Type Here to Get Search Results !

May-01

May-01

షికాగోలో ప్రపంచ హిందూ కాంగ్రెస్‌ 
ప్రపంచ హిందూ కాంగ్రెస్‌ను 2018 సెప్టెంబరు 7 నుంచి 9 వరకు అమెరికాలోని షికాగోలో నిర్వహించనున్నారు.
  • స్వామి వివేకానంద షికాగోలో 1893 సెప్టెంబరులో  ప్రసంగించి 125 ఏళ్లు కావొస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని 2వ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నారు.
  • 2017 నవంబరులో డిల్లీలో జరిగిన కాంగ్రెస్‌కు 50 దేశాల నుంచి 1800 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
  • ప్రపంచ హిందూ సంస్థ అధినేత, ఐఐటీ పూర్వ విద్యార్థి స్వామి విజ్ఞానానంద ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి, అమెరికా కాంగ్రెస్‌లో కాలిడిన మొదటి హిందువుగా చరిత్ర సృష్టించిన తుల్సి గబ్బర్డ్‌ అధ్యక్షత వహించనున్నారు.



_______________________________________________________


తెలంగాణలో బీసీ, ఈబీసీ స్కార్‌షిప్‌లకు రూ.1550 కోట్లు
రాష్ట్రంలో బీసీ విద్యార్థుల బోధన ఫీజు, స్కార్‌షిప్‌లు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.1250 కోట్లు విడుదల చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు(ఈబీసీ) బోధన ఫీజుల కోసం రూ.300 కోట్లు ఇచ్చింది. ఈ మేరకు 2018 ఏప్రిల్‌ 30న బీసీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ విద్యార్థుల బోధన ఫీజుల కోసం రూ.800 కోట్లు, స్కార్‌షిప్‌ల కోసం రూ.450 కోట్లు ఖర్చు చేయనున్నారు. 



ఇండియన్‌ ఇంజినీరింగ్‌ ఒలింపియాడ్‌లో నిట్‌ విద్యార్థిని ప్రతిభ 
Event-Date:01-May-2018
Level:Local
Topic:Persons in News
వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ(ఎన్‌ఐటీ)లో బీటెక్‌ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కవితాకిరణ్‌ప్రసాద్‌ ఇండియన్‌ ఇంజినీరింగ్‌ ఒలింపియాడ్‌ (ఐఈవో)లో ప్రతిభ చూపింది.
  • 2018 మార్చిలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఏప్రిల్‌లో ప్రకటించారు. జాతీయ స్థాయిలో సుమారు 400 మందికిపైగా వ్యాసాలు రాయగా రంగు ఆధారిత వివక్ష(కాంప్లెక్సన్‌ బేసిడ్‌ డిస్క్రిమినేషన్‌) అనే అంశంపై కవితాకిరణ్‌ప్రసాద్‌ రాసిన వ్యాసం 3వ స్థానం దక్కించుకుంది.
  • మే నెలలో ఐఈవో ప్రచురించే పుస్తకంలో కవితాకిరణ్‌ప్రసాద్‌ వ్యాసం ప్రచురితం కానుంది.
  • ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని కోర్బా ప్రాంతానికి చెందిన కవిత చదువుతోపాటు సామాజిక అంశాలపై స్పందించడం అలవరచుకుంది.



ఆంధ్రప్రదేశ్‌ కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్‌ పునర్నియామకం 
Event-Date:01-May-2018
Level:Local
Topic:Persons in News
ఆంధ్రప్రదేశ్‌ కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్‌గా రఘపతుల రామ్మోహన్‌రావును ప్రభుత్వం పునర్‌ నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌ 2018 ఏప్రిల్‌ 30న ఉత్తర్వులు జారీ చేశారు. 



ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి సభ్యుల నియామకం
Event-Date:01-May-2018
Level:Local
Topic:Persons in News
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి సభ్యులుగా ఐదుగురిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 30న ఉత్తర్వులు జారీ చేసింది. ఐతాబత్తుల ఆనందరావు(తూర్పుగోదావరి), దేవతోటి నాగరాజు(ప్రకాశం), తంగిరాల సౌమ్య(కృష్ణా), వెంకటరాముడు(అనంతపురం), చిల్లంగి జ్ఞానేశ్వరి(విశాఖపట్నం)లు సభ్యులుగా నియమితులయ్యారు. 


జపాన్‌ జ్ఞాపకశక్తి ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌కు 20 పతకాలు 
Event-Date:01-May-2018
Level:Local
Topic:Awards and honours
టోక్యోలో జరిగిన జపాన్‌ జ్ఞాపకశక్తి  ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో భారత్‌కు 20 పతకాలు దక్కాయి. నెల్లూరుకు చెందిన విద్యార్థులు ప్రతిభను చాటారు. 2018 ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో టోక్యోలోని ముసాషినో ప్రాంతంలో జరిగిన ఈ పోటీలకు భారత్‌తో పాటు జపాన్‌, కొరియా, చైనా, ఫిలిప్పీన్స్‌, మంగోలియా, తైవాన్‌ హాజరయ్యాయి. భారత్‌ తరఫున నెల్లూరుకు చెందిన ఆర్యన్‌, జష్‌ జైన్‌, ద్వీప్‌ జైన్‌, తన్వి, దియాన్ష్‌, కెన్వి, ప్రాచీ జైన్‌ పాల్గొన్నారు. వీరు స్వర్ణం 3, రజతం 8, కాంస్యం 9 చొప్పున పతకాలను చేజిక్కించుకున్నారు.
  • ఇందులో తన్వీ జైన్‌ 3 స్వర్ణం, 3 రజతం, 2 కాంస్య పతకాలు సాధించింది. ఆర్యన్‌ రజతం 1, కాంస్యం 2... దియాన్స్‌ జైన్‌ రజతం 3, కాంస్యం 1... కెన్వి జైన్‌ రజతం 2, కాంస్యం 1... జష్‌ జైన్‌ కాంస్యం 2 పతకాలు చొప్పున కైవసం చేసుకున్నారు. గ్రాండ్‌ మాస్టర్‌ రాజ్‌కుమార్‌ జైన్‌ నేతృత్వంలో వీరు పాల్గొన్నారు.


టీటీడీ ధర్మకర్త మండలి సభ్యురాలిగా సుధా నారాయణమూర్తి ప్రమాణస్వీకారం 
Event-Date:01-May-2018
Level:Local
Topic:Persons in News
తిరుమల, తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు సుధా నారాయణమూర్తి 2018 ఏప్రిల్‌ 30న ప్రమాణ స్వీకారం చేశారు. సుధా నారాయణమూర్తి టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలిగా కొనసాగడం ఇది రెండోసారి.


ఆంధ్రప్రదేశ్‌ 2018-2020 యానిమేషన్‌ విధానం మార్గదర్శకాలు
యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్‌, గేమింగ్‌, కామిక్స్‌ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన 2018-2020 విధానానికి సంబంధించి మార్గదర్శకాలు 2018 ఏప్రిల్‌ 30న జారీ అయ్యాయి. రాష్ట్రంలోని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి వంటి ముఖ్య నగరాలతోపాటు ఇతర ప్రధాన పట్టణాల్లో యానియేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్‌ రంగంలో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. పారిశ్రామిక, ఐటీ రంగాలను ప్రోత్సహిస్తూ ఇప్పటికే అనేక విధానాలు ప్రకటించారు. దక్షిణాదిన మిగతా రాష్ట్రాలతో సమానంగా యానిమేషన్‌ రంగంలోనూ పెట్టుబడులు ఆకర్షించేలా ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రత్యేకించి విశాఖపట్నాన్ని యానిమేషన్‌, గేమింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దనుంది.
రాయితీలు

  • ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఆధ్వర్యంలో స్థలాలు కేటాయిస్తారు. 
  • యానిమేషన్‌, గేమింగ్‌ సిటీకు ఫైబర్‌ గ్రిడ్‌ నుంచి ప్రత్యేకంగా నిరంతరాయ ఇంటర్నెట్‌ సేవలు అందిస్తారు. 
  • సమీప సబ్‌స్టేషన్ల నుంచి నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తారు. ఒక్కో యూనిట్‌పై రూ.2 రాయితీ అందిస్తారు.
  • సంస్థకు కేటాయించే స్థంలో 20 శాతాన్ని సామాజిక అవసరాల కోసం ఉపయోగించుకునే సౌలభ్యాన్ని కల్పిస్తారు. 
  • యానిమేషన్‌, గేమింగ్‌లో నేర్పున్న విద్యార్థులను విశ్వవిద్యాలయాల స్థాయిలో తయారుచేసి నిపుణుల కొరతను అధిగమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. 
  • రూ.కోటి విలువైన హార్డ్‌వేర్‌ పరికరాల కొనుగోళ్లలో కంపెనీలకు 25శాతం రాయితీ ప్రభుత్వం అందించనుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకు ఇది 35 శాతం వరకు వర్తిస్తుంది. 
  • యానిమేషన్‌ చిత్రాలు, గేమింగ్‌ నిర్మాణంపై ప్రభుత్వం తరఫున గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందిస్తారు. మొదటి రెండు చిత్రాలకే ఇవి వర్తిస్తాయి. కంపెనీలు చెల్లించే రాష్ట్ర వస్తు,సేవల పన్నులో 50శాతం మొత్తాన్ని ప్రభుత్వం వాపసు చేయనుంది.


ట్విట్టర్‌ కూడా డేటా అమ్మినట్లు సండే టెలిగ్రాఫ్‌ కథనం

డేటా కుంభకోణంలో ప్రధాన కేంద్రంగా ఉన్న కేంబ్రిడ్జ్‌ ఎనలిటికాకు ట్విట్టర్‌ కూడా డేటా అమ్మినట్లు ఒక మీడియా కథనం వెల్లడించింది. ఓటర్ల వివరాలను సేకరించడానికి వీలుగా కేంబ్రిడ్జ్‌ అనలిటికాకు టూల్స్‌ రూపొందించి ఇచ్చిన అలెక్సాండర్‌ కోగన్‌ 2015లోనే ట్విట్టర్‌ నుంచి డేటాను కొనుగోలు చేసినట్లు సండే టెలిగ్రాఫ్‌ కథనం పేర్కొంది. 2014 డిసెంబరు నుంచి 2015 ఏప్రిల్‌ మధ్య 5 నెల కాలంలో ట్విట్టర్‌ నుంచి లొకేషన్‌ సమాచారం, ప్రొఫైల్‌ పిక్చర్లు, యూజర్‌ పేర్లు, ఫొటోను కోగన్‌ కొనుగోలు చేసినట్లు కథనం వెల్లడించింది. 


జమ్ముకాశ్మీర్‌ మంత్రివర్గం పునర్‌ వ్యవస్థీకరణ
జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర మంత్రివర్గాన్ని 2018 ఏప్రిల్‌ 30న పునర్‌ వ్యవస్థీకరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సత్‌పాల్‌శర్మ, స్పీకర్‌ కోవిందర్‌ గుప్త సహా 8 మంది పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో ఆరుగురు బీజేపీ, ఇద్దరు పీడీపీకి చెందినవారు. ఒకరు సహాయ మంత్రి నుంచి పదోన్నతి పొందగా మిగతా ఏడుగురు కూడా కొత్తవారే.
  • కథువా అత్యాచార ఘటనలో నిందితులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ మంత్రులిద్దరు ఇటీవల రాజీనామా చేశారు.
  • ఉప ముఖ్యమంత్రి నిర్మల్‌సింగ్‌ 2018 ఏప్రిల్‌ 29న వైదొలిగారు.
  • కొత్తగా చోటుకల్పించిన వారిలో కథువా ఎమ్మెల్యే రాజీవ్‌ జాస్రోతియా కూడా ఉన్నారు. ‘కథువా’ నిందితులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నట్లు ఆయనపై కూడా ఆరోపణలున్నాయి. 
ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మాజీ చీఫ్‌ ఇద్రిస్‌ హసన్‌ లతీఫ్‌ మృతి
Event-Date:01-May-2018
Level:National
Topic:Persons in News
ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మాజీ చీఫ్‌, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఇద్రిస్‌ హసన్‌ లతీఫ్‌ (94) 2018 ఏప్రిల్‌ 30న హైదరాబాద్‌లో మృతి చెందారు. లతీఫ్‌ న్యూమోనియాతో బాధపడుతున్నారు.
  • 1923 జూన్‌ 9న హైదరాబాద్‌లో జన్మించిన లతీఫ్‌ నిజాం కళాశాలలో విద్యాభ్యాసం చేశాక 18 ఏళ్ల వయసులోనే ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో చేరారు.
  • యుద్ధ విమానాలను నడపడంలో అపార అనుభవం ఉంది. బ్రిటిష్‌ ప్రభుత్వం ద్వారా యూకే వెళ్లి అధునాతన యుద్ధవిమానాలను నడపడంలో శిక్షణ పొందిన కొద్దిమంది భారతీయ పైలెట్లలో ఆయన ఒకరు.
  • దేశ విభజన సమయంలో పాక్‌ వాయుసేనలో చేరాల్సిందిగా కొందరు ఆయన్ని అభ్యర్థించినా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లోనే చేరారు.
  • 1971 యుద్ధంలో కీలక సేవలు అందించారు. ముందుండి సేనల్ని నడిపించడమే కాకుండా ఎప్పటికప్పుడు యుద్ధ పురోగతిని సమీక్షించేవారు. వాయుసేన ఆధునికీకరణలోనూ ముఖ్య పాత్ర పోషించారు.
  • 1981లో ఉద్యోగ విరమణ చేశాక మహారాష్ట్ర గవర్నర్‌గా, ఫ్రాన్స్‌లో భారతదేశ రాయబారిగా మరికొన్నాళ్లు సేవలందించారు.


అఫ్గాన్‌ ఆత్మాహుతి పేలుళ్లలో 36 మంది మృతి
Event-Date:01-May-2018
Level:International
Topic:Places in News
అఫ్గానిస్థాన్‌లో 2018 ఏప్రిల్‌ 30న వరుస ఆత్మాహుతి దాడులు జరిగాయి. రాజధాని కాబూల్‌లో జంట బాంబులు, కాందహార్‌లో ఓ పేలుడు చోటుచేసుకోగా మొత్తం 36 మంది మృతి చెందారు. ఏప్రిల్‌ 30న ఉదయమే ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాదులు దాడులు మొదలుపెట్టారు. మొదట కాబూల్‌ నడిబొడ్డునున్న అఫ్గాన్‌ నిఘా సేవల విభాగం ప్రధాన కార్యాలయాన్ని వారు లక్ష్యంగా చేసుకున్నారు. ఇక్కడి దౌత్య, విదేశీ కార్యాలయాల సమీపంలో ఓ ముష్కరుడు ద్విచక్రవాహనంపై వచ్చి ఆత్మాహుతికి తెగబడ్డాడు.
  • దాడిలో గాయపడిన వారికి సాయం అందించేందుకు పలువురు ఘటన స్థలానికి వచ్చారు. దాడి అనంతర పరిస్థితులను కళ్లకు కట్టేందుకు జర్నలిస్టులు కూడా అక్కడికి చేరుకున్నారు. వీరందరినీ లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. ఈ జంట దాడుల్లో 10 మంది జర్నలిస్టులు సహా 25 మంది మృతి చెందారు. ఈ రెండు ఘాతుకాలకు పాల్పడింది తామేనని ఐఎస్‌ అనుబంధ వెబ్‌సైట్‌ తెలిపింది.
  • కాందహార్‌ దాడిలో నాటో వాహన శ్రేణిని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. దగ్గర్లోని ఓ మదర్సా నుంచి వచ్చిన కొందరు చిన్నారులు అక్కడ సరదాగా గుమిగూడారు. అదే సమయంలో ముష్కరుడు ఆత్మాహుతికి తెగబడ్డాడు. దీంతో 11 మంది పిల్లలు మృతి చెందారు. ఈ దాడిని చేపట్టింది తామేనని ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత తీసుకోలేదు.


భారతీయుడిని భద్రంగా అప్పగించిన పాకిస్థాన్‌
Event-Date:01-May-2018
Level:National
Topic:Foreign relations
ఏడాది కిందట అనుకోకుండా పాకిస్థాన్‌లో ప్రవేశించిన ఓ భారతీయుడిని దాయాది దేశం 2018 ఏప్రిల్‌ 29న సురక్షితంగా అప్పగించింది. లాహోర్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని కసూర్‌కు సమీపాన గల బల్లన్‌వాలా గ్రామంలో ప్రవేశించిన దల్వందర్‌సింగ్‌(23)ను వాఘా సరిహద్దు వద్ద పాక్‌ రేంజర్లు అప్పగించారు. అతడిని ఎప్పుడు అరెస్టు చేశారు?, ఎంతకాలం పాటు భదత్రవర్గాలు అతన్ని తమ  అదుపులో  ఉంచుకున్నాయనే విషయాను మాత్రం పాకిస్థాన్‌ వెల్లడించలేదు. 



శృంగార సంబంధం లేకపోతే వివాహం రద్దు చేయవచ్చు : బొంబాయి హైకోర్టు
దంపతుల మధ్య శృంగార సంబంధం లేకపోతే ఆ ప్రాతిపదికన వారి వివాహం చెల్లుబాటు కాదని ప్రకటించవచ్చని బొంబాయి హైకోర్టు తీర్పు చెప్పింది. కొల్హాపుర్‌కు చెందిన దంపతులకు 9 సం॥ల క్రితం వివాహమయింది. అప్పటి నుంచి వారి మధ్య న్యాయపోరాటం సాగుతూనే ఉంది. వివాహం రద్దు చేయాలని ఆమె కోరుతుండగా అతను వ్యతిరేకిస్తున్నాడు.
  • ఖాళీ పత్రాలపై సంతకం చేయించుకోవడం ద్వారా తనను మోసపూరితంగా వివాహం చేసుకున్నాడని ఆమె ఆరోపించింది.
  • ఆమె పట్టభద్రురాలని, ఖాళీ పత్రాలపై ఆమె సంతకం చేసిందని నమ్మలేమని, మోసం జరిగిందనడానికి ఆధారాల్లేవని న్యాయమూర్తి జస్టిస్‌ మృదులా భట్కర్‌ స్పష్టం చేశారు.
  • ఇద్దరి మధ్య శృంగార సంబంధాలు ఉన్నాయనడానికి ఆధారాలు లేనందున వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్పు చెప్పారు.
  • ‘‘వివాహం ముఖ్య లక్ష్యాల్లో దంపతుల మధ్య సహజసిద్ధంగా శృంగార సంబందాలుండడం అనేది ఒకటి. అటువంటి సంబంధం లేనప్పుడు వివాహ లక్ష్యం దెబ్బతిన్నట్లే. ఈ కేసులో దంపతులు ఒక్క రోజు కూడా కలిసి లేరు. ఇద్దరి మధ్య శృంగార సంబంధముందని చెబుతున్న భర్త.. అందుకు ఆధారాలు చూపలేకపోయారు.’’ అని పేర్కొన్నారు.
  • తమ మధ్య శృంగార సంబంధముందని, ఆమె గర్భం కూడా దాల్చిందని భర్త చెప్పగా, గర్భం దాల్చినట్లు గైనకాలజిస్టు చేసిన పరీక్ష ఫలితాన్ని అతను చూపలేకపోయారని కోర్టు పేర్కొంది.


గూగుల్‌లో CBSE పరీక్ష ఫలితాల సమాచారం 
CBSE నిర్వహించే పరీక్ష ఫలితాలను విద్యార్థులు నేరుగా గూగుల్‌ సెర్చ్‌ పేజీలో చూసుకునేందుకు ఆ బోర్డుతో చేతులు కలిపినట్లు గూగుల్‌ 2018 ఏప్రిల్‌ 30న వెల్లడించింది. ఏప్రిల్‌ 30న విడుదలయిన JEE మెయిన్‌ పరీక్ష ఫలితాల నుంచే ఈ వెసులుబాటు ప్రారంభమయిందని తెలిపింది. ఫలితాలను చూపించడానికి మాత్రమే ఉపయోగించేలా, ఈ ఫీచర్‌ ఉన్నంత సేపు మాత్రమే డేటాను ఉపయోగించేలా CBSEతో కలిసి పనిచేసినట్లు తెలిపింది.
  • గేట్‌, SSC-CGL, క్యాట్‌ తదితర పరీక్ష తేదీల కోసం విద్యార్థులు వెదికేటప్పుడు పరీక్ష తేదీలు, నమోదు తేదీలు, ముఖ్యమైన లింకులు, ఇతర కీలక సమాచారం తేలికగా కనిపించేలా అదనపు ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు గూగుల్‌ వెల్లడించింది.
వారణాసిలో ప్రవాసీ భారతీయ దివస్‌ 2019
Event-Date:01-May-2018
Level:National
Topic:Foreign relations

2019 ప్రవాసీ భారతీయ దివస్‌ను వారణాసిలో నిర్వహించనున్నారు. 2019 జనవరి 21 నుంచి 23 వరకు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే విదేశీ ప్రతినిధులు అలహాబాద్‌ కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి, డిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్ని తిలకించడానికి అవకాశం ఉంటుందని అమెరికాలోని భారత్‌ దౌత్య కార్యాలయ ప్రతినిధి అనురాగ్‌ కుమార్‌ తెలిపారు.
  • 2018 ఏప్రిల్‌ 29న వాషింగ్టన్‌లో జరిగిన ‘భారత సంతతి అమెరికా సమాజ’ ప్రముఖుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. వారణాసి కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్రమోడి, మారిషస్‌ ప్రధాని ప్రవిండ్‌ జగన్నాథ్‌లు సంయుక్తంగా ప్రారంభిస్తారని వెల్లడించారు.
  • ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ సహకారంతో విదేశీ వ్యవహారాల శాఖ నిర్వహిస్తున్న భేటీకి ‘నవభారత నిర్మాణంలో ప్రవాస భారతీయుల పాత్ర’ అనే ఇతివృత్తాన్ని ఖరారు చేశారు.





పాక్‌ మూలాలున్న సాజిద్‌ జావిద్‌కు బ్రిటన్‌ హోం మంత్రి పదవి
Event-Date:01-May-2018
Level:International
Topic:Persons in News
పాకిస్థాన్‌ మూలాలున్న బ్రిటన్‌ ఎంపీ సాజిద్‌ జావిద్‌(48) 2018 ఏప్రిల్‌ 30న బ్రిటన్‌ కొత్త హోం మంత్రిగా నియమితులయ్యారు. కన్సర్వేటివ్‌ పార్టీ తరఫున జావిద్‌ 2010 నుంచి బ్రామ్స్‌గ్రోవ్‌ ఎంపీగా ఉన్నారు.
  • హోంమంత్రిగా ఉన్న థెరెసా మే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హోం మంత్రిగా యాంబర్‌ రడ్‌ పని చేశారు. ఆమె రాజీనామా చేయడంతో కమ్యూనిటీలు, స్థానిక ప్రభుత్వం, గృహనిర్మాణ మంత్రిగా ఉన్న సాజిద్‌కు పదోన్నతి లభించింది.
  • సాజిద్‌ తండ్రి బస్సు డ్రైవర్‌గా పని చేశారు. ఆయన కుటుంబం 1960ల్లో బ్రిటన్‌కు వలస వచ్చింది.


సుదీర్ఘకాల ముఖ్యమంత్రిగా పవన్‌ చామ్లింగ్‌ రికార్డు
Event-Date:30-Apr-2018
Level:National
Topic:Persons in News
దేశ రాజకీయాల్లో 2018 ఏప్రిల్‌ 29న సరికొత్త రికార్డు నమోదైంది. అత్యంత సుదీర్ఘకాలం ఓ రాష్ట్రాన్ని పాలించిన నేతగా సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌చామ్లింగ్‌ చరిత్ర సృష్టించారు. ఇన్నాళ్లు కమ్యూనిష్టు కురువృద్ధుడు జ్యోతిబసు పేరుమీదున్న రికార్డును చెరిపేసి పవన్‌ తన పేరు చరిత్ర పుటల్లో లిఖించుకున్నారు. చామ్లింగ్‌ అధికారం చేపట్టి 2018 ఏప్రిల్‌ 29 నాటికి  23 ఏళ్ల నాలుగు నెలల 17 రోజులవుతుంది. ఇది జ్యోతిబసు పదవీకాలం కంటే ఒకరోజు ఎక్కువ.
  • జ్యోతిబసు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రిగా 1977 జూన్‌ 21నుంచి 2000 నవంబర్‌ 6వరకు ఉన్నారు.
  • పవన్‌చామ్లింగ్‌ 1993లో సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ పేరిట ప్రత్యేక పార్టీ స్థాపించారు. ఏడాదిలోపే 1994 డిసెంబరు 12న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
  • 1973లో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన 1985లో తొలిసారి శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.  
  • ఒకేసారి వరుసగా కానీ, విడతలవారీగా కానీ అత్యధిక కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసిన వ్యక్తుల జాబితాలో చామ్లింగ్‌ తరువాతి వరుసలో జ్యోతిబసు (23 ఏళ్ల 137 రోజులు), మాణిక్‌సర్కార్‌ (20 ఏళ్ల 3 నెలలు), గెగాంగ్‌ అపాంగ్‌ (22 ఏళ్ల 256 రోజులు), ఎం.కరుణానిధి (18 ఏళ్ల  293 రోజులు) నిలిచారు.
  • పవన్‌చామ్లింగ్‌ స్వతహాగా కవి. కిరణ్‌ అన్న కలం పేరుతో ఈయన చేసిన రచనకు 2010లో భాను పురస్కారం లభించింది.
  • ఇద్దరు భార్యలు, నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఈయన కుటుంబం.
  • అరుదైన రికార్డు నమోదుచేస్తున్న సందర్భంగా ఆయన  2018 ఏప్రిల్‌ 28న తన ఫేస్‌బుక్‌పేజీలో తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఫొటోతోపాటు సుదీర్ఘ వ్యాసం పోస్ట్‌చేశారు. గొప్పరాజనీతిజ్ఞుడు, అత్యంత గౌరవనీయమైన వ్యక్తి జ్యోతిబసు పేరున ఉన్న రికార్డును తాను అధిగమించడం తన అదృష్టంగా పేర్కొన్నారు.  
  • చామ్లింగ్‌ సిక్కిం రాజకీయాలు, ప్రభుత్వంపై గట్టిపట్టు సాధించారు. ఒకరకంగా చెప్పాలంటే నియంతృత్వ ధోరణిలో వెళ్తున్నారు. సిక్కింలో మరో అధికార కేంద్రం తయారుకాకుండా జాగ్రత్త పడుతున్నారు.
  • సిక్కిం డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ ఇదివరకు యూపీయే, ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ తన ఎంపీలెవర్నీ కేంద్ర మంత్రులుగా చేయలేదు.
  • భండారీ నేతృత్వంలోని సిక్కిం సంగ్రాం పరిషత్‌ చీలిపోయి కొంత కాంగ్రెస్‌, మరికొంత బీజేపీలో విలీనం కావడమే చామ్లింగ్‌ రాజకీయంగా బలపడటానికి దారితీసింది.
  • 2004 నుంచి 2014వరకు జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ బలంగా ఉన్నప్పటికీ సిక్కింలో బలపడలేకపోవడానికి కారణం పవన్‌చామ్లింగ్‌ రాజకీయ చతురతే కారణమన్నది రాజకీయ విశ్లేషకుల భావన.
  • చూడటానికి చాలా మెతకగా కనిపించే చామ్లింగ్‌ సవాళ్లను ఎదుర్కోవడంలో ఛాంపియన్‌. అనిశ్చితి పాలనకు మారుపేరైన ఈశాన్య భారతంలో స్థిరమైన ప్రభుత్వాలు ఇవ్వగల వ్యక్తిగా మంచి గుర్తింపు పొందారు.
  • సేంద్రియ వ్యవసాయాన్ని తప్పనిసరిచేసి వ్యవసాయరంగంలో సరికొత్త పంథా నెలకొల్పారు. రాష్ట్రాన్ని అత్యంత శుభ్రమైన ప్రాంతంగా మార్చి పర్యాటకరంగంలో ఈశాన్యరాష్ట్రాల్లో అగ్రగామిగా నిలిపారు. సిక్కింను స్విట్జర్లాండ్‌ ఆఫ్‌ ఇండియాగా పిలుచుకొనేలా చేశారు. గ్యాంగ్‌టక్‌ను నేరాలు లేని నగరంగా మార్చారు. 




























































Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.