Type Here to Get Search Results !

భారతదేశ చరిత్ర

1.ప్రాచీన భారత దేశ చరిత్ర:
   1.1  చరిత్రకు  పూర్వ యుగము

1) చరిత్ర పూర్వ యుగం అని దేన్ని అంటారు ?
జ: చరిత్ర రచనకు లిఖితపూర్వక ఆధారాలు లేని కాలం
2) ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అంటే ఏంటి ?
జ: లిఖిత పూర్వక ఆధారాలు దొరికినా, లిపి అర్థం కాకపోవడం
3) చారిత్రక యుగం అని దేన్ని అంటారు ?
జ: చరిత్ర రచనపై లిఖిత ఆధారాలు లభించిన కాలం
4) దేశంలో చరిత్ర పూర్వయుగం గురించి పరిశోధనలు ప్రారంభించింది ఎవరు ?

జ: రాబర్ట్ బ్రూస్ ఫుట్

5) భారత పురావస్తు శాస్త్ర పితామహుడు అని ఎవర్ని అంటారు ?
జ: కన్నింగ్ హోం
6) భారత్ లో ఆర్కియాలజీ శాఖను 1861లో స్థాపించారు. అయితే దీనికి మొదటి అధ్యక్షుడు ఎవరు ?
జ: అలెగ్జాండర్ కన్నీంగ్ హోం
7) పాత రాతి పనిముట్లు వేటితో తయారయ్యాయి ?
జ: క్వార్ట్జ్ జైట్, హెమటైట్, గులకరాయి, సిలికాన్, శింగల్, లైమ్ స్టోన్ తో
8 పాత రాతి యుగం నాటి ప్రదేశాలు ఎక్కడ కనిపించాయి ?
జ: సోహాన్ వ్యాలీ
9) తొలి పాతరాతి యుగంలో లభించిన పనిముట్లు వేటితో తయారు చేశారు ?
జ: గులకరాళ్ళతో పెబ్బల్ టూల్స్)
10) పెబ్బల్ టూల్స్ ను కనుగొన్నదెవరు ?
జ: రాబర్ట్ బ్రూస్ ఫుట్
11) మధ్యపాత రాతి యుగంలో వాడిన పరికరాలను ఏమంటారు ?
జ: ప్లేక్ టూల్స్
12) సూక్ష్మ పాత రాతియుగంలో మానవజాతిని ఏమని పిలుస్తారు ?
జ: హోమో సెపియన్స్
13) సూక్ష్మ పాతరాతి యుగంలో ముఖ్యమైన పనిముట్లు ఏవి ?
జ: బ్లేడు, ఎముకల పనిముట్లు
14) శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు ?
జ: ఎపిగ్రఫీ
15) నాణేలు అధ్యయనం చేసే శాస్త్రం ఏది ?
జ: న్యూమిస్ మాటిక్స్
16) పురాతన రాతప్రతులను అధ్యయనం చేయడాన్ని ఏమంటారు ?
జ: పాలియోగ్రఫీ
17) మానవుడు వేటాడం ఎప్పుడు నేర్చుకున్నాడు ?
జ: సూక్ష్మ పాత రాతి యుగం
18)కొత్త రాతి యుగం నాటి ప్రజల జీవన విధానానని ‘ప్రి హిస్టోరిక్ టైమ్స్’అనే పుస్తకంలో రాశారు. దీన్ని రచించినది ఎవరు ?
జ: జాన్ లుబో
19) కొత్త రాతి యుగంలో స్థావరాలు ఎక్కువగా ఎక్కడ బయటపడ్డాయి ?
జ: నర్మదాలోయలోని బెలాన్ వ్యాలీ (వింధ్య పర్వతాలు)
20) కొత్త రాతి యుగానికి తామ్ర యుగం అని పేరెందుకు వచ్చింది ?
జ: రాగి, కంచు వస్తువుల వాడకంతో
21) కొత్త రాతి యుగంలో ఏయే పంటలు పండేవి ?
జ: రాగులు, ఉలవలు, పెసర్లు
22) కుమ్మరి సారె, మట్టిపాత్రల తయారీ ఏ యుగంలో వచ్చాయి ?
జ: కొత్త రాతి యుగం
23) భారత దేశంలో బంగారు నాణేలు జారీ చేసింది ఎవరు ?
జ: ఇండో గ్రీకులు
24) భారత్ లో మొదటిగా శాసనాలు వేయించింది ఎవరు ?
జ: అశోకుడు
25) జీవుల అవశేషాల ఆధారంగా వయసును నిర్ణయించే విధానాన్ని ఏమంటారు?
జ: రేడియ కార్బన్ డేటింగ్ పద్దతి
26) యురేనియం డేటింగ్ మెథడ్ అంటే ఏంటి ?
జ: శిలల వయస్సు నిర్ధారించే పద్దతి
27) కాల్చిన వస్తువులు, ఇటుకలు, బూడిదల వయస్సు కనుగొనే పద్దతిని ఏమంటారు ?
జ: థర్మోలుమెనెన్స్
28) చెట్ల కాండాల్లో గత వృత్తాల ఆధారంగా వాటి వయస్సు కనుగొనడాన్ని ఏమంటారు ?
జ: డెండ్రో క్రోనాలజీ
29) మానవుడు కుండలు, కుమ్మరి చక్రంను ఎప్పుడు తయారు చేశాడు ?
జం నవీన శిలా యుగంలో
30) భారత్ లో తొలిసారిగా కుమ్మరి చక్రం ఎక్కడ లభించింది ?
జం మెహ్రఘర్ ( ఇప్పటి పాకిస్థాన్ లో ఉంది)
31) ప్రపంచంలోనే మొదట వరిని పండించిన ప్రాంతం ఏది ?
జ: కొల్దివా (ఉత్తరప్రదేశ్)
32) ప్రపంచంలోనే మొదట పత్తిని పండించిన ఆధారాలు ఎక్కడ దొరికాయి ?
జ: మహారాష్ట్రలోని నెవాసా

1.2 ప్రాచీన తెలంగాణ చరిత్ర 


1) రాష్ట్రంలో కొత్తరాతి యుగం నాటి మట్టి పాత్రలు ఎక్కడ బయటపడ్డాయి ?
జ: మహబూబ్ నగర్ జిల్లాలో ఉట్నూరులో.
2) బూడిద కుప్పలు, 13 రకాల మట్టి పాత్రలను ఎక్కడ కనుగొన్నారు ?
జ: ఉట్నూరులో
3) ఇనుము వాడకం ఏ యుగంలో ప్రారంభమైంది ?
జ: లోహ యుగం (బృహత్ శిలా యుగం)
4) తెలంగాణలో బృహత్ శిలాయుగం సమాధులు ఎక్కడ బయటపడ్డాయి ?
జ: మహబూబ్ నగర్ జిల్లాలో.
5) బృహత్ శిలా యుగానికి చెందిన సమాధులను ఏమని పిలుస్తారు ?
జ: కెయిరన్ లేదా రాక్షసగుళ్ళు (డాల్మెన్)
6) రాక్షస గుళ్ళల్లో వేటిని ఉంచేవారు ?
జ: మానవుల ఎముకలు, ఇనుప పనిముట్లు, రాగి, మట్టి పాత్రలు
7) రాష్ట్రంలో మెన్ హిర్ సమాధులు ఎక్కడ బయటపడ్డాయి ?
జ: నల్లగొండ జిల్లా వలిగొండలో
8) తెలంగాణలో చిస్ట్ సమాధులు ఎక్కడ ఉన్నాయి ?
జ: ఆదిలాబాద్ తప్ప అన్ని జిల్లాల్లో
9) డాల్మన్ శవపేటికలు రాష్ట్రంలో ఎక్కడ బయటపడ్డాయి ?
జ: మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ దగ్గర
10) చనిపోయిన వారికి గుర్తుగా సమాధిపై పెద్ద శిలా స్థంభం నిలిపి ఉంచే సమాధిని ఏమంటారు ?
జ: మెన్ హిర్ సమాధి
11) రాతి శవపేటికను గోయిలో పెట్టకుండా భూమ్మీద పెట్టి, దాని చుట్టూ రాళ్ళు పేర్చే సమాధిని ఏమంటారు?
జ: డాల్మన్ సమాధి
12) ఏనుగు ఆకారం ఉన్న శవపేటిక రాష్ట్రంలో ఎక్కడ బయటపడింది ?
జ: ఏలేశ్వరం
13) రాతి పూసల తయారీ కేంద్రం ఎక్కడ బయటపడింది ?
జ: కోటి లింగాల
14) గుర్రం అస్థిపంజరాలు బయటపడ్డ ప్రదేశం ఏది ?
జ: పోచంపాడులో
15) నల్గొండ జిల్లాలోని ఏ గుట్టల్లో ఫిల్మ్ నగర్ ఏర్పాటు చేయాలని రాష్ట్రం భావిస్తోంది ?
జ: రాచకొండ గుట్టలు
16) శ్రమ విభజన, పురుషాధిక్యం కలిగిన సమాజం ఏ యుగంలో ప్రారంభమైంది ?
జ: తామ్ర శిలా యుగం
17)వరిని పండించడం ఎప్పటి నుంచి మొదలైంది ?
జ: బృహత్ శిలా యుగంలో

1.3 సింధు నాగరికత

1) సింధూ నాగరికత ఎప్పుడు బయటపడింది ? దాని తవ్వకాలకు నాయకత్వం వహించింది ఎవరు
జ: 1921లో సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో
2) భారత దేశపు మొదటి సర్వే జనరల్ ఎవరు ?
జం సర్ జాన్ మార్షల్
3) సర్ జాన్ మార్షల్ (ఫాక్ చరిత్ర పితామహుడు) రాసిన పుస్తకం పేరేంటి ?
జ: మెహంజోదారో అండ్ ది ఇండస్ సివిలైజేషన్
4) దేశంలో సింధు నాగరికత ప్రదేశాలు ఎక్కువగా ఎక్కడ బయటపడ్డాయి ?
జ: గుజరాత్ లో
5) మొదటిసారి సింధు తవ్వకాల్లో బయటపడిన ప్రాంతం ఏది ?
జ: హరప్పా (1921లో)
6) రాగి, తగరంల మిశ్రమం ఉన్న నాగరికత ఏది ?
జ: కాంస్య యుగ నాగరికత
7) మెసపటోమియా నాగరికత ఏ నదుల మద్య పుట్టింది?
జ. యాప్రటీస్ - టైగ్రిస్.
8) ఈజిప్టు నాగరికత ఏ నది తీరాన తెలిసింది?
జ. నైలు నది
9) సింధు నాగరికతలో ప్రముఖమైనది ఏది ?
జ. పట్టణ నాగరికత.
10) సింధు నాగరికతలో ముఖ్యమైన ఓడరేవు ఏది?
జ : లోధోల్
11) సింధు ప్రజలు ఏ దేవుడిని ఆరాధించేవారు?
జ : పశుపతి మహాదేవుడు (శివుడు), అమ్మతల్లి
12) సింధువుల లిపి ఏంటి ? దీనిని ఏమని పిలుస్తారు ?
జ: బొమ్మల లిపి లేదా సర్పలిపి
13) సింధు నాగరికత నగరాలన్నింటిలో అతి పెద్ద నగరం ఏది?
జ: మెహంజదారో.
14) హరాప్పా నగరానికి గల ఇంకొక పేరు ఏమిటి?
జ. ధాన్యాగారాల నగరం.
15) మొహంజదారో అనగా ఏమిటి?
జ. మృతదేహాల దిబ్బ.
16) లోధాల్ గల ఇంకొక పేరు ఏమిటి?
జ. కాస్మోపాలిటన్ సిటీ.
17) సింధు ప్రజలకు తెలియని లోహం ఏది ?
జ : ఇనుము.
18) భారతదేశంలో అతి పురాతన నాగరికత ఏది?
జ. సింధు నాగరికత.
19) రక్షణ గోడ కోట లేని ఏకైక నగరం ఏది ?
జ: చాన్హుదారో
20) రోడ్ల నిర్మాణం చదరంగాన్ని పోలి ఉండేది గ్రిడ్ వ్యవస్థ. ఇది లేని నగరం ఏది ?
జ: బన్వాలీ
21) భూగర్భ మురుగు నీరు వ్యవస్థ కలిగిన నగరం ఏది ?
జ: బన్వాలీ
22) గ్రిడ్ వ్యవస్థలో నిర్మించిన ఏకైక నగరం ఏది ? అలాగే కట్టడానికి ఉదాహరణ ?
జ: చండీగఢ్ నగరం, తాజ్ మహల్
23) సిందు నాగరికత కాలంలో ఏ వ్యవస్థ ఉండేది ?
జ: మాతృ స్వామ్య వ్యవస్థ
24) సింధు ప్రజల ప్రధాన పంటలు ఏవి ?
జ: గోధుమ, బార్లీ, వరి, నువ్వులు, పత్తి
25) సింధు ప్రజలకు గుర్రం గురించి తెలియదని అంటారు. కానీ గుర్రం ఆనవాళ్ళు ఎక్కడ దొరికాయి ?
జం లోథాల్ (టెర్రకోట గుర్రం బొమ్మ), సుర్కోటడ (గుర్రం అస్థిపంజరం)
26) ప్రపంచంలో మొదటిసారిగా వెండిని వాడిన వారెవరు?
జ: సింధు ప్రజలు
27) సింధు ప్రజలు తూకాల్లో ఏ గుణిజాలను వాడేవారు ?
జ: 16 గుణిజాలు
28) సింధూ నాగరికత ఆర్యుల దండయాత్రతో అంతమైందని ఎవరు చెప్పారు ?
జ: మార్టిమర్ వీలర్ (1945) ఇండియన్ సివిలైజేషన్ పుస్తకంలో
29) జీఎఫ్ డేల్స్ ప్రకారం 7 సార్లు అంతమై పునర్ నిర్మించిన పట్టణం ఏది ?
జ: మొహంజోదారో
30) సింధు నాగరాల్లో రాతి వాడకం ఎక్కడ కనిపించింది ?
జ: హరప్పా


1.4 ఆర్యుల నాగరికత

1) ఆర్యులు ఎక్కడనుంచి వచ్చారు?
జ : మధ్య ఆసియా.
2) ఆర్య అంటే ఏంటి?
జ: శ్రేష్టుడు, సువర్ణుడు, గౌరవనీయులు
3) ఆర్యుల మొట్ట మొదటి దండయాత్రికుడు ఎవరు?
జ: దివదాసుడు.
4) ఆర్య సంస్కృతిని దక్షిణ భారతదేశానికి విస్తరించినవాడు ఎవరు?
జ: అగస్త్యుడు.
5) తొలి వేదకాలంలో ఆర్య సమాజాన్ని పరిపాలించేవారిని ఏమని పిలిచేవారు;
జ: రాజన్
6) మంత్రాలను పఠించేవారిని ఏమని అంటారు?
జ: హోత్రి.
7) ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయి?
జ.108.
8) మహాభారతాన్ని ఎవరు రచించారు?
జ: వేదవ్యాసుడు.
9) మహాభారతాన్ని మరో పేరుతో ఏమని పిలుస్తారు?
జ: పంచమవేదం.
10) తమిళనాడులో పంచమ వేదం ఏది?
జ: తిరుకురల్.
11) నాట్యశాస్త్ర్రాన్ని భరతుడు ఏ భాషలో రచించాడు?
జ: సంస్కృతం.
12) సుధాముడి ప్రధాని ఎవరు?
జ: విశిష్ట.
13) పాందవులు కౌరవులు ఏ తెగకుచెందినవారు?
జ: కురు.
14) ఆర్యుల యుద్ద వీరుడు ఎవరు?
జ: ఇంద్రుడు.
15) గాయత్రి మంత్ర్రం ఎవరికి సంబంధించినది?
జ: సావిత్రిదేవి( సౌర దేవత)
16) గాయత్రి మంత్రం ఏ వేదంలో ఉంది ?
జ: రుగ్వేదం
17) శూద్ర అనే పదం మొదట ఎక్కడ బయటపడింది ?
జ: పురుష సూక్తంలో
18) సామవేదం దేనికి సంబంధించినది ?
జ: సంగీతానికి (భారత్ సంగీతంలో మొదటి గ్రంథం)
19) యజ్ఞాలు, యాగాల క్రతువులను గురించి తెలిపే వేదం ఏది ?
జ: యజుర్వేదం
20) భూత ప్రేత పిశాచాలు గురించి తెలిపిన వేదం ఏది ? దీన్ని ఎవరు రచించారని చెబుతారు ?
జ: అధర్వణ వేదం ( ఆర్యేతరులు)
21) వైద్యం గురించి తెలిపిన మొదటి గ్రంథం ఏది ?
జ: అధర్వణ వేదం
22) అతి పురాతన పెద్ద బ్రాహ్మణం అని దేన్ని అంటారు ?
జ: శతపథ బ్రాహ్మణం
23) అడవుల్లో ఉండే మనులు, రుషులకు సంబంధించిన అటవీ గ్రంథాలు అని వేటిని అంటారు ?
జ: అరణ్యకాలు
24) జ్ఞానం ద్వారా మోక్షం పొందవచ్చని ఏవి చెబుతున్నాయి ?
జ: ఉపనిషత్తులు
25) మొత్తం ఉపనిషత్తుల సంఖ్య ఎంత ఉంటుంది ?
జ: 108
26) సత్యమేవ జయతే ఉన్న ఉపనిషత్ ఏది ?
జ: ముండకోపనిషత్
27) ఆర్యులు టిబెట్ నుంచి వచ్చారని సిద్ధాంతీకరించనది ఎవరు ?
జ: స్వామి దయానంద సరస్వతి
28) ఆర్యులు సప్త సింధు ప్రాంతం నుంచి వచ్చారని తెలిపినది ఎవరు ?
జ: ఎ.సి.దాస్



1.5 తొలివేద మలివేద నాగరికత

1) తొలివేదకాలంలో గ్రామాధిపతిని ఏమని పిలిచేవారు ?
జ: గ్రామణి
2) తొలివేద కాలంలో రాజుకి సలహా ఇచ్చేవి ఏవి ?
జ: సభ, సమితి ( ఇవి కాకుండా గణ, విధాత కూడా ఉండేవి)
3) గణ నాయకుడిని ఏమని పిలిచే వారు ?
జ: రాజన్, సామ్రాట్
4)తొలి వేద కాలంలో సంగిహిత్రి అంటే ఎవరు ?
జ: కోశాధికారి
5) తొలి వేద కాలంలో పన్నులు వసూలు చేసే అధికారిని ఏమనేవారు ?
జ: భాగదుగ
6) ఆర్యులకు ఇష్టమైన పానీయం ఏది ?
జ: సోమ
7) ఆర్యులు మెడలో ధరించే బంగారు నగను ఏమంటారు ?
జ: నిష్క
8) తొలి వేద కాలంలో విద్యావంతులైన స్త్రీలు ఎవరు ?
జ: లోపాముద్ర, ఘోష, అపాల, విశ్వావర
9) తొలి వేద కాలలో వ్యవసాయదారుడిని ఏమని పిలిచేవారు ?
జ: కృషివల
10) ఈ కాలంలో ఎంతమంది దేవతలు ఆరాధించేవారు ?
జ: 33 మంది దేవతలు
11) తొలి వేద కాలంలో ఇంద్రుడికి ఏ స్థానం ఇచ్చారు ?
జ: మొదటి స్థానం, యుద్ధ దేవుడు
12) వైద్యానికి అధిపతులు ఎవరు ?
జ: అశ్వినీ దేవతలు
13) రుగ్వేద కాలంలో దేవాలయాలు లేవు, విగ్రహారాధన లేదు. మరి పూజా విధనాలు ఏంటి ?
జ: ప్రార్థనలు, శ్లోకాలు, యజ్ఞాలు, యాగాలు
14) రుగ్వేద కాలంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన దేవత ఎవరు ?
జం సరస్వతి
15) రుగ్వేదంలో నదుల్లో ఉత్తమమైనదిగా వర్ణించినది నది ఏది ?
జ: సరస్వతి
16) రుగ్వేద కాలంలో ఉన్న వివిధ నదులకు ఇప్పటి పేర్లేంటి ?
జ: రావి (ఐరావతి) - పరూషిణి
సట్లెజ్ - శతుద్రి
బియాస్ - విపాస, అర్గికేయ
17) ఆసియాలో గుర్రపు స్వారీని పరిచయం చేసింది ఎవరు ?
జ: ఆర్యులు
18) తొలి వేద కాలంలో జరిగిన అతి ప్రధాన యుద్ధం ఏది ?
జ: దశరాజు గణ యుద్ధం
19) గాయత్రి మంత్రం రుగ్వేదంలో ఏ మండలంలో ఉంది ?
జ: 3 వ మండలంలో
20) మలివేద కాలంలో ప్రసిద్ధమైన వేదాలు ఏవి ?
జ: సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదం
21) మలివేద కాలంలో ప్రధాన వృత్తి ఏంటి ?
జ: వ్యవసాయం
22) మలివేద కాలంలో మొదట ఇనుమును ఉపయోగించింది ఎక్కడ ?
జ: గాంధార (ఆఫ్ఘనిస్తాన్ )
23) మలివేద కాలంలో వస్తుమార్పిడి స్థానంలో నాణేలను ప్రవేశపెట్టారు. అయితే బంగారు, వెండి నాణేలను ఏమని పిలిచేవారు ?
జ: శతమాన - బంగారు నాణెం, కర్షాపణ - వెండి నాణెం
24) చాతుర్వర్ణ వ్యవస్థ ఏ కాలంలో తీవ్ర స్థాయికి చేరింది ?
జ: మలి వేద కాలంలో
25) స్త్రీలు స్వేచ్ఛను కోల్పోయారు. స్త్రీ విద్యను నిరాకరించారు... ఇది ఏ కాలంలో జరిగింది ?
జ: మలివేద కాలంలో
26) పెద్దల అంగీకారంతో శాస్త్ర ప్రకారం జరిగే వివాహాన్ని ఏమంటారు ?
జ: బ్రహ్మ వివాహం
27) యోగ దర్శనాన్ని రూపొందించింది ఎవరు ?
జ: పతంజలి
28) ఆర్యుల యుద్ధ దేవత ఎవరు ?
జం ఇంద్రుడు
29) ఆర్యుల భాష ఏది ?
జ: సంస్కృతం
30) ఆర్యతెగల మధ్య వరూష్టి నదీతీరంలో జరిగిన ఏ యుద్ధంలో భరత తెగ విజయం సాధించింది ?
జ: దశరాజ యుద్ధం


1.6 జ్ఞానోదయ యుగం


1) 6వ శతాబ్దంలో ఎన్ని మతాలు ఆవిర్బవించాయి?
జ: 62
2) బౌద్ద మతాన్ని స్థాపించినది ఎవరు?
జ: గౌతమ బుద్దుడు.
3) బుద్ధుడికి జ్ఞానోదయం ఎక్కడ అయింది?
జ: బోధ్ గయ.
4) బుద్ధుడికి రావిచెట్టు దగ్గర ఎన్ని రోజులు తపస్సు చేశాడు?
జ.49 రోజులు
5) బౌద్దమతాన్ని ఏ ఉంపుడుగత్తె స్వీకరించింది?
జ: ఆమ్రపాలి.
6) బుద్ధుడు ఎప్పుడు చనిపోయారు?
జ: క్రీ.పూ.483, కుశీనగరం.
7) భారతదేశంలో అతి పెద్ద స్దూపం ఏది?
జ: సాంచీ.
8) జైన మతాన్ని స్దాపించినది ఎవరు?
జ: రుషభనాధుడు
9) జైనమత నిజమైన స్థాపకుడు ఎవరు?
జ. వర్దమాన మహావీరుడు.
10) వర్ధమాన మహావీరుడికి జ్ఞానోదదయం ఎక్కడ అయింది?
జ: జృంబిక వనం.
11) బౌద్ద గ్రంథాలు ఏ భాషలో రచించారు?
జ : పాళీ.
12) వర్ధమాన మహావీరునికి సమానమైనవారెవరు?
జ: గౌతమబుద్దుడు.
13) ఇండియన్ ఐన్ స్టీన్ అని ఎవరిని అంటారు?
జ) ఆచార్య నాగార్జునుడు.
14) బింబిసారుని కాలంలో మగధ రాజధాని ఏది.
జ) గిరివజ్రపూర్, రాజగృహం.
15) అలెగ్జాండర్ కు సమానమైన నందరాజు ఎవరు?
జ) ధననందుడు.
16) కాశీ రాజ్యానికి రాజధాని ఏది?
జ) వారణాసి.



1.7 మౌర్యులు

1) మౌర్యులు ఏ వంశానికి చెందినవారు? (బౌద్ధ, జైన గ్రంథాల ప్రకారం)
జ. క్షత్రియ వంశం.
2) మౌర్య సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు?
జ.) చంద్రగుప్త మౌర్యుడు.
3) చంద్ర గుప్తమౌర్యుడు ఎవరిని ఓడించాడు?
జ) సెల్యూకస్ నికేటర్.
4) అర్ధశాస్త్ర్రాన్ని ఎవరు రచించారు?
జ) చాణుక్యుడు (కౌటిల్యుడు)
5) అలెగ్జాండర్ గురువు ఎవరు?
జ) అరిస్టాటిల్.
6) అరిస్టాటిల్ ఎప్పుడు చనిపోయాడు ?
జ) క్రీ.పూ.323 (33 ఏళ్ల వయస్సులో)
7) అలెగ్జాండర్ కాలంలో ఏ శిల్సకళ అబివృద్ది చెందింది?
జ) గాంధార.
8) జంతు బలులను నిషేధించిన మౌర్య చక్రవర్తి ఎవరు?
జ) అశోకుడు.
9) పాటలీపుత్రం ఏ నది ఒడ్డున ఉన్నది?
జ) గంగాసోన్.
10) కౌటిల్యుడి అర్థశాస్త్రం దేని గురించి చెబుతుంది ?
జ: ప్రభుత్వానికి రాజకీయ ఆర్థిక వ్యవస్థకూ సంబంధించిన గ్రంథం
11) కౌటిల్యుడి అర్థశాస్త్రం ఏ భాషలో ఉంది ? దాన్ని ఇంగ్లీషులో రాసిందెవరు?
జ: సంస్కృతంలో. ఆర్ కామశాస్త్రి దాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించాడు
12) మెగస్తనీస్ ఎవరు ?
జ: చంద్రగుప్తుడి ఆస్తానంలో సెల్యూకస్ నికేటర్ రాయబారి
13) మెగస్తనీస్ రాసిన గ్రంథం ఏది ? దేని గురించి ఇందులో ఉంది ?
జ: ఇండికా (అలభ్యం), భారత్ లో మౌర్యుల పాలన, సప్తవర్ణ వ్యవస్థ, బానిసత్వం, వడ్డీ వ్యాపారం లేకపోవడం మొ.అంశాలు ఉన్నాయి
14) మౌర్యుల కాలానికి సంబంధించి సామాజిక, ఆర్థిక పరిస్థితులను తెలిపిన బౌద్ధుల గ్రంథమేది ?
జ: జాతక కథలు
15) శ్రీలంకలో బౌద్ధ మత వ్యాప్తికి అశోకుడు చేసిన కృషిని వివరించే గ్రంథాలు ఏవి ?
జ: దీపవంశం, మహా వంశం
16) చంద్రగుప్త మౌర్యుడు జైనమతం అవలంభించడాన్ని గురించి వివరించే జైన గ్రంథం ఏది ?
జ: పరిశిష్ట పర్వం
17) బిందుసారుడిని గ్రీకులు ఏమని పిలిచేవారు ?
జ: అమిత్రోకేటస్ ( అంటే అమిత్రఘాతుడు లేదా శత్రు సంహారుడు)
18) శ్రీలంకలో బౌద్ధమత ప్రచారానికి వెళ్లినది ఎవరు ?
జ: మహేంద్రుడు, సంఘమిత్ర (అశోకుడి కొడుకు, కూతురు)
19) బుద్ధుడు జ్ఞానోదయం అయిన ఓ చెట్టు మొలకలను సిలోన్ పంపారు. ఏ చెట్టు అది ?
జ: రావి చెట్టు
20) మౌర్యుల కాలంలో సన్నిధాత అంటే ఎవరు ?
జ: ప్రధాన కోశాధికారి


1.8 గుప్తులు


1) గుప్త వంశ స్దాపకుడు ఎవరు?
జ) శ్రీ గుప్తుడు.
2) కాళిదాసుకు గల ఇంకొక పేరు ఏమిటి?
జ) ఇండియన్ షేక్స్ పియర్.
3) సున్నా సిద్దాంతాన్ని వివరించినదెవరు?
జ) ఆర్యభట్ట.
4) వరామామిహిరుడి ముఖ్యమైన గ్రంధం ఏది?
జ) బృహత్ సంహిత.
5) ఎవరి కాలంలో చైనా యాత్రికుడు పాహియాన్ భారత్ ను సందర్శించాడు ?
జ: రెండో చంద్రగుప్తుడి కాలంలో
6) హుయాన్‌త్సాంగ్‌ ఎవరి కాలంలో భారత్ ను సందర్శించాడు ?
జ: హర్షుడి కాలంలో
7) హరిసేనుడు రచించిన అలహాబాద్ ప్రశస్తి లో ఎవరి గురించిన ప్రస్తావన ఉంది ?
జ: సముద్ర గుప్తుడు విజయాలు
8) గుప్తుల కాలంలో జిల్లాను విషయం అంటారు. దీనికి అధిపతి ఎవరు ?
జ: ఆయుక్త లేదా విషయపతి
9) అంకగణితం, రేఖా గణితం, బీజగణితం, త్రికోణమితి అనే గణితశాస్త్ర విభాగాలను వివరించే గ్రంథం ఏది ?
జ: ఆర్యభట్టీయం ( ఆర్యభట్టు రాశారు )
10) వస్తువులను ఆకర్షించి, అట్టిపెట్టుకోవడం భూమి స్వభావం. ప్రకృతి నియమం ద్వారా వస్తువులన్నీ భూమ్మీదకు పడతాయని న్యూటన్ కంటే ముందే చెప్పిన భారతీయుడు ఎవరు ?
జ: బ్రహ్మ గుప్తుడు (ఈయన రచనలు: బ్రహ్మస్ఫుట సిద్ధాంతం, ఖందఖాద్యకం



1.9 గుప్తుల అనంతర యుగం


1) హర్షవర్దనుడు ఏ కాలానికి చెందినవాడు?
జ) క్రీ.శ. 606-647
2) హర్షుడి కాలంలో వచ్చిన చైనా బౌద్ధయాత్రికుడు ఎవరు ? ఏ గ్రంథం రచించాడు?
జ: హుయాన్‌త్సాంగ్‌ , సీ-యూ-కీ అనే గ్రంథం
3) హర్షవర్ధనుడి కాలంలో ఏ యూనివర్సిటీ ప్రపంచ ప్రఖ్యాత పొందింది?
జ) నలంద యూనివర్శిటీ
4) చాళుక్య వంశ స్థాపకుడెవరు ? అతని రాజధాని ఏది ?
జ: మొదటి పులకేశి - బాదామి (వాతాపి) రాజధాని
5) పల్లవ రాజులందరిలో గొప్ప రాజు ఎవరు ?
జ: మొదటి నరసింహ వర్మ (వాతాపి కొండ అని బిరుదు ఉంది)
6) ఉండవల్లలోని అనంతేశ్వరాలయం ఎవరి కాలంలో నిర్మించారు ?
జ: పల్లవులు
7) పల్లవ రాజైన మహేంద్ర వర్మ ఏ గ్రంథం రచించాడు ?
జ: మత్త విలాస ప్రహసనం
8) పల్లవుల కాలంలో నిర్మితమైన ఏకశిలా ఆలయాలు ఎక్కడ ఎక్కువగా కనిపిస్తాయి ?
జ: మామిళ్ళ పురం


2.మధ్యయుగ భారతదేశ చరిత్ర:

  2.1ముస్లిం ల దండయాత్రలు


1) మొదటిసారిగా ముస్లింల దండయాత్ర ఎప్పుడు జరిగింది?
జ) క్రీ.శ.712.
2) మహమ్మద్ గజిని బిరుదులు ఏమిటి?
జ) షికన్, యమిన్ ఉద్ దౌలా.
3) భారతదేశంపై మహ్మద్ గజనీ ఎన్నిసార్లు యుద్దం చేశాడు?
జ) 17సార్లు.
4) యుద్దంలో ఘోరీని ఎవరు ఓడించారు?
జ) మౌంట్ అబూ,1178.
5) ఢిల్లీని ఎవరు ఆక్రమించారు?
జ) కుతుబుద్దీన్,1193.
6) జిజియా పన్నును భారతదేశంలో మొదటిసారి ప్రవేశపెట్టింది ఎవరు?
జ) మహమ్మద్ బిన్ ఖాసిం (సింధ్ ప్రాంతంలో మొదట అమలు)
7) మహ్మద్ గజినీతో పాటు భారత్ కు వచ్చిన చరిత్రకారుడు ఎవరు ?
జ: అల్బెరూనీ ( తారిఖ్-ఇ-హింద్ అనే పుస్తకం రాశాడు)
8) ఘోరీ ప్రతినిధిగా ఢిల్లీని ఎవరు పాలించేవారు ?
జ: కుతుబుద్దీన్ ఐబక్ ( ఘోరీ చనిపోయాక బానిస వంశాన్ని స్థాపించాడు )
9) భారతీయుల వైద్యశాస్త్రం, గణితం, చదరంగం క్రీడలను మధ్య ఆసియాకి పరిచయం చేసింది ఎవరు ?
జ: అరబ్బులు
10) పదేళ్ళ పాటు వారణాసిలో ఉండి సంస్కృతం నేర్చుకొని మన గ్రంథాలను చదివిన వారు ఎవరు ?
జ: అల్బెరూనీ
11) క్రీ.శ. 6వ శతాబ్దాలలో మక్కాలో ఇస్లాం మతాన్ని ఎవరు స్దాపించారు?
జ) మహ్మద్ ప్రవక్త.


2.2డిల్లీ సుల్తానులు:(1206-1526):


1) భారతదేశాన్ని పాలించిన మొదటి ముస్లిం పాలకుడు ఎవరు?
జ) కుతుబుద్దీన్ ఐబక్ (బానిస వంశ స్థాపకుడు)
2) విజయనగరం బహమనీ రాజ్యాలను ఎవరు స్దాపించారు?
జ) మహ్మద్ బీన్ తుగ్లక్.
3) జిజియా పన్నును బ్రాహ్మణులపై ఎవరు విధించారు?
జ) ఫిరోజ్ షా తుగ్లక్.
4) లోడీ వంశాన్ని స్దాపించినది ఎవరు?
జ) బహలుల్ లోడీ.
5) ఆగ్రా పట్టణాన్ని ఎవరు నిర్మించారు?
జ) సికిందర్ లోడీ.
6) మొగలు సామ్రాజ్యాన్ని ఎవరు స్దాపించారు?
జ) బాబర్,1526.
7) ఇండియాలో సితార్, తబలాను ఎవరు ప్రవేశపెట్టారు?
జ) అమీర్ ఖుస్రో.
8) పాండ్యుల రాజధాని ఏది?
జ) మధురై.
9) కాకతీయుల రాజధాని ఏది?
జ) ఓరుగల్లు
10) కాకతీయుల్లో గొప్పవాడు ఎవరు?
జ) గణపతిదేవుడు.
11) కాకతీయ రాజ్యాన్ని ఏలిన మహిళ ఎవరు?
జ) రుద్రమదేవి.
12) రజియా సుల్తానా భారతదేశాన్ని ఎప్పుడు పరిపాలించింది?
జ) క్రీ.శ.1236 40.
13) నజీరుద్దీన్ యొక్క ప్రధానమంత్రి ఎవరు?
జ) బాల్బన్.
14) మొత్తం ఢిల్లీ సుల్తానుల్లో గొప్పవాడు ఎవరు?
జ) అల్లావుద్దీన్ ఖిల్దీ.
15) దౌలతాబాద్ కోటను ఎవరు నిర్మించారు?
జ) మహ్మద్ బీన్ తుగ్లక్.
16) వృద్దులకు పెన్షన్ ఇచ్చిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
జ) మహ్మద్ బిన్ తుగ్లక్.
17) ఖలీఫా అనే బిరుదును పొందిన సుల్తాన్ ఎవరు?
జ) ముబారక్
18) మొదటి పానిపట్టు యుద్దం ఎప్పుడు జరిగింది?
జ) 1526 ఏప్రిల్ 21.
19) ఇబ్రహీం లోడీకి మద్దతుగా సైన్యాన్ని ఏర్పాటు చేసినవారెవరు?
జ) రాజా విక్రమజీత్.
20) మద్యపానాన్ని నిషేధించిన తొలి ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
జ) బాల్బన్.
21) వరంగల్ పేరును సుల్లాన్పూర్గా మార్చినది ఎవరు?
జ) మహ్మద్ బిన్ తుగ్లక్.
22) ముస్తఫా ఇ ముమాలిక్ అంటే ఏమిటి?
జ) ఆడిటర్ జనరల్.
23) ఢిల్లీ సుల్తానుల అధికార భాష ఏది?
జ) పారశీ.
24) పారశీ హిందీ భాషల సమ్మేళనం ఏది?
జ) ఉర్దూ.
25) యుద్దభూమిలో చనిపోయిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు?
జ) ఇబ్రహీం లోడి.
26) జామా మసీదును నిర్మించినది ఎవరు?
జ) సికిందర్ లోడీ.
27) వెండి కొరత కారణంగా వెండికి బదులు 1330లో కరెన్సీ కింద రాగి నాణేలను ప్రవేశపెట్టింది ఎవరు ?
జ: మహ్మద్ బిన్ తుగ్లక్
28) దివాన్ ఇ ఖైరత్ అంటే ఏంటి ?
జ: ప్రజా పనుల కోసం ప్రత్యేక శాఖ (ఫిరుజ్ తుగ్లక్ కాలంలో)
29) ఆర్థిక శాఖకు ప్రతినిధిని ఏమనేవారు ?
జ: దివాన్ -ఇ-వజారత్ (వజీర్)
30) ప్రభుత్వ ధర్మాదాయ, ధార్మిక శాఖకు అధిపతిని ఏమని పిలిచేవారు ?
జ: దివాన్ - ఇ- రిసాలత్
31) ఢిల్లీ సూల్తాన్ల కాలంలో న్యాయశాఖ అధిపతి ఎవరు ?
జ: కాజీ-ఉల్- కుజత్
32) మొట్టమొదట వెండి టంకాలను జారీ చేసినది ఇల్టుట్ మిష్. అయితే వీటిమీద ఉండే బొమ్మ ఏది ?
జ: గుర్రంమీద కూర్చున్న రాజు బొమ్మ
33) సబక్ -ఇ-హింద్ అనే కొత్త భారతీయ శైలిని సృష్టించినది ఎవరు ?
జ: అమీర్ ఖుస్రూ



2.3 బహమనీ,విజయనగర,దక్కన్ సామ్రాజ్యాలు


1) బహమనీ వంశాన్ని ఎవరు స్థాపించారు?
జ) అల్లావుద్దీన్ బహమన్ షా.
2) బహమనీ వంశంలో గొప్పవాడు ఎవరు?
జ) ఫిరోజ్ షా బహమనీ.
3) గోల్కొండ కోటను ఎవరు నిర్మించారు?
జ) సుల్తాన్ కులీ కుతుబ్ షా.
4) హైదరాబాద్, చార్మినార్ ను ఎవరు నిర్మించారు?
జ) మహ్మద్ కులీ కుతుబ్ షా.
5) గోల్కొండను ఎవరు ఆక్రమించారు?
జ) ఔరంగజేబు
6) విజయనగర సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు?
జ) హరి హరరాయలు, బుక్కరాయలు.
7) కాకతీయుల సామంతులు ఎవరు?
జ) హరిహరరాయలు, బుక్కరాయలు.
8) విజయనగరం కాలంలో అతి ముఖ్యమైన బంగారు నాణెం ఏది?
జ) వరహాలు
9) విజయనగరం కాలంలో ఏ మతం ఎక్కువగా వ్యాప్తి చెందింది?
జ) వైష్ణవమతం.
10) లేపాక్షి దేవాలయాన్ని ఎవరు నిర్మించారు?
జ) బుక్కరాయ 1
11) మొదటి దేవరాయులు కాలంలో విజయనగర సమ్రాజ్యాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు ?
జ: నికోలా డి కాంటి
12) మొదటి హరహర రాయుల కాలం నాటి విజయనగర సామ్రాజ్య విశేషాలు తెలియజేసిన ఆఫ్రికా (మొరాకో) యాత్రికుడు ఎవరు ?
జ: ఇబిన్ బటూటా
13) విజయ నగర పాలకుల రాజకీయ వ్యవస్థను గురించి, రాజకీయ ఆదర్శాల గురించి తెలిపే గ్రంథం ఏది ?
జ: శ్రీకృష్ణ దేవరాయులు రాసిన ఆయుక్త మాల్యద
14) శ్రీకృష్ణ దేవరాయులు తెలుగులో ఆముక్త మాల్యద కాకుండా సంస్కృతిలో రాసిన గ్రంథం ఏది ?
జ: జాంబవతీ కళ్యాణం
15) కృష్ణదేవరాయులు తన తల్లి నాగమాంబ స్మారకంగా ఏ పట్టణం నిర్మించాడు ఝ
జ: నాగలాపురం







Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.