¤ పోఖ్రాన్ అణు పరీక్షల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 20వ జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. » దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొని ప్రసంగించారు. 1998లో చేపట్టిన పోఖ్రాన్ అణు పరీక్షలతోనే భారతీయుల వైజ్ఞానిక సామర్థ్యమెంతో ప్రపంచానికి తెలిసిందని రాష్ట్రపతి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మే - 12
¤ అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 35 మందికి ప్రతిష్ఠాత్మక ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులు ప్రదానం చేశారు.