Type Here to Get Search Results !

UPSC Jobs-2020 Defence,Navy

UPSC Jobs: ఇంటర్ అర్హతతో డిఫెన్స్, నేవీలో 413 జాబ్స్... జూలై 6 లాస్ట్ డేట్


UPSC NDA and NA Exam II 2020 |

ఇంటర్ పాసయ్యారా? మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ఆర్మీ, నేవీలో పలు ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.


1. ఆర్మీలో ఉద్యోగం చేయడం మీ కలా? డిఫెన్స్‌లో పనిచేయాలనుకుంటున్నారా? నేవీలో ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నారా? మీకు శుభవార్త. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC నేషనల్ డిఫెన్స్ అకాడమీ-NDA, నావల్ అకాడమీ-NA ఎగ్జామినేషన్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది.

2. ప్రతీ ఏడాది రెండుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తూ ఉంటుంది యూపీఎస్‌సీ. గతంలోనే 418 పోస్టుల భర్తీకి ఎన్‌డీఏ ఎన్ఏ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పటికే పరీక్ష జరగాల్సి ఉండగా కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు ఎన్‌డీఏ ఎన్ఏ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది.

3. ఈ రెండు నోటిఫికేషన్లకూ ఒకేసారి సెప్టెంబర్ 6న పరీక్ష నిర్వహించనుంది. పరీక్ష ఒకేసారి నిర్వహించినా ఫలితాలు వేర్వేరుగా విడుదలవుతాయి. రెండు నోటిఫికేషన్ల ద్వారా నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీలో 831 పోస్టుల్ని భర్తీ చేస్తోంది యూపీఎస్‌సీ.

4. ప్రస్తుతం రెండో నోటిఫికేషన్‌లోని 413 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 6 చివరి తేదీ. అడ్మిట్ కార్డుల్ని 2020 ఆగస్ట్‌లో రిలీజ్ చేస్తారు. 2020 సెప్టెంబర్ 6న పరీక్ష ఉంటుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.