¤ జోర్డాన్ రాజు అబ్దుల్లా - 2 బిన్ అల్ హుస్సేన్ భారత పర్యటనలో భాగంగా దిల్లీలో పధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. కీలక ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై సమగ్ర చర్చలు జరిపారు. రక్షణ, ఉగ్రవాదంపై పోరు సహకారం బలోపేతం చేసుకోవడం సహా 12 అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. » ఇస్లామిక్ వారసత్వంపై దిల్లీలో జరిగిన సదస్సులో ఇరువురు నేతలు పాల్గొన్నారు. » జోర్డాన్ రాజు మహ్మద్ ప్రవక్తకు చెందిన 41వ తరం వారసుడు. అతివాదాన్ని ఎదుర్కోవడం అరబ్ ప్రపంచంలో చేపట్టిన 'అఖాబా ప్రక్రియ'లో అబ్దుల్లా - 2 కీలకపాత్ర పోషించారు. » 'ఏ థింకింగ్ పర్సన్స్ గైడ్ టు ఇస్లామ్' అనే పుస్తకానికి సంబంధించి ఉర్దూ అనువాదాన్ని అబ్దుల్లా - 2కు ప్రధాని మోదీ బహూకరించారు. జోర్డాన్ రాజుకు వరసకు సోదరుడయ్యే ప్రిన్స్ ఘాజీ బిన్ మహ్మద్ ఈ పుస్తక మూల రచయిత.
మార్చి - 3
¤ వియత్నాం అధ్యక్షుడు ట్రాన్‌డయ్ క్వాంగ్ భారత పర్యటనలో భాగంగా దిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. » ఇరువురు నేతలు చర్చల అనంతరం పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రధానంగా అణుశక్తి, వాణిజ్యం వ్యవసాయ రంగాల్లో పరస్పర సహకారానికి మూడు ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. » విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తోనూ ట్రాన్‌డయ్ క్వాంగ్ సమావేశమయ్యారు.
మార్చి - 9
¤ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్నారు.
మార్చి - 10
¤ భారత్‌లో పర్యటిస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ప్రధాని నరేంద్ర మోదీలు దిల్లీలో విస్తృత చర్చలు జరిపారు. » అనంతరం రక్షణ, భద్రత, అణు ఇంధనం, రహస్య సమాచార పరిరక్షణ, ఇండో - పసిఫిక్ ప్రాంతాల్లో సహకారం, ఉగ్రవాద నిర్మూలన లాంటి ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. » వ్యూహాత్మక బంధాలు బలోపేతమయ్యేలా భారత్ - ఫ్రాన్స్ మధ్య 16 బిలియన్ డాలర్ల (సుమారు రూ. లక్ష కోట్లు) విలువైన 14 ఒప్పందాలు ఖరారయ్యాయి. వీటిలో కేవలం విమాన ఇంజిన్ల సరఫరాకు కుదిరిన ఒప్పందం విలువ 12.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 81,000 కోట్లు). » మహారాష్ట్రలోని జైతాపూర్ అణువిద్యుత్ కర్మాగారం ఒప్పందాన్ని ముందుకు తీసుకువెళ్లడం, హైస్పీడ్ రైళ్లు, పర్యావరణం, మాదకద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేయడం, సౌర ఇంధనం లాంటి అంశాలపైనా ఒప్పందాలు కుదిరాయి. » భారత్ - ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య పెట్టుబడుల ఒప్పందంపై తగిన సమయంలో మళ్లీ చర్చలు ప్రారంభించాలని భారత్ - ఫ్రాన్స్ నిర్ణయించాయి. తమ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రస్తుతం ఉన్న 9 బిలియన్ యూరోల నుంచి 2022 నాటికి 15 బిలియన్ యూరోలకు పెంచుకోవాలని నిర్ణయించాయి. » హైస్పీడ్ రైళ్లను నడిపేందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించడానికి భారతీయ రైల్వే, ఫ్రాన్స్‌కు చెందిన ఎస్ఎన్‌సీఎఫ్ మొబిలిటీస్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ద్వారా రైల్వేస్టేషన్ల పునరుద్ధరణ, ఆధునికీకరణ, మౌలిక సదుపాయం విస్తరణ సహా వివిధ రంగాల్లో ఫ్రాన్స్ నుంచి సహకారం అందుతుంది. శాశ్వత ప్రాతిపదికన 'ఇండో ఫ్రెంచ్ రైల్వే ఫోరం' ను ఏర్పాటు చేస్తారు. » భారత్, ఫ్రాన్స్ రక్షణ మంత్రులు నిర్మలా సీతారామన్, ఫ్లోరెన్స్ పార్లీలు విడిగా చర్చలు జరిపారు. » విద్యార్హతల్ని పరస్పరం గుర్తించడానికి ఉద్దేశించిన ఒక ఒప్పందంపై భారత్ - ఫ్రాన్స్ సంతకాలు చేశాయి. విద్యారంగం, పరిశోధన పరిశ్రమ నిపుణులందరినీ ఒక్కచోటకు చేర్చడానికి ఉద్దేశించిన సదస్సులో ఫ్రాన్స్ ఉన్నత విద్యాశాఖ మంత్రి ఫ్రెడెరిక్ విదల్, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ ఈ ఒప్పందాన్ని పరస్పరం మార్చుకున్నారు. ఈ ఒప్పందం వల్ల భారత్‌లో చేసిన డిగ్రీలకు ఫ్రాన్స్‌లో గుర్తింపు లభిస్తుంది. మాధ్యమిక విద్య నుంచి డాక్టరేట్ డిగ్రీల వరకు వివిధ స్థాయిల్లో చదువులకు పరస్పర గుర్తింపు లభిస్తుంది. » విద్యార్థుల్ని ఒక దేశం నుంచి మరో దేశానికి పంపించడానికి వీలుగా విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల మధ్య 15 ఒప్పందాలు కుదిరాయి.
మార్చి - 12
¤ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ భారత పర్యటనలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో పర్యటించారు. » ప్రధాని మోదీతో కలసి ఉత్తరప్రదేశ్‌లోని అతిపెద్దదైన రూ.500 కోట్ల సౌర విద్యుదుత్పత్తి కర్మాగారాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అంతర్జాతీయ సౌరకూటమి (ఐఎస్ఏ) కార్యక్రమంలో భాగంగా మీర్జాపూర్ జిల్లాలోని దాదర్ కలాన్‌లో 75 మెగావాట్ల సామర్థ్యంతో దీన్ని ఫ్రాన్స్ సాంకేతికతతో ఏర్పాటు చేశారు. 388 ఎకరాల విస్తీర్ణంలో 1.88 లక్షల సౌరఫలకాలతో నెలకొల్పారు. ఇవి నెలకు సుమారు 1.30 కోట్ల యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలుగుతాయి. » బడాలాల్‌పూర్‌లో ఉన్న దీన్‌దయాళ్ ఉపాధ్యాయ హస్తకళా వాణిజ్య సదుపాయ కేంద్రం 'సంకుల్'ను ఇద్దరు నేతలు సందర్శించారు. » యూపీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మండువాడీ-పట్నా ఇంటర్‌సిటీ రైలును ప్రారంభించారు. ఇది వారణాసి నుంచి మూడో మహామన ఎక్స్‌ప్రెస్.
మార్చి - 22
¤ భారత్‌లో అయిదు రోజుల పర్యటనలో భాగంగా జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టెన్‌మేయర్ దిల్లీకి చేరుకున్నారు. సతీమణి ఎల్కీ బుదెన్ బెందర్‌తో కలిసి వచ్చిన ఆయనకు కేంద్ర మంత్రి ఎస్ఎస్ అహ్లువాలియా విమానాశ్రయంలో స్వాగతం పలికారు. » జర్మన్ అధ్యక్షుడి హోదాలో తొలిసారి పర్యటిస్తున్న ఆయన వారణాసిలో వివిధ ప్రాంతాలను సందర్శించారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, అధ్యాపకులతో ముచ్చటించారు.
మార్చి - 24
¤ ఐదు రోజుల పర్యటన నిమిత్తం దిల్లీ వచ్చిన జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టెర్ స్టీన్‌మియెర్‌తో ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ చర్చలు జరిపారు.¤ జింబాబ్వే ఉపాధ్యక్షుడు కాన్‌స్టాంటినో జీడీఎన్ చివెంగా ఉగాండా ఉపాధ్యక్షుడు ఎడ్వర్డ్ కివానుక స్సెకాండీ, మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ క్లాస్ చిలీమా; ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో దిల్లీలో వేర్వేరుగా భేటీ అయ్యారు.
మార్చి - 28
¤ ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్ ఉన్ చైనాలో రహస్యంగా పర్యటించడం నిజమేనని తేలింది. » మార్చి 25 నుంచి 28 వరకు బీజింగ్‌లో కిమ్ 'అనధికార పర్యటన' సాగినట్లు ఉత్తర కొరియా, చైనా ధ్రువీకరించాయి. » పర్యటన సందర్భంగా చైనా ప్రధాని షీజిన్‌పింగ్‌తో కిమ్ చర్చలు జరిపారు. » ఉత్తర కొరియా పాలకుడిగా మారిన తర్వాత కిమ్ విదేశాలకు వెళ్లడం ఇదే తొలిసారి. వేరే దేశాధినేతలతో ఆయన భేటీ అవ్వడం కూడా ఇదే మొదటిసారి. » పర్యటనకు కిమ్ తన భార్య రిసొల్ జునూ వెంట తీసుకెళ్లారు.