| జవహర్‌లాల్ నెహ్రూ (1889 - 1964) |
| » పదవీ కాలం 15-08-1947 నుంచి 27-05-1964. | |
| » భారతదేశ మొదటి ప్రధాని. |
జవహర్‌లాల్ నెహ్రూ
|
| » ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగారు. (16 సంవత్సరాల 286 రోజులు). |
| » భారత జాతీయ కాంగ్రెస్‌కు మూడుసార్లు అధ్యక్షుడిగా వ్యవహరించారు. |
| » పదవిలో ఉండగా మరణించిన తొలి ప్రధాని. |
| » భారతరత్న అవార్డు (1955) పొందిన మొదటి ప్రధాని. |
| » ఆర్థికమంత్రి హోదాలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ప్రధాని. |
| » మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టారు. |
| » అలీనోద్యమ నిర్మాతల్లో ఒకరిగా పేరు పొందారు. |
| » పంచశీల ఒప్పందంపై చైనాతో 1954లో సంతకం చేశారు. |
| » ప్రణాళికాబద్ధ ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. |
| » భారతదేశ విదేశాంగ విధాన రూపశిల్పి. |
| గుల్జారీలాల్ నందా (1898 - 1998) |
| » పదవీకాలం 27-5-1964 నుంచి 9-6-1964 వరకు. |
గుల్జారీలాల్ నందా
|
| » మొదటి తాత్కాలిక ప్రధాని. |
| » లాల్‌బహదూర్ శాస్త్రి మరణాంతరం రెండోసారి 11-1-1966 నుంచి 24-1-1966 వరకు తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించారు. |
| లాల్‌బహదూర్‌శాస్త్రి (1904-1966) |
| » పదవీకాలం 9-6-1964 నుంచి 11-1-1966 వరకు. |
లాల్‌బహదూర్‌శాస్త్రి
|
| » 1965లో పాకిస్థాన్‌తో మన దేశానికి యుద్ధం జరిగినప్పుడు ప్రధానిగా ఉన్నారు. |
| » 1966లో పాకిస్థాన్‌తో తాష్కెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. |
| » పదవిలో ఉండగానే మరణించిన రెండో ప్రధాని. |
| » 'జై జవాన్ - జై కిసాన్' అనే నినాదాన్ని ఇచ్చారు. |
| » విదేశంలో మరణించిన మొదటి ప్రధాని. |
| » మరణాంతరం భారతరత్న (1966) అవార్డు పొందిన మొదటి ప్రధాని. |
| » మరణాంతరం భారతరత్న అవార్డు పొందిన మొదటి వ్యక్తి కూడా ఈయనే. |
| » ఈయన ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. |
| » శాసనోల్లంఘనోద్యమంలో పాల్గొన్నారు. |
| » 'ఇండియన్ లింకన్'గా పేరుగాంచారు. |
| » హరిత విప్లవం కోసం కృషిచేశారు. |
| » నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు ఈయన కాలంలోనే ఏర్పాటైంది. ఇది ఆయన చేసిన క్షీర విప్లవ కృషిలో భాగం. |
| » ఏ పోర్టుఫోలియో లేకుండా నెహ్రూ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. |
| » కర్ణాటకలో జరిగిన రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. |
| ఇందిరా గాంధీ (1917-1984) |
| » మొదటిసారి పదవీకాలం 24-1-1966 నుంచి 24-3-1977 వరకు. |
ఇందిరా గాంధీ
|
| » రెండోసారి పదవీకాలం 14-1-1980 నుంచి 31-10-1984 వరకు. |
| » రెండోసారి చరణ్‌సింగ్ తర్వాత ప్రధానిగా వ్యవహరించారు. |
| » మొదటి మహిళా ప్రధాని. | |
| » 1971లో 'గరీబీ హఠావో' నినాదాన్నిచ్చారు. | |
| » రాజ్యసభ సభ్యత్వంతో ప్రధానిగా ఎన్నికైన మొదటి వ్యక్తి. |
| » 1969లో 14 బ్యాంకుల్ని జాతీయీకరణ చేశారు. |
| » 1980లో మరో 6 బ్యాంకుల్ని జాతీయీకరణ చేశారు. |
| » రాజభరణాలను 1970లో రద్దు చేయించారు. |
| » 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టారు. |
| » భారతరత్న అవార్డు (1971) పొందిన తొలి మహిళ. |
| » దిల్లీలో జరిగిన నామ్ సదస్సు (1983)కు అధ్యక్షత వహించారు. |
| » భారత రాజ్యాంగానికి అత్యధిక సవరణలు (37) ఈమె కాలంలోనే జరిగాయి. |
| » అత్యధికసార్లు అత్యవసర పరిస్థితులు ఈమె కాలంలోనే విధించారు. |
| » అరెస్టైన మొదటి ప్రధాని. |
| » 1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రధాని పదవిలో ఉండి ఓడిపోయారు. |
| » మొదటి పోఖ్రాన్ అణు పరీక్షలు (18 మే 1974) 'స్మైలింగ్ బుద్ధ' పేరుతో ఈమె హయాంలోనే జరిగాయి. |
| » భారత్‌లో తొలిసారిగా మధ్యంతర ఎన్నికల్ని (1971) నిర్వహించిన ప్రధాని. |
| » ఈమె ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారు. |
| » 1971లో రష్యాతో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. |
| » 1972లో చారిత్రాత్మక సిమ్లా ఒప్పందాన్ని అప్పటి పాకిస్థాన్ ప్రధాని జుల్ఫీకర్ అలీ భుట్టోతో కుదుర్చుకున్నారు. |
| » ఎన్నికల్లో జరిగిన అవకతవకల కారణంగా ప్రధాని పదవికి అనర్హురాలిగా పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. |
| » 15 ఏళ్ల 303 రోజులు ప్రధానిగా వ్యవహరించారు. |
| మొరార్జీ దేశాయ్ (1896-1995) |
| » పదవీ కాలం 24-03-1977 నుంచి 28-7-1979 వరకు. |
మొరార్జీ దేశాయ్
|
| » మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి. |
| » ఆర్థికమంత్రిగా ఎక్కువ పర్యాయాలు (8 సార్లు) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. |
| » పెద్ద వయసులో (81 ఏళ్లు) ప్రధానిగా వ్యవహరించారు. |
| » 1991లో భారతరత్న అవార్డు అందుకున్నారు. |
| » 1978లో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తి హక్కును ఈయన కాలంలోనే తొలగించారు. |
| » ప్రధాని పదవికి రాజీనామా చేసిన తొలి వ్యక్తి. |
| » మండల కమిషన్‌ను ఏర్పాటుచేశారు. |
| » నిరంతర ప్రణాళికలు ఈయన కాలంలోనే ప్రవేశపెట్టారు. |
| » దేశంలో తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. |
| » ఏకకాలంలో ఇద్దరు ఉప ప్రధానమంత్రుల్ని (చరణ్‌సింగ్, జగజ్జీవన్‌రాం)ఈయన కాలంలో నియమించారు. |
| » జన్మస్థలం గుజరాత్. |
| » పాకిస్థాన్ పురస్కారం 'నిషాన్-ఇ-పాకిస్థాన్' పొందిన తొలి భారతీయుడు. |
| చరణ్‌సింగ్ (1902-1987) |
| » పదవీ కాలం 28-7-1979 నుంచి 14-1-1980 వరకు. |
చరణ్‌సింగ్
|
| » రైతు బాంధవుడుగా పేరుగాంచారు. |
| » పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండానే రాజీనామా చేసిన ప్రధాని. |
| » లోక్‌దళ్ పార్టీ వ్యవస్థాపకుడు. |
| » పార్లమెంటులో మొదటిసారిగా విశ్వాసతీర్మానం ప్రకటనను ఈయన కాలంలోనే జారీ చేశారు. |
| » ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. |
| » ప్రధానమంత్రిగా 23 రోజులు పనిచేయగా ఆపద్ధర్మ ప్రధానిగా 4 నెలలు పనిచేశారు. |
| రాజీవ్ గాంధీ (1944-1991) |
| » జన్మస్థలం ముంబయి. |
రాజీవ్ గాంధీ
|
| » పదవీకాలం 31-10-1984 నుంచి 01-12-1989 వరకు. |
| » అతి చిన్న వయసులో (42) ప్రధాని అయ్యారు. |
| » ఓటు హక్కు వయోపరిమితిని 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. |
| » పార్టీ ఫిరాయింపు చట్టాన్ని తీసుకొచ్చారు. |
| » కేంద్ర మంత్రిమండలిని అత్యధికంగా (13 సార్లు) పునర్ వ్యవస్థీకరించారు. |
| » సాంకేతిక విప్లవానికి పునాదులు వేశారు. |
| » నూతన విద్యా విధానాన్ని 1986లో ప్రవేశపెట్టారు. |
| » జవహర్ రోజ్‌గార్ యోజనను ప్రారంభించారు. |
| » 'బికారీ హఠావో' నినాదాన్ని ఇచ్చారు. |
| » IPKF (Indian Peace Keeping Force) దళాలను శ్రీలంకకు పంపారు. |
| » ఆఫ్రికా ఫండ్‌ను ఏర్పరచారు. |
| » బోఫోర్స్ కుంభకోణంలో ఆరోపణలొచ్చాయి. |
| » ఈయన మే 21, 1991న హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి ఏటా మే 21ని ఉగ్రవాద వ్యతిరేక దినంగా భారత ప్రభుత్వం పాటిస్తోంది. |
| విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ (1931-2008) |
| » జన్మస్థలం ఉత్తర్‌ప్రదేశ్. |
విశ్వనాథ్ ప్రతాప్ సింగ్
|
| » పదవీకాలం 2-12-1989 నుంచి 10-11-1990 వరకు. |
| » మండల కమిషన్ సిఫార్సుల్ని అమలు చేశారు. |
| » విశ్వాస తీర్మానం ద్వారా అధికారాన్ని కోల్పోయారు. |
| » దేశంలో ఫ్రంట్ ప్రభుత్వాలకు శ్రీకారం చుట్టారు. |
| » అంతర్‌రాష్ట్ర మండలిని తొలిసారిగా ఏర్పాటు చేశారు. |
| » అయోధ్య వివాదంలో భాజపా మద్దతు ఉపసంహరించుకోవడంతో అధికారాన్ని కోల్పోయారు. |
| చంద్రశేఖర్ (1927-2007) |
| » పదవీ కాలం 10-11-1990 నుంచి 21-6-1991 వరకు. |
చంద్రశేఖర్
|
| » జన్మస్థలం ఉత్తర్‌ప్రదేశ్. |
| » ఎర్రకోట నుంచి ప్రసంగించని ఏకైక ప్రధాని. |
| » ఈయన కాలంలోనే రాజీవ్‌గాంధీ హత్యకు గురయ్యారు. |
| » భారత్ రాజకీయ పాదయాత్రలకు శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి. |
| » ఈయన్ని 'యంగ్ టర్క్' అంటారు. |
| » 'బోన్సీ బాబా'గా పేరొందారు. |
| » 1991లో గల్ఫ్ యుద్ధ సమయంలో అమెరికా యుద్ధ విమానాలకు ఇంధనం నింపేందుకు అనుమతినిచ్చి వివాదాస్పదుడయ్యారు. |
| » పార్లమెంటులో కోరం సభ్యుల మద్ధతు లేకుండానే జనతాదళ్‌ను చీల్చి కాంగ్రెస్ మద్ధతుతో ప్రధానిగా వ్యవహరించారు. |
| పాములపర్తి వెంకట నరసింహారావు (1921-2004) |
| » జన్మస్థలం తెలంగాణ. |
పాములపర్తి వెంకట నరసింహారావు
|
| » పదవీకాలం 21-6-1991 నుంచి 16-5-1996 వరకు. |
| » దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన తొలి వ్యక్తి. |
| » పూర్తి పదవీకాలం మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపించిన ఏకైక ప్రధాని. |
| » దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలకు మన్మోహన్‌సింగ్‌తో కలిసి పునాదులు వేశారు. |
| » పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనూ సభ్యుడు కాకుండానే ప్రధాని అయిన తొలి వ్యక్తి. తర్వాత నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి ఎన్నికయ్యారు. |
| » 'లుక్ ఈస్ట్' అనే పాలసీని సూత్రీకరించిన ప్రధాని. |
| » బహు భాషా పండితుడు. |
| » ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా (1971-73) పని చేశారు. |
| » 'దేశ్ బచావో, దేశ్ బనావో' నినాదాన్ని ఇచ్చారు. |
| » ఈయన ఆత్మకథ పేరు "The Insider". |
| అటల్ బిహారీ వాజ్‌పేయీ (1926) |
| » జన్మస్థలం మధ్యప్రదేశ్. |
అటల్ బిహారీ వాజ్‌పేయి
|
| » మొదటిసారి పదవీకాలం 16-5-1996 నుంచి 01-6-1996 వరకు. |
| » రెండోసారి 19-3-1998 నుంచి 22-5-2004 వరకు. |
| » మొదటిసారి కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానిగా కొనసాగారు. |
| » ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించిన తొలి ప్రధాని. |
| » కార్గిల్ యుద్ధాన్ని విజయవంతంగా ఎదుర్కొన్నారు. |
| » పోఖ్రాన్‌లో రెండోసారి అణుపరీక్షలు 'ఆపరేషన్ శక్తి' పేరుతో 11 మే, 1998న నిర్వహించారు. |
| » లాహోర్ బస్సు రాయబారం ఈయన కాలంలోనే ప్రారంభమైంది. |
| » అమెరికాతో వ్యూహాత్మక ఒప్పందాలకు శ్రీకారం చుట్టారు. |
| » 'జై విజ్ఞాన్' అనే నినాదాన్ని ఇచ్చారు. |
| హెచ్.డి. దేవెగౌడ (1933) |
| » జన్మస్థలం కర్ణాటక. |
హెచ్.డి. దేవెగౌడ
|
| » పదవీ కాలం 01-6-1996 నుంచి 20-4-1997 వరకు. |
| » దక్షిణ భారతదేశం నుంచి ప్రధాని అయిన రెండో వ్యక్తి. |
| » కేంద్ర క్యాబినెట్ మంత్రి అవ్వకుండానే ప్రధానిగా వ్యవహరించారు. |
| » రాజ్యసభ సభ్యునిగా ఉండి ప్రధాని పదవిని నిర్వహించిన రెండో వ్యక్తి. |
| » పార్లమెంటులో ఏ సభలోనూ సభ్యుడు కాకుండా ప్రధాని అయిన రెండో వ్యక్తి. |
| » 13 పార్టీలతో కూడిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. |
| » అతి తక్కువ మంది లోక్‌సభ సభ్యుల్ని (44) కలిగియుండి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. |
| ఐ.కె. గుజ్రాల్ (1919-2012) |
| » జన్మస్థలం పాకిస్థాన్‌లోని జీలం. |
ఐ.కె. గుజ్రాల్
|
| » పదవీకాలం 21-4-1997 నుంచి 19-3-1998 వరకు. |
| » రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ప్రధాని పదవిని చేపట్టిన మూడో వ్యక్తి. |
| » వరల్డ్ స్టేట్స్‌మన్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు. |
| » జనతాదళ్ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వానికి (14 పార్టీలు) నేతృత్వం వహించారు. |
| » గుజ్రాల్ డాక్ట్రిన్ పేరుతో భారత విదేశాంగ విధానంలో ఒక నూతన కోణాన్ని ఆవిష్కరించారు. |
| డాక్టర్ మన్మోహన్ సింగ్ (1932) |
| » పాకిస్థాన్‌లోని జీలంలోని 'ఘా' అనే గ్రామంలో జన్మించారు. |
డాక్టర్ మన్మోహన్ సింగ్
|
| » మొదటిసారి పదవీకాలం 22-5-2004 నుంచి 25-5-2009 వరకు. |
| » రెండోసారి పదవీకాలం 25-5-2009 నుంచి 26-5-2014 వరకు. |
| » రాజ్యసభ సభ్యత్వం ద్వారా ప్రధాని అయ్యారు. |
| » ప్రధాని పదవిని అలంకరించిన మొదటి ఆర్థికవేత్త. |
| » విశ్వాసతీర్మానంపై ఓటు వేయలేని మొదటి ప్రధాని. |
| » కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. |
| » యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (UPA) కూటమి ద్వారా ప్రధాని అయ్యారు. |
| » అమెరికాతో 123 అణు ఒప్పందాల్ని కుదుర్చుకున్న ప్రధాని. |
| » దేశంలో సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్నవారిలో 3వ స్థానంలో ఉన్నారు. |
| » లోక్‌సభ పదవీకాలం మధ్యలో విశ్వాస పరీక్షలో నెగ్గిన తొలి ప్రధాని. |
| » 2010లో వరల్డ్ స్టేట్స్‌మన్ అవార్డు పొందారు. |
| » వరుసగా 5వ సారి అసోం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. |
| » వరుసగా 10సార్లు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేశారు. |
| నరేంద్ర మోదీ (1950) |
| » 26 మే 2014 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు. |
నరేంద్ర మోదీ
|
| » గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. |
| » 'స్వచ్ఛభారత్' నినాదాన్ని ఇచ్చారు. |
| » 'జనధన్ యోజన'ను ప్రారంభించారు. |
| » వారణాసి లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. |
| ప్రధానమంత్రుల సమాధుల పేర్లు |
| ప్రధానమంత్రి | సమాధి పేరు |
| జవహర్‌లాల్ నెహ్రూ | శాంతివన్ |
| గుల్జారీలాల్ నందా | నారాయణ్‌ఘాట్ |
| లాల్ బహదూర్ శాస్త్రి | విజయ్ ఘాట్ |
| ఇందిరా గాంధీ | శక్తి స్థల్ |
| మొరార్జీ దేశాయ్ | అభయ్ ఘాట్ |
| చరణ్‌సింగ్ | కిసాన్ ఘాట్ |
| రాజీవ్ గాంధీ | వీర్ భూమి |
| చంద్రశేఖర్ | స్మృతి స్థల్ |
| పి.వి. నరసింహారావు | జ్ఞాన భూమి |
|