ప్రపంచవ్యాప్తంగా 2018 మే 15న ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్‌ను నిర్వహించారు. 2018 ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీస్ థీమ్ - Families and inclusive societies
-------------------------------------------------------------------------------------------
కోల్‌కతాలో 4వ SAWEN ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం
4వ సౌత్ ఏషియా వైల్డ్‌లైఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం 2018 మే 8 నుంచి 10 వరకు కోల్‌కతాలో నిర్వహించారు. సౌత్ ఏషియా వైల్డ్‌లైఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం భారత్‌లో నిర్వహించడం ఇదే ప్రథమం.
SAWEN-South Asia Wildlife Enforcement Network
లోక్‌పాల్ ఎంపిక కమిటీలో ముకుల్ రోహత్గీ
ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీని లోక్‌పాల్ ఎంపిక కమిటీలో న్యాయ నిపుణిడిగా నియమించినట్టు కేంద్ర ప్రభుత్వం 2018 మే 15న సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ప్రధాని నేతృత్వంలోని ఈ కమిటీలో న్యాయ నిపుణుడిగా సీనియర్ న్యాయవాది పి.పి.రావు కొన్నాళ్లు పనిచేశారు. 2017 సెప్టెంబరు 11న ఆయన మరణించినప్పటి నుంచి ఆ సభ్యత్వం ఖాళీగా ఉంది.
భౌతిక శాస్త్రవేత్త సుదర్శన్ మృతి
ప్రఖ్యాత సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త ఇ.సి.జి.సుదర్శన్(86) 2018 మే 15న అమెరికాలో మృతి చెందారు. సుదర్శన్ 1931లో కేరళలోని కొట్టాయంలో జన్మించారు. ఆయన 40 ఏళ్లపాటు టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఐదు దశాబ్దాల పాటు సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్తగా వ్యవహరించారు.
- పీహెచ్‌డీ సిద్ధాంత పత్రం కోసం పనిచేస్తున్న సమయంలో ఆయన ‘ఎ థియరీ ఆఫ్ వీక్ ఇంటరాక్షన్స్’ను కనుగొన్నారు. భౌతిక శాస్త్రం, క్వాంటమ్ ఆప్టిక్స్, క్వాంటమ్ కంప్యూటేషన్ తదితర రంగాల్లో అద్భుత ఆవిష్కరణలు చేశారు.
- భారత ప్రభుత్వం 2007లో ఆయనకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందించింది. నోబెల్ పురస్కారానికి 9 సార్లు ఆయన పేరును సిఫార్సు చేసినప్పటికీ ఆ అవార్డు ఆయనకు దక్కలేదు.
పేరువంచ గ్రామపంచాయతీ భవనానికి జలగం వెంగళరావు పేరు
తెలంగాణలోని ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో గల పేరువంచ గ్రామపంచాయతీ భవనానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు పేరును పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడి గ్రామపంచాయతీ తీర్మానాన్ని అనుసరించి భవనానికి జలగం వెంగళరావు పేరును పెట్టాలంటూ ఆయన కుమారుడు, ఎమ్మెల్యే జలగం వెంకట్రావు నుంచి అభ్యర్థన రావడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకొంది. పంచాయతీ భవనాన్ని ఇక నుంచి ‘జలగం వెంగళరావు భవన్’గా వ్యవహరించాలని కలెక్టర్‌ను ఆదేశిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ 2018 మే 15న ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కమిషన్ విధులపై మార్గదర్శకాలు
రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ పద్దుల కింద స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపు, అధికారాల బదలాయింపు తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక రూపొందించే రాష్ట్ర 4వ ఆర్థిక కమిషన్ కోసం 2018 మే 15న మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
- ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు నిధుల బదలాయింపు, స్థానిక సంస్థల బలోపేతం కోసం తీసుకోవలసిన చర్యలు, ఇతర పథకాల కింద నిధుల కేటాయింపు తదితర అంశాలపై రాష్ట్ర ఆర్థిక సంఘం అధ్యయనం చేయాల్సి ఉంటుంది.
- ఈ నివేదికను 2019 అక్టోబరు 30లోగా ప్రభుత్వానికి కమిషన్ రూపొందించి అందిస్తే 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకోనున్నారు.
ఆంధ్రా షుగర్సు జేఎండీ నరేంద్రనాథ్‌కు బ్రెజిల్ అవార్డు
ఒంగోలు జాతి పశు సంపద అభివృద్ధికి చేసిన కృషిని గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఆంధ్రా షుగర్సు జేఎండీ ముళ్లపూడి నరేంద్రనాథ్‌కు బ్రెజిల్ దేశంలోని రెండు రాష్ట్రాలు గౌరవ పురస్కారాతో సత్కరించాయి.
- 2018 ఏప్రిల్ 27న ఏబీసీజెడ్(బ్రెజీలియన్ జేబు కేటిల్ బ్రీడర్స్ అసోసియేషన్) ఆధ్వర్యంలో బ్రెజిల్ దేశంలోని మీనస్ జెరయిస్ రాష్ట్రంలోని ఉబెరాబ నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏబీసీజెడ్, బ్రెజిల్ వ్యవసాయ శాఖ సంయుక్తంగా పురస్కారం అందజేశాయి.
- 2018 మే 5న సావ్‌పా రాష్ట్రంలో అరసటూబ నగరంలో నిర్వహించిన మరో కార్యక్రమంలో కూడా నరేంద్రనాథ్‌ను సత్కరించారు.