Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.