Type Here to Get Search Results !

మార్చి-2018 అవార్డులు

మార్చి - 1
¤ రిలయన్స్ జియోకు చెందిన జియో టీవీ యాప్‌కు అరుదైన పురస్కారం లభించింది.
       » మొబైల్ పరిశ్రమలో ఆస్కార్ అవార్డుగా భావించే గ్లోబల్ మొబైల్ అవార్డ్స్ (గ్లోమో) - 2018లో 'బెస్ట్ మొబైల్ వీడియో కంటెంట్' విభాగంలో ఈ పురస్కారం లభించింది. ఈ విభాగంలో ఎయిర్‌టెల్ టీవీ, మిగు హాట్ వీడియో, బయోస్కోప్ లైవ్ టీవీలు పోటీ పడినప్పటికీ పురస్కారం జియో టీవీకి లభించింది
.
       » జియో టీవీ ప్రైమ్ లో 575కు పైగా లైవ్ టీవీ ఛానళ్లు చూడొచ్చు. 15కు పైగా భారతీయ భాషలకు చెందిన కార్యక్రమాలను వీక్షించవచ్చు.
మార్చి - 4
¤ ఎన్డీటీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉమా సుధీర్ 2017 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక చమేలీ దేవి అవార్డుకు ఎంపికయ్యారు.       » రాజకీయాలు, పిల్లలు, మహిళలు, మానవ హక్కులు, వ్యవసాయం, గ్రామీణ సమస్యలు, మైనారిటీల సమస్యలు తదితరాలపై ఆమె విస్తృతంగా వెలువరించిన కథనాలకు ఈ గుర్తింపు లభించింది.
మార్చి - 5
¤ లాస్ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 90వ ఆస్కార్ అవార్డులను ప్రదానం చేశారు.ఉత్తం చిత్రం: షేప్ ఆఫ్ వాటర్ఉత్తమ నటుడు: గ్యారీ ఓల్డ్‌మ్యాన్ ('డార్కెస్ట్ అవర్' చిత్రంలో నటనకు)ఉత్తమ నటి: ఫ్రాన్సెస్ మెక్ డొర్మండ్ (త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ)విదేశీ భాషా చిత్రం: ఏ ఫెంటాస్టిక్ ఉమన్ (స్పానిష్)సహాయ నటుడు: శామ్ రాక్‌వెల్ (త్రీ బిల్ బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ)సహాయ నటి: అలిసన్ జాన్నీ (ఐ, టోన్యా)ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: జోర్డాన్ పీలె (గెట్ అవుట్)అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: జేమ్స్ ఐవరీ (కాల్ మీ బై యువర్ నేమ్)ఛాయాగ్రహణం: రోజర్ ఎ డెకిన్స్ (బ్లేడ్ రన్నర్ 2049)ఫిలిం ఎడిటింగ్: లీస్మిత్ (డంకర్క్)యానిమేషన్ చిత్రం: కోకోడాక్యుమెంటరీ చిత్రం: ఇకారస్       » 'షేప్ ఆఫ్ వాటర్' చిత్ర దర్శకుడు గుల్లెర్మో డెల్ టోరో తొలి ప్రయత్నంలోనే ఆస్కార్ పురస్కారం అందుకోవడం విశేషం. ఈ మెక్సికన్ దర్శకుడు 53 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించాడు. ఈ చిత్రం ఈ ఏడాదిలో అత్యధికంగా 13 నామినేషన్లు పొందిన చిత్రంగా ఘనత సాధించి నాలుగు విభాగాల్లో ఆస్కార్ గెలుచుకుంది. 2017లో వచ్చిన పది అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా అమెరికన్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్ దీన్ని ఎంపిక చేసింది. వెనిస్ చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ లయన్ పురస్కారం అందుకుంది.       » నీళ్లలో నివసించే ఓ వింత జీవి, సంజ్ఞల భాషలో మాత్రమే మాట్లాడే ఓ మూగ అమ్మాయి మధ్య ప్రేమ చిగురిస్తే ఎలా ఉంటుంది అనే విచిత్రమైన కథతో 'షేప్ ఆఫ్ వాటర్' చిత్రాన్ని నిర్మించారు.       » గ్యారీ ఓల్డ్‌మ్యాన్ (60) తొలిసారి ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్నాడు. 'డార్కెస్ట్ అవర్' చిత్రంలో బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ పాత్రలో నటించి ఈ పురస్కారాన్ని సాధించాడు.       » 60 ఏళ్ల ఫ్రాన్సెస్ ఎం.డొర్మండ్ రెండోసారి ఆస్కార్‌ను గెలుచుకున్నారు. 1997 లో వచ్చిన 'ఫార్గో' తో ఉత్తమ నటిగా తొలి ఆస్కార్ అందుకున్నారు.       » పురస్కార ప్రదానోత్సవంలో 'ఇన్ మెమోరియన్' సెగ్మెంట్‌లో భాగంగా భారతీయ నటులు శశికపూర్, శ్రీదేవికి నివాళులు అర్పించారు. ఇదే వేదికపై ప్రముఖ హాలీవుడ్ నటులు రోజర్ మూర్, జానాథన్ డెమ్మే, హారర్ లెజెండ్ జార్జ్ రామెర్‌లకూ నివాళులు అర్పించారు.
మార్చి - 8
¤ కాల్పనిక సాహిత్యంలో యూకే ఏటా మహిళలకు అందించే ప్రతిష్ఠాత్మక బహుమతికిగాను తుది 16 మంది జాబితాలో ఇద్దరు భారతీయులు నిలిచారు.       » అరుంధతీరాయ్, కందసామిలు పోటీలో ఉన్నట్లు లండన్‌లోని అవార్డు కమిటీ పేర్కొంది.¤ భారత రచయితల్లో కాల్పనిక సాహిత్య ప్రతిభకు గుర్తింపు కల్పించేందుకు సాహిత్య పురస్కారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మాణరంగ యంత్రాల తయారీ సంస్థ 'జేసీబీ ఇండియా' వెల్లడించింది.       » ఈ పురస్కారం కింద రూ. 25 లక్షలను ప్రకటించింది. సాహిత్య రంగంలో ఇది దేశంలోనే అత్యంత భారీ పురస్కార మొత్తం.¤ ప్రముఖ భవన రూపశిల్పి (ఆర్కిటెక్ట్) బాలకృష్ణ దోశీ (90) ప్రతిష్ఠాత్మక ప్రిట్జ్‌కర్ పురస్కారాన్ని గెలుచుకున్నారు.       » ఈ గౌరవం దక్కిన తొలి భారతీయుడు ఈయనే.       » మేలో కెనడాలో ఈ పురస్కారంతోపాటు రూ. 65 లక్షల నగదు బహుమతినీ అందిస్తారు.       » ఐఐఎమ్ బెంగళూరు సహా పలు ప్రఖ్యాత కట్టడాలు బాలకృష్ణ రూపొందించారు.       » 'పేదల భవన రూపశిల్పి'గానూ ఆయన పేరు గాంచారు.       » 1989లో బాలకృష్ణ రూపకల్పన చేసిన ఇండోర్‌లోని చౌక గృహాల సముదాయాల్లో నేడు 80 వేల మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు.
మార్చి - 11
¤ టీఎస్ఆర్ కాకతీయ లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన కాకతీయ కళావైభవ మహోత్సవంలో 1100 చిత్రాల్లో నటించిన బ్రహ్మానందంకు 'హాస్య నటబ్రహ్మ' బిరుదును ప్రదానం చేశారు.
మార్చి - 17
¤ ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ప్రకాశ్ చంద్ జైన్‌కు ప్రతిష్ఠాత్మక హెచ్‌జే బాబా స్మారక అవార్డు లభించింది.       » హైదరాబాద్‌లోని 'రక్షణ పరిశోధన అభివృద్ధి ల్యాబొరేటరీ (డీఆర్‌డీఎల్)'కు చెందిన డాక్టర్ జైన్ ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్ రంగంలో విశేష పరిశోధనలు చేశారు. వాటికి గుర్తింపుగా కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఇంఫాల్‌లో జరుగుతున్న 105వ భారత్ సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
మార్చి - 27
¤ దేశ రక్షణ కోసం ప్రాణాలకు సైతం తెగించి పోరాడిన సాహస యోధులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శౌర్య అవార్డులను ప్రదానం చేశారు.       » నాగాలాండ్‌లో తీవ్రవాదులపై పోరులో అమరుడైన మేజర్ డేవిడ్ మన్లున్‌కు మరణానంతరం కీర్తి చక్ర అవార్డు లభించింది.       » జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులను హతమార్చే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సతీష్ దహియా, నాయక్ చంద్ర సింగ్, కానిస్టేబుల్ మంజూర్ నాయక్, సార్జెంట్ మిళింద్ ఖైర్నర్, కార్పొరల్ నీలేష్ కుమార్ నాయన్‌లకు శౌర్యచక్ర పురస్కారాలను ప్రకటించారు.       » సీఆర్‌పీఎఫ్ కమాండెంట్ చేతన్ కుమార్ చీటా, మేజర్ విజయంత్ బిష్ట్‌లు కీర్తిచక్ర అవార్డులను అందుకున్నారు.       » మావోయిస్టులపై పోరాడిన సీఆర్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ చందన్ కుమార్, అసిస్టెంట్ అసాల్ట్ కమాండర్ పి.త్రినాథరావు, సీనియర్ కమాండో చిక్కం, ఆంధ్రప్రదేశ్ పోలీస్‌కు చెందిన జీవీ రామచంద్రరావులకు రాష్ట్రపతి శౌర్య చక్ర అవార్డులను ప్రదానం చేశారు. శౌర్యచక్ర అవార్డులను అందుకున్న వారిలో మేజర్ అభినవ్ శుక్లా, మేజర్ రోహిత్ శుక్లా, గన్నర్ రిషి కుమార్ రే, సిపాయ్ ఆరిఫ్ ఖాన్, లాన్స్ నాయక్ బదేర్ హుస్సేన్, హవల్దార్ ముబారక్ అలీ ఉన్నారు.       » ఆర్మీ, నేవీ, వాయుసేనలకు చెందిన 14 మంది అధికారులు పరమ్ విశిష్ట సేవా మెడల్ పొందారు.       » లెఫ్టినెంట్ అజయ్‌కుమార్ శర్మ ఉత్తమ్ యుద్ధ సేవా పతకం పొందారు. త్రివిధ దళాలకు చెందిన మరో 22 మంది విశిష్ట్ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. వీరిలో మేజర్ జనరల్ మాధురీ కనిట్కర్ అనే వైద్యురాలు కూడా ఉన్నారు.
మార్చి - 22
¤ టీఎస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ పాత్రికేయుడు జీకే రెడ్డి స్మారకార్థం ఏటా ఇచ్చే జాతీయ పురస్కారాన్ని దిల్లీలో ప్రముఖ పాత్రికేయుడు కరణ్ థాపర్‌కు ప్రదానం చేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.