¤ 300 మంది మరణాలకు మౌనసాక్షిగా ఉన్న అమెరికాకు చెందిన మిచెల్ లియోన్స్ తన అనుభవాలతో రాసిన 'డెత్ రో
'పుస్తకాన్ని విడుదల చేశారు. » వృత్తిపరంగా పాత్రికేయురాలైన మిచెల్ టెక్సాస్ నేరన్యాయ శాఖ ప్రతినిధిగా వ్యవహరిస్తోంది. 2000 నుంచి 2012 మధ్య టెక్సాస్ అమలు చేసిన 300 మంది దోషుల మరణశిక్షలకు ఆమె చట్టరీత్యా సాక్షిగా వ్యవహరించింది.
మే - 26
¤ భారత గూఢచర్య విభాగం 'రిసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)' మాజీ అధిపతి ఎ.ఎస్. దులాత్‌తో కలిసి పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ మాజీ అధిపతి దురానీ 'ద స్పై క్రానికల్స్ : రా, ఐఎస్ఐ అండ్ ద ఇల్యూషన్ ఆఫ్ పీస్' అనే పుస్తకాన్ని రాశాడు.» ఈ పుస్తకంపై పాక్ సైన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాది లాడెన్‌ను హతమార్చేందుకు అబోటాబాద్‌లో అమెరికా సీల్స్ కమాండోలు దాడిచేసే విషయం అప్పటి ప్రధాని యూసఫ్ రజా గిలానీకి తెలుసని దురానీ ఈ పుస్తకంలో పేర్కొన్నాడు. పాక్ నిర్బంధంలో ఉన్న భారతీయుడు కుల్‌భూషణ్ జాదవ్ కేసుపై పాక్ వ్యవహార శైలి సరిగా లేదని కూడా ఆయన విమర్శించాడు.
మే - 27
¤ తమిళనాడు కాంగ్రెస్ మీడియా ఇన్‌ఛార్జి ఎ.గోపన్న రచించిన 'జవహర్‌లాల్ నెహ్రూ యాన్ ఇలస్ట్రేటెడ్ బయోగ్రఫీ' పుస్తకాన్ని దిల్లీలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆవిష్కరించారు. మొదటి ప్రతిని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలకు అందజేశారు.