May-08 Current affairs articles
రష్యా అధ్యక్షుడిగా నాలుగోసారి పుతిన్ ప్రమాణ స్వీకారం
Event-Date: | 08-May-2018 |
Level: | International |
Topic: | Persons in News |

- పుతిన్ లెనిన్‌గ్రాడ్ (ప్రస్తుత సెయింట్‌పీటర్స్‌బర్స్)లో 1952 అక్టోబర్ 7న ఒక కార్మికుని కుటుంబంలో జన్మించారు. గూఢచారిగా ఉండాలనే చిన్ననాటి కలను నెరవేర్చుకునేలా 1985లో కేజీబీలో పుతిన్ చేరారు.
- 1996లో రష్యాకు బోరిస్ ఎల్సిన్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు క్రెమ్లిన్‌లో పనిచేయడానికి మాస్కోకు రావాల్సిందిగా పిలుపు అందింది. రెండేళ్లలోనే ఆయన కేజీబీ సారధి అయ్యారు. అ
- నారోగ్యంతో సతమతమవుతున్న ఎల్సిన్ 1999 ఆగస్టులో పుతిన్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదించారు. చెచెన్యా ప్రాంతంలో తిరుగుబాటుదారుల్ని అణిచివేయడానికి చేసిన యుద్ధంతో పుతిన్‌కు ప్రజాదరణ ఒక్కసారిగా పెరిగింది.
- ఎల్సిన్ రాజీనామా చేశాక పుతిన్ రష్యా అధ్యక్షుడయ్యారు. మూడేళ్ల దాంపత్య జీవితం తర్వాత 2013లో భార్య లిడ్మిలాకు ఆయన విడాకులిచ్చారు.
- 2008లో అధ్యక్ష పగ్గాలను తన అనుయాయుడైన ద్మిత్రి మెద్వెదేవ్‌కు అప్పగించి, పుతిన్ ప్రధానమంత్రి అయ్యారు. 2012లో మళ్లీ అధ్యక్షుడయ్యారు.
- ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన నేతగా ఫోర్బ్స్ జాబితాలో గత నాలుగేళ్లుగా పుతిన్ పేరే కొనసాగుతోంది.
-------------------------------------------------------------------------------------------
సివిల్ప్ ఫస్ట్ ర్యాంకర్ అనుదీప్‌కు తెలంగాణ సీఎం ఆశీస్సులు
Event-Date: | 08-May-2018 |
Level: | Local |
Topic: | Persons in News |

ఆంధ్రప్రదేశ్‌లో ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ కార్యక్రమం
Event-Date: | 08-May-2018 |
Level: | National |
Topic: | Govt Schemes and Programmes |

- విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకు (2.5కి.మీ దూరం) నిర్వహించిన భారీ ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. పలువురు మహిళలు సీఎం వెంట కలిసి నడిచారు.
- అత్యాచార ఘటనల నివారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు.
- చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ర్యాలీలు, సభలు నిర్వహించలేదు.
- ‘ఆడబిడ్డకు రక్షగా కదులుదాం’ కార్యక్రమం చేపట్టడంపై బాలల హక్కుల ఉద్యమకారుడు, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
ఫిక్కీ ‘సంఘటిత రంగంలో స్త్రీ-పురుష సమానత్వ సూచిక’
Event-Date: | 08-May-2018 |
Level: | National |
Topic: | Miscellaneous(General) |

- ఫిక్కీ మహిళా విభాగం అధ్యక్షురాలు - పింకీరెడ్డి
జయలలిత స్మారక మందిరానికి శంకుస్థాపన
Event-Date: | 08-May-2018 |
Level: | National |
Topic: | Places in News |

కథువా కేసు పఠాన్‌కోట్‌కు బదిలీ
Event-Date: | 08-May-2018 |
Level: | National |
Topic: | Judiciary and Judgement |

- విచారణ రోజువారీగా, రహస్యంగా జరగాలని పేర్కొంది. పఠాన్‌కోట్‌లోని జిల్లా సెషన్స్ జడ్జి దీన్ని ప్రత్యక్షంగా చేపట్టాలని ఆదేశించింది. తమకు బెదిరింపులు వస్తున్నందు వల్ల కేసు విచారణను చండీగఢ్‌కు బదిలీ చేయాని బాధితురాలి తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రతో కూడిన ధర్మాసనం ఈ మేరకు స్పందించింది.
- కేసు విచారణపై విధించిన స్టేను కూడా ఎత్తివేసింది. కేసును సీబీఐకి అప్పగించడానికి నిరాకరించింది. ఈ కేసు విచారణ బాధ్యతను మరే ఇతర సెషన్స్ న్యాయమూర్తులకు అప్పగించరాదని పఠాన్‌కోట్ జిల్లా, సెషన్స్ జడ్జీని ఆదేశించింది. ఈ అంశానికి సంబంధించి ఎలాంటి పిటిషన్లను ఏ కోర్టూ చేపట్టరాదని స్పష్టం చేసింది.
ఐఎస్ ఉగ్రవాదుల అనుసంధానంగా ఫేస్‌బుక్
Event-Date: | 08-May-2018 |
Level: | International |
Topic: | Science and Technology |

అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఉగ్రవాద నిరోధక ప్రాజెక్టు (సీఈపీ) దీన్ని చేపట్టింది. 96
- దేశాల్లోని 1000 మంది ఐఎస్ ఉగ్రవాదుల ఫేస్‌బుక్ వినియోగాన్ని సంస్థ విశ్లేషించింది.‘‘సజెస్టెడ్ ఫ్రెండ్స్’’ సదుపాయంపై దృష్టిసారించింది.
- ఒకేలాంటి అభిరుచులు ఉండేవారిని దగ్గర చేసే ఉద్దేశంతో ఈ సదుపాయాన్ని ఫేస్‌బుక్ ప్రవేశపెట్టింది. అయితే కొందరు ఉగ్రవాదుల పేజీను పరిశీలించిన అనంతరం మరింత మంది ఉగ్రవాదుల పేజీలను చూపించేందుకు ఈ సాంకేతికత తోడ్పడుతోందని సీఈపీ పరిశోధకులు తెలిపారు. అతివాద భావజాలం ఉండేవారిని ఉగ్రవాదంలోకి లాగేందుకూ ఇది సహకరిస్తోందని వివరించారు.
- ఇటీవల 8.7 కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచార దుర్వినియోగం వివాదం ఫేస్‌బుక్‌ను కుదిపేసింది. అప్పటినుంచీ ఫేస్‌బుక్ విశ్వసనీయతపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.
202 రంగులున్నచీర రూపొందించిన సిరిసిల్ల చేనేత కార్మికుడు
Event-Date: | 08-May-2018 |
Level: | Local |
Topic: | Persons in News |

దేశికోత్తమ పురస్కారానికి అమితాబ్ పేరు ప్రతిపాదన
Event-Date: | 08-May-2018 |
Level: | National |
Topic: | Awards and honours |

భారత్‌లో బీటీ పత్తి విత్తనాల పేటెంట్ హక్కులపై మాన్‌శాంటో వినతికి సుప్రీం తిరస్కరణ
Event-Date: | 08-May-2018 |
Level: | National |
Topic: | Judiciary and Judgement |

కేంద్ర కార్యాలయాల్లోకి మాజీ ఎంపీల ప్రవేశంపై నియంత్రణ
Event-Date: | 08-May-2018 |
Level: | National |
Topic: | Govt Schemes and Programmes |

రాజ్యసభ నిబంధనల పునఃపరిశీలనకు వీకే అగ్నిహోత్రి కమిటీ
Event-Date: | 08-May-2018 |
Level: | National |
Topic: | Persons in News |

కేబినెట్ కార్యదర్శి పదవీ కాలం పొడిగింపు
Event-Date: | 08-May-2018 |
Level: | National |
Topic: | Persons in News |
