Type Here to Get Search Results !

25-04-2020 Daily Currentaffairs in telugu

1)జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు నిర్వహించబడుతుంది?
 
A: ఏప్రిల్ 24

2)ఏ సందర్భాన్ని స్మరించుకుంటూ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ 24వ తేదీన నిర్వహించడం జరుగుతుంది?

A: పంచాయతీ రాజ్ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ

3) పంచాయతీ రాజ్ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?

A: 1993 ఏప్రిల్ 24

4) రాజ్యాంగానికి ఎన్నవ సవరణ చేయడం ద్వారా పంచాయతీ చట్టం చేయడం జరిగింది?

A:73వ రాజ్యాంగ సవరణ

5) భారత దేశంలో పంచాయతీరాజ్ చట్టాన్ని మొట్టమొదట ఆమోదించిన రాష్ట్రం ఏది?

రాజస్థాన్

6) భారత దేశంలో పంచాయతీరాజ్ చట్టాన్ని మొట్టమొదటిగా అమలు చేసిన రాష్ట్రం ఏది?

ఆంధ్ర ప్రదేశ్

7) భారత దేశంలో పంచాయతీరాజ్ అమలులో ముఖ్యమైన కమిటీలు

-బల్వంతరాయ్ కమిటీ-1957 (3 అంచెలు)
(గ్రామ, బ్లాక్, జిల్లాస్థాయిలలో)
-VT కృష్ణమాచారి కమిటీ-1960
-తకత్ మాల్ జైన్ స్టడీ గ్రూప్-1966
-అశోక్ మెహతా కమిటీ-1978 (రెండు అంచెలు)
(జిల్లా పరిషత్ ,మండల పరిషత్)
-JVK రావ్ కమిటీ-1985
-డాక్టర్ LM సింఘ్వీ కమిటీ-1986
-PK తుంగాన్ కమిటీ-1989
-S. మోహిందర్ సింగ్-2013

8) భారతదేశంలో మొదటి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు నిర్వహించడం జరిగింది?

2010

9)జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం 2020 సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన పోర్టల్ ఏది?
 
గ్రామ స్వరాజ్ పోర్టల్

10)పంచాయతీల ఆస్తులను గుర్తించుటకు డ్రోన్లను వినియోగించే ఏ స్కీమ్ ను ఇటీవల భారత ప్రధాని ప్రారంభించారు?

స్వమిత్వ స్కీం

11) ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని పంచాయితీలు కలవు?

2.51 లక్షల పంచాయతీలు
2.3 లక్షల గ్రామ పంచాయతీలు
6904 బ్లాక్ పంచాయతీలు
589 జిల్లా పంచాయతీలు

12) 14వ ఆర్థిక సంఘం దేశంలోని పంచాయతీలకు ఎంత మొత్తంలో లో నిధులను కేటాయించింది?

రెండు లక్షల కోట్లు (2015-20)

13) 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి ఏది?
    
 2020-25

14)15వ ఆర్థిక సంఘం ఎన్ని కోట్ల రూపాయల నిధులను దేశంలోని పంచాయతీలకు కేటాయించింది?

 10 లక్షల కోట్ల రూపాయలు

15) 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు?

శ్రీ NK సింగ్

16) 14వ ఆర్థిక సంఘం కన్నా 15వ ఆర్థిక సంఘం పంచాయతీలకు ఎంత ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించింది?
 
399%

17) కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు?

 శ్రీ నరేంద్ర సింగ్ తోమర్

18) ఇటీవల ఏ దేశం త్వరలో మార్స్ మిషన్ చేపడుతున్నట్లు ప్రకటించింది ?

చైనా

19) చైనా చేపట్టిన మార్స్ మిషన్ పేరు ఏమిటి?

తియాన్ వెన్ 1(Tianwen 1)

20) చైనా యొక్క అంతరిక్ష పరిశోధన సంస్థ పేరు
ఏమిటి?

CNSA












Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.