Type Here to Get Search Results !

మార్చి-2018 నియామకాలు

మార్చి - 27
¤ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జాతీయ ఆరోగ్య భద్రతా పథకం 'ఆయుష్మాన్ భారత్‌'కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా ఇందు భూషణ్ నియమితులయ్యారు.         » ఆయుష్మాన్ భారత్‌కు భూషణ్ రెండేళ్లపాటు సీఈఓగా కొనసాగుతారని కేంద్రం ఓ ఉత్తర్వులో పేర్కొంది.         » ప్రస్తుతం ఈయన ఫిలిప్పీన్స్‌లోని మనీలా కేంద్రంగా పనిచేస్తున్న ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తూర్పు ఆసియా విభాగం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.         » భూషణ్ అమెరికాలో హెల్త్ సైన్సెస్‌లో మాస్టర్స్, ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు.         » ప్రభుత్వం 'ఆయుష్మాన్ భారత్' పథకంలో భాగంగా దేశంలోని ప్రతి పేద కుటుంబానికి ఏటా రూ.5 లక్షల మేర ఉచిత బీమా సౌకర్యం కల్పించనుంది.
మార్చి - 30
¤ జాతీయ పరీక్ష సంస్థ (ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్‌గా వినీత్ జోషీని కేంద్రం నియమించింది. ఈయన 1992 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి.         » ఐదేళ్లపాటు ఈయన ఈ పదవిలో కొనసాగుతారు.         » సీబీఎస్ఈ ప్రశ్న పత్రాల బహిర్గతం నేపథ్యంలో ఈ నియామకం చోటుచేసుకుంది.         » సీబీఎస్ఈ, ఏఐసీటీఈ తదితర మండలాల పరిధిలోని ఉన్నత విద్యా సంస్థల్లో అడ్మిషన్ల నిమిత్తం ఎన్టీఏ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తోంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.