విత్తన భాండాగారం తెలంగాణ
* వ్యవసాయ వైవిధ్య రాష్ట్రం* విత్తనోత్పత్తికి అనుకూలం
* ప్రత్యేకతలు.. ప్రతికూలతలు
* రైతు సంక్షేమానికి కృషి
1. ఉత్తర తెలంగాణ మండలం
2. కేంద్ర తెలంగాణ మండలం
3. దక్షిణ తెలంగాణ మండలం
4. ఉన్నత, గిరిజన ప్రాంతాల మండలం
వ్యవసాయ ప్రాధాన్యాలు
* దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి వృద్ధిరేటు 2.43 శాతం ఉండగా తెలంగాణలో 3.97 శాతంగా ఉంది.
వ్యవసాయరంగ ప్రతికూలతలు
* నిలకడ లేని వర్షపాతం, ఆకస్మిక వరదలు వ్యవసాయ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.
* వర్షపాత లేమి వల్ల నేలల్లో సేంద్రీయ పదార్థ అభివృద్ధి తగ్గి నత్రజని శాతం తగ్గుతోంది.
* వ్యవసాయ భూముల్లో 63 శాతం వర్షాధారమే. దీంతో వ్యవసాయరంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది.
* పెరిగిన కూలీల వ్యయభారం, అతి తక్కువ యాంత్రీకరణ కలిసి సేద్యం ఖర్చును విపరీతంగా పెంచాయి. ఇవి ఇతర అనేక ఇబ్బందులకు, ఆర్థిక నష్టాలకు దారితీస్తున్నాయి.
* వ్యవసాయదారుల్లో సుమారు 85 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే. వీరంతా నిరుపేద సామాజిక ఆర్థిక వర్గానికి చెందినవారు. దీంతో వ్యవసాయం కోసం రుణాలు చేయడంతో వీరి రుణగ్రస్తత క్రమంగా పెరుగుతోందని చెప్పవచ్చు.
సాగు భవితకు మార్గదర్శనం
సానుకూలం కావాలంటే..
* హెచ్చుతగ్గులు అధిగమించేలా వ్యవసాయాభివృద్ధికి కొత్త ప్రయత్నాలు చేయాలి.
* బిందు, తుంపర సేద్యాలు వంటి విధానాల ద్వారా సరైన నీటి యాజమాన్య నిర్వహణ పద్ధతులను అవలంబించాలి.
* మార్కెట్ సమాచారం, వాతావరణ సమాచారాలను రైతులకు ఎప్పటికప్పుడు అందించాలి.
* వ్యవసాయ యాంత్రీకరణ అభివృద్ధికి అవసరమైన పరికరాలు, యంత్రాలు అందుబాటు ధరల్లో ఉండేలా చూడాలి.
* స్వల్ప కాలానికి సంబంధించిన వాతావరణ వివరాలను రైతులకు తెలియజేయాలి.
* రైతుల కోసం వివిధ ప్రదర్శనల ఏర్పాటు, శిక్షణ అందించడం, సరైన సమగ్ర పోషక నిర్వహణ ద్వారా ఎరువుల వినియోగ విధానాన్ని తెలియపరచాలి.
* పంటల ఉత్పత్తి, ఉత్పాదకతల్లో వెనుకబడిన ప్రాంతాల్లో సాంకేతిక విజ్ఞానం ద్వారా ఆ లోటును భర్తీ చేయాలి.
* వ్యవసాయంలో సాంకేతిక వినియోగం కోసం రైతులకు సుశిక్షితులైన సిబ్బంది ద్వారా అవగాహన కల్పించాలి.
* సమర్థమైన భూసారం, జలవనరుల నిర్వహణకు వీలుగా భూమిని అభివృద్ధి చేయాలి.
* ఉపరితల, భూగర్భ జల అవకాశాల ద్వారా సేద్యపు భూమి విస్తీర్ణం పెరిగేలా చూడాలి.
* రైతులందరికీ విత్తనాలు, ఎరువులు, రుణాలు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం సులభంగా అందుబాటులోకి వచ్చేలా చేయాలి.
* వ్యవసాయాన్ని వాణిజ్యపరంగా గిట్టుబాటయ్యేలా చేయాలి.
సంతులిత అభివృద్ధికి ప్రభుత్వ చర్యలు
పంట అభివృద్ధి క్షేత్రాలు
* తెలంగాణలో అన్ని ఆహారపంటలు, నూనె గింజలు, పప్పు ధాన్యాల విస్తీర్ణం పెంపునకు.. ఉత్పత్తి, ఉత్పాదకతల వృద్ధికి.. పంటక్షేత్రాల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేసింది.* భారతదేశంలో 20 శాతం రైతులు ధ్రువీకృత విత్తనాలు ఉపయోగించగా మిగిలినవారు తమ పంట విత్తనాలనే తిరిగి వినియోగిస్తున్నారు. తెలంగాణలో ధ్రువీకృత విత్తనాలను 70-80 శాతం వరకు వినియోగిస్తున్నారు. ఈమేరకు విత్తన సరఫరా కొరత అధిగమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
* తెలంగాణలో విత్తనోత్పత్తికి ఎంతో అవకాశం ఉంది. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లాలో సంకర పత్తి విత్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంకర వరి విత్తనాలను కరీంనగర్, వరంగల్.. సంకర విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని కరీంనగర్, నిజామాబాద్, మొదక్ జిల్లాల్లో చేపట్టారు.
* వరి, ఆముదం, పప్పులు, వేరుశనగ, సోయా, కూరగాయల విత్తనాల కోసం కరీంనగర్, వరంగల్, నల్గొండ, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పంట విత్తన ఉత్పత్తికి సువిశాలమైన క్షేత్రాలను ఉపయోగిస్తున్నారు.
పది విత్తన క్షేత్రాలు
* వ్యవసాయ ఉత్పాదకత పెంపులో విత్తనానిదే కీలక పాత్ర. ఉత్పత్తి చేసి, సరఫరా చేసే విత్తన నాణ్యత మీదే ఎరువులు, తదితర లవణాల సరఫరాల సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. 'దేశానికే విత్తన భాండాగారం'గా తెలంగాణను నిలిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.* వరి, మొక్కజొన్న, సోయా, ఆముదం, పత్తి లాంటి అన్ని రకాల పంటలకు అవసరమైన విత్తనాల ఉత్పత్తికి ఇక్కడి నేలలు, వాతావరణ పరిస్థితులు వరంగా మారాయి.
* వివిధ పంటలకు సంబంధించి 37.42 లక్షల క్వింటాళ్ల విత్తనాలను 3.22 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉత్పత్తిచేసి 'దేశ విత్తన కేంద్రం'గా తెలంగాణ నిలిచింది. సేద్యానికి ఆమోద యోగ్యమైన 536 హెక్టార్ల విస్తీర్ణంతో రాష్ట్రంలో 10 విత్తన క్షేత్రాలున్నాయి. వీటి ప్రధాన ఉద్దేశం 'సీడ్ విలేజ్ స్కీమ్' ద్వారా విత్తనోత్పత్తి, విత్తన సరఫరా చేయడం.
* రాష్ట్రాన్ని 'విత్తన భాండాగారం' చేయాలన్న ఉద్దేశంతో హైదరాబాద్‌లో 3 రోజుల పాటు 8వ 'జాతీయ విత్తన కాంగ్రెస్' సమావేశాన్ని ప్రభుత్వం నిర్వహించింది.
వ్యవసాయ యాంత్రీకరణ
తెలంగాణలో అత్యధికంగా చిన్న కమతాల్లో వ్యవసాయం సాగుతుంది. యంత్రాల వినియోగంతో మరింత భూమిని సాగులోకి తెచ్చి సగటు ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. దీనికోసం పవర్ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్‌లను ఉపయోగించుకునేలా రైతులను ప్రోత్సహిస్తోంది.
పథకం లక్ష్యాలు:
* ప్రతి గ్రామంలో యంత్ర పరికరాలను అందుబాటులోకి తేవడం* పొలం పనుల్లో మానవశక్తిని తగ్గించడం
* వ్యవసాయోత్పత్తి, ఉత్పాదకతలను పెంచడం
* వ్యవసాయోత్పత్తుల నాణ్యతను మెరుగుపరచడం
* రాష్ట్రంలో పండించే ప్రధాన ఉత్పత్తుల వ్యవసాయ ఖర్చులు తగ్గించడం
వ్యవసాయ పరపతి
* తెలంగాణ వ్వవసాయ వార్షిక పరపతి ప్రణాళిక 2014-15లో రూ. 27,233.59 కోట్లు కాగా రూ. 17,636.44 కోట్లు (65%) పంపిణీ చేశారు.* పంట రుణాల కేటాయింపు లక్ష్యం రూ. 18,717.95 కోట్లు కాగా రూ. 13,561 కోట్లు (72%) పంపిణీ చేశారు.
* వ్యవసాయ టర్మ్‌లోన్‌ల లక్ష్యం రూ. 6,238.48 కోట్లు కాగా రూ.2,794.15 కోట్లు (45%) పంపిణీ చేశారు.
* అనుబంధ కార్యకలాపాల కింద రూ. 2,277.16 కోట్లు పంపిణీ లక్ష్యం కాగా రూ. 3,132.29 (137%) కోట్లు పంపిణీ అయింది.
* పంటల రుణమాఫీ కింద తొలి విడతగా రూ. 4,250.0 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.
పంటల బీమా
2. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (డబ్ల్యూబీసీఐఎస్)
3. మెరుగుపరిచిన జాతీయ వ్యవసాయ బీమా పథకం (ఎంఎన్ఏఐఎస్)
జాతీయ వ్యవసాయ బీమా పథకం
వాతవరణ ఆధారిత పంటల బీమా పథకం
జాతీయ పంటల బీమా కార్యక్రమం (ఎన్‌సీఐపీ)
మెరుగుపరిచిన జాతీయ వ్యవసాయ బీమా పథకం
సహకార రంగం
తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్: రాష్ట్ర విభజన తర్వాత 'తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ - హైదారాబాద్'ను పునర్‌వ్యవస్థీకరించారు. దీని పరిధిలో 9 సహకార మార్కెటింగ్ సొసైటీలు మిగిలాయి. ఈ సంస్థకు కరీంనగర్‌లో ఒకే ఒక దాణా మిశ్రమ విభాగం, ఆదిలాబాద్‌లో పత్తి వడికే కేంద్రం ఉన్నాయి.వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం: సమగ్రమైన ఆంధ్రప్రదేశ్ (వ్యవసాయోత్పత్తుల, జీవోత్పత్తుల) విపణుల చట్టం 1996 నవంబరు 18 నుంచి అమల్లోకి వచ్చింది. దీన్ని తెలంగాణ కోసం ఆమోదించుకోవాల్సి ఉంది. మద్దతు ధరలు అందేలా చూడటం, వ్యాపారుల నుంచి రైతులను రక్షించడం దీని ప్రధానోద్దేశం.
మార్కెట్ కమిటీలు
రైతుబంధు పథకం
రైతు బజార్లు
Posted on 18-11-2015
దాసరి రాజేందర్