Type Here to Get Search Results !

మార్చి-2018 నివేదికలు-సర్వేలు

మార్చి - 1
¤ 2018కి క్వాక్వారెల్లీ సైమండ్స్ (క్యూఎస్) సంస్థ ప్రపంచ మేటి వర్సిటీల జాబితాను విడుదల చేసింది.ముఖ్యాంశాలు          » తొలి పది విద్యా సంస్థల్లో అయిదు అమెరికావి, నాలుగు బ్రిటన్‌కి చెందిన వర్సిటీలు ఉన్నాయి.
          » జాబితాలోని మొదటి 200 విద్యా సంస్థల్లో మూడు భారత విద్యా సంస్థలకు చోటు దక్కింది.
జాబితాలోని మొదటి పది విద్యా సంస్థలు1. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) - అమెరికా
2. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం - అమెరికా
3. హార్వర్డ్ విశ్వవిద్యాలయం - అమెరికా
4. కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - అమెరికా
5. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం - బ్రిటన్
6. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం - బ్రిటన్
7. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ - బ్రిటన్
8. ఇంపీరియల్ కాలేజ్ లండన్ - బ్రిటన్
9. షికాగో యూనివర్సిటీ - అమెరికా
10. ఈటీహెచ్ జ్యొరిచ్ - స్విస్ ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - స్విట్జర్లాండ్.
          » జాబితాలోని భారత విద్యా సంస్థలు - ర్యాంకులు.
ఐఐటీ ఢిల్లీ
 - 172
ఐఐటీ బాంబే
 - 179
ఐఐటీ బెంగళూరు
 - 190
ఐఐటీ మద్రాస్
 - 264
ఐఐటీ కాన్పూర్
 - 293
ఐఐటీ ఖరగ్‌పూర్ -
 308
ఐఐటీ రూర్కీ
 - 431 - 440
ఢిల్లీ వర్సిటీ
 - 481 - 490
ఐఐటీ గువాహటి - 501 - 550
మార్చి - 8
¤ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐరాసకు చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో) స్త్రీ, పురుష సమానత్వానికి సంబంధించి ఓ నివేదికను విడుదల చేసింది.ముఖ్యాంశాలు స్త్రీ, పురుష సమానత్వంలో ఉన్న వ్యత్యాసాలను పూడ్చే విషయంలో గణనీయ పురోగతి సాధించినప్పటికీ మహిళలకు ఉద్యోగాల లభ్యత తక్కువగానే ఉంది. వారు తక్కువ నాణ్యత ఉన్న ఉద్యోగాలతో సరిపెట్టుకునే అవకాశమే ఎక్కువని వివరించింది. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా మహిళా కార్మికశక్తి భాగస్వామ్య రేటు 48.5 శాతంగా ఉంది. పురుషులతో పోలిస్తే ఇది 26.5 శాతం పాయింట్ల మేర తక్కువగా ఉంది. 2018లో మహిళల్లో నిరుద్యోగ రేటు 6 శాతంగా ఉంది. పురుషులతో పోలిస్తే ఇది 0.8 శాతం అధికం. మొత్తం మీద చూస్తే ఉద్యోగాల్లో ప్రతి పది మంది పురుషులకుగాను ఆరుగురు మహిళలకు మాత్రమే ఉద్యోగం దొరుకుతోంది. యాజమాన్య హోదా విషయంలో మహిళలతో పోలిస్తే పురుషుల సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. అరబ్ దేశాలు, ఉత్తర ఆఫ్రికాల్లో పురుషులతో పోలిస్తే మహిళల్లో నిరుద్యోగ రేటు రెట్టింపు స్థాయిలో ఉంది. అక్కడి సామాజిక కట్టుబాట్లు మహిళల ఉపాధికి అవరోధంగా ఉన్నాయి. తూర్పు ఐరోపా, ఉత్తర అమెరికాలో మాత్రం మహిళల కన్నా పురుషుల్లోనే నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉంది.¤ లింగ వైవిధ్యంలో భారత్ స్థానం మెరుగుపడిందని గ్రాంట్ థోర్న్‌టన్స్ నివేదిక పేర్కొంది. 2018లో దేశీయంగా సంస్థల అగ్రస్థానాల్లో 20 శాతం మంది మహిళలు ఉండటమే ఇందుకు కారణం. 2017లో వీరి సంఖ్య 17 శాతం. 2014లో ఇది 14 శాతమే.          » అంతర్జాతీయంగా చూస్తే, మహిళలకు అగ్రాసనం విషయంలో, భారత్ కింద నుంచి అయిదో స్థానంలో ఉంది. వ్యాపారంపై మహిళల పాత్రకు సంబంధించి ఈ నివేదికను రూపొందించారు.          » సంస్థల్లో ఒకే పని నిర్వహించే పురుషులు, మహిళలకు సమాన వేతనాలను 64 సంస్థలు అమలు చేస్తున్నాయి. నియామకాల్లో వివక్షలేని విధానాలను 55 శాతం అనుసరిస్తున్నాయి.¤ విదేశీ మహిళలు విధులు నిర్వర్తించేందుకు ఇష్టపడే ఆసియా దేశాల్లో భారత్‌ది 7వ స్థానమని హెచ్ఎస్‌బీసీ సర్వే తెలిపింది. వాణిజ్యం, పెట్టుబడులు విస్తరించడమే దీనికి కారణం.          » ఈ జాబితాలో భారత్‌కన్నా ముందు సింగపూర్, హాంకాంగ్, దక్షిణ కొరియా, జపాన్, చైనా, మలేసియా ఉన్నాయి.
మార్చి - 13
¤ దేశంలో ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను వాడుతున్న నగరాల్లో వేగవంతమైన నెట్ స్పీడ్ లభిస్తున్న నగరంగా చెన్నై ప్రథమ స్థానంలో నిలిచింది. బెంగళూరు రెండో స్థానంలో ఉండగా, హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. నాలుగో స్థానంలో విశాఖపట్నం ఉంది.          » ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వేగాన్ని గణించే (స్పీడ్ టెస్ట్) సంస్థ ఊక్లా తాజా అధ్యయనంలో ఇది తేలింది.          » అమెరికాలోని సియాటెల్ కేంద్రంగా ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.          » అయిదు నుంచి 10 స్థానాల్లో దిల్లీ, కోల్‌కతా, థానె, ముంబయి, వడోదర, సూరత్ నగరాలున్నాయి.          » ప్రపంచ వ్యాప్తంగా ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ వేగంలో మన దేశం 67వ స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సగటు వేగం 20.72 ఎంబీపీఎస్‌గా ఉంది.          » ప్రపంచంలో అత్యధిక వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని పొందుతున్న దేశంగా సింగపూర్ ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ సగటున 161.53 ఎంబీపీఎస్‌ల వేగం ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఐస్‌ల్యాండ్, హాంకాంగ్, దక్షిణ కొరియా, రొమేనియా, స్వీడన్, హంగేరి, మకావు, అమెరికా ఉన్నాయి.¤ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా సంస్థలు గత ఆర్థిక సంవత్సరంలో అత్యధిక లాభాలు ఆర్జించిన ప్రభుత్వరంగ సంస్థలు (ఐఎస్‌యూ)గా నిలిచాయని ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది.          » ఇదే సమయంలో అధిక నష్టాలతో చెత్త పనితీరు ప్రదర్శించిన సంస్థలుగా బీఎస్ఎన్ఎల్, ఎయిర్ ఇండియా, ఎంటీఎన్ఎల్ నిలిచాయని పేర్కొంది.          » 2016-17 ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై నివేదికను ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. నిర్వహణలో ఉన్న 257 సంస్థలు ఆర్జించిన లాభాలు రూ. 1,27,602 కోట్లకు చేరాయి. 2015-16లో ఆర్జించిన 1,14,239 కోట్ల కంటే ఇది 11.7 శాతం ఎక్కువ.¤ పొగ తాగడం వల్ల సంభవిస్తున్న ప్రతి మరణం నుంచి ప్రపంచంలోని పొగాకు పరిశ్రమ 9,730 డాలర్ల (రూ.6.3 లక్షలు) వంతున లబ్ది పొందుతున్నట్లు 'టుబాకో అట్లాస్' నివేదిక వెల్లడించింది.          » ప్రధానంగా ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్య దేశాల్లో పొగాకుకు అలవాటు పడిన ప్రజల నుంచి వాటికి లాభాలు పెరుగుతున్నట్లు పేర్కొంది. అత్యధిక మరణాలకు సిగరెట్లు తాగడమే కారణంగా తెలిపింది.          » ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలతో ఏటా 2 ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ.130 లక్షల కోట్లు) ప్రజాధనానికి నష్టం వాటిల్లుతుంది.          » అమెరికన్ క్యాన్సర్ సొసైటీ (ఏసీఎస్), యూఎస్‌కు చెందిన వైటల్ స్ట్రాటజీస్ స్వచ్ఛంద సంస్థ ఈ నివేదికను రూపొందించాయి.          » 2016లో ప్రపంచవ్యాప్తంగా 71 లక్షల మంది పొగాకు వినియోగంతో మరణించారు. పొగ తాగనప్పటికీ పరోక్ష ప్రభావంతో మరణించినవారి సంఖ్య 8.84 లక్షలు.          » ప్రపంచవ్యాప్తంగా పొగతాగుతున్న జనాభా 110 కోట్లు. పొగ తాగకుండా పొగాకును వినియోగిస్తున్నవారు 36 కోట్లు.
మార్చి - 14
¤ 2018 - 19 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 7.3 శాతానికి చేరవచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. 2019 - 20లో వృద్ధి మరింత పెరిగి 7.5 శాతానికి చేరుకోవచ్చని అభిప్రాయపడింది.          » ప్రస్తుత (2017 - 18) ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధిరేటు 6.7 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేసింది. ఇండియా డెవలప్‌మెంట్ అప్‌డేట్ పేరిట విడుదల చేసిన ద్వైవార్షిక ప్రచురణలో ప్రపంచ బ్యాంక్ ఈ అంశాలను వెల్లడించింది.
మార్చి - 15
¤ 2018 - 19లో భారత వృద్ధిరేటు 7.3 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ తెలిపింది. 2019 - 20లో మరింత పుంజుకుని 7.5 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రస్తుత 2017 - 18 ఆర్థిక సంవత్సరానికి భారత్ 6.5 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది.¤ ప్రపంచంలోనే నివాసానికి అత్యంత చౌకగా ఉన్న 10 నగరాల్లో బెంగళూరు (5వ స్థానంలో), చెన్నై (8), దిల్లీ (10) ఉన్నాయని ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) సర్వే తెలిపింది.          » అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్ వరుసగా అయిదో ఏడాదీ నిలిచింది.          » 'ప్రపంచ వ్యాప్త జీవన వ్యయం 2018 సర్వే'ను సంస్థ విడుదల చేసింది.          » జీవన వ్యయం అత్యంత తక్కువగా ఉన్న నగరాల్లో సిరియా రాజధాని డెమాస్కస్ తొలి స్థానంలో ఉంది. రెండో స్థానంలో వెనెజులా రాజధాని కారకాస్, మూడో స్థానంలో కజక్‌స్థాన్ వాణిజ్య కేంద్రం అల్‌మాటి, నాలుగో స్థానంలో లాగోస్ ఉన్నాయి. 6వ స్థానంలో కరాచీ, 7వ స్థానంలో అల్జీర్స్, 9వ స్థానంలో బుకారెస్ట్ ఉన్నాయి.¤ మొత్తం 156 దేశాల వివరాలతో ఐరాస 2018 ప్రపంచ సంతోష నివేదికను విడుదల చేసింది.ముఖ్యాంశాలు భూమిపై సంతోషం వెల్లివిరుస్తున్న దేశాల్లో భారత్ 133వ స్థానంలో నిలిచింది. అత్యంత సంతోషదాయక దేశంగా ఫిన్‌లాండ్ నిలవగా తూర్పు ఆఫ్రికాలోని బురుండి ఆఖరు స్థానంలో ఉంది. ఆదాయం, ప్రజల ఆరోగ్య జీవనం, సామాజిక సామరస్యం, స్వేచ్ఛ, నమ్మకం, ఔదార్యం, తక్కువ అవినీతి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఐరాసకు చెందిన సుస్థిరాభివృద్ధి సాధన విభాగం (ఎస్‌డీఎస్ఎన్) ఈ నివేదికను రూపొందించింది. గతేడాది ఈ జాబితాలో 128వ స్థానంలో ఉన్న భారత్ 0.698 పాయింట్లు తగ్గి ఈ ఏడాది మరింత దిగువకు పడిపోయింది. మార్చి 20న అంతర్జాతీయ సంతోష దినోత్సవం సందర్భంగా ఈ నివేదికను విడుదల చేయనుంది.నివేదికలోని మొదటి 10 దేశాలు: - ఫిన్‌లాండ్, నార్వే, డెన్మార్క్, ఐస్‌లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, కెనడా, న్యూజిలాండ్, స్వీడన్, ఆస్ట్రేలియా.నివేదికలోని చిట్టచివరి 10 దేశాలు: బురుండి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, దక్షిణ సుడాన్, టాంజానియా, యెమెన్, రువాండా, సిరియా, లైబీరియా, హైతి, మాల్విప్రముఖ దేశాల స్థానాలు: జర్మనీ (15), అమెరికా (18), యూకే (19), ఫ్రాన్స్ (23), సౌదీ అరేబియా (33), జపాన్ (54), దక్షిణ కొరియా (57), రష్యా (59), దక్షిణాఫ్రికా (105)భారత పొరుగు దేశాల ర్యాంకులు: పాకిస్థాన్ (75), చైనా (86), భూటాన్ (97), నేపాల్ (101), బంగ్లాదేశ్ (115), శ్రీలంక (116), అఫ్గానిస్థాన్ (145)
మార్చి - 16
¤ న్యూయార్క్ స్టేట్ విశ్వవిద్యాలయం పరిశోధకులు మంచినీటి సీసా (బాటిల్)ల్లోని నీటి సురక్షితత్వంపై అధ్యయనం నిర్వహించారు.          » భారత్, అమెరికా, బ్రెజిల్, చైనా, ఇండోనేషియా సహా మొత్తం 9 దేశాల్లో 11 సంస్థలకు చెందిన నమూనాలను వీరు విశ్లేషించారు.          » 93 శాతం మంచినీటి సీసా నమూనాల్లో ప్లాస్టిక్ సూక్ష్మ రేణువులుంటున్నట్లు వెల్లడైంది. ప్లాస్టిక్ మూతల తయారీకి ఉపయోగించే 'పాలీ ప్రొపైలీన్' సీసాల్లోని మంచినీటిలో ఎక్కువగా కనిపిస్తున్న మూలకమని పరిశోధకులు తెలిపారు. సీసాల్లో గుర్తించిన మొత్తం ప్లాస్టిక్ రేణువుల్లో 54 శాతం 'పాలీ ప్రొపైలీన్‌'లేనని స్పష్టం చేశారు. రెండో స్థానంలో నైలాన్ (16 శాతం) ఉందని తెలిపారు. పాలీఇథిలీన్ టెరెఫ్తలేట్ (పీఈటీ) కణాలూ తాగునీటిలో ఉంటున్నాయని పేర్కొన్నారు.          » సగటున లీటరు నీటికి 10.4 సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు కలుస్తున్నట్లు వెల్లడించారు.
మార్చి - 17
¤ ఐరాసకి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ 'ఎఫ్ఏఓ' ప్రకృతి విపత్తులు - వాటి ఫలితాలకు సంబంధించి ఓ నివేదికను రూపొందించింది.ముఖ్యాంశాలు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడుతున్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ప్రకృతి విపత్తులు, మానవ కారక విధ్వంసాల కారణంగా రైతుల కష్టం వృథా అవుతుంది. ఈ విపత్తులు ఏటేటా పెరిగిపోతున్నాయే కానీ ఏ మాత్రం తగ్గడం లేదు. 2005 - 15 దశాబ్దకాలంలో ప్రకృతి విపత్తుల వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే రూ.6,43,200 కోట్ల (96 బిలియన్ డాలర్లు) మేర రైతుల కష్టార్జితం నష్టపోయినట్లు నివేదిక వెల్లడించింది. రైతులకు ప్రధాన శత్రువు కరవు కాటకాలే. ఆ తర్వాత స్థానంలో వరదలు, తుపాన్లు, పంట తెగుళ్లు, పశువ్యాధులు, కార్చిచ్చులు, విష రసాయన వ్యర్థాలు లాంటివి ఉన్నాయని ఎఫ్ఏవో నివేదిక వెల్లడించింది. కరవుల వల్లే రూ.1.94 లక్షల కోట్ల (29 బిలియన్ డాలర్ల) మేర రైతులకు నష్టం వాటిల్లింది. వాతావరణ మార్పుల దుష్ప్రభావం పంటలు పండించే రైతులతోపాటు పశుపోషణ, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమ, అటవీ ఉత్పత్తులు సేకరించేవారి పైనా తీవ్రంగా ఉంటోంది. ముఖ్యంగా ఆసియా దేశాల్లోని వ్యవసాయదారుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. విపత్తుల వల్ల కలిగే నష్టాల్లో సగభాగం అంటే రూ.3.21 లక్షల కోట్లు (48 బిలియన్ డాలర్లు) ఈ ఖండంలోని దేశాలదే. ఆసియా దేశాల అన్నదాతలు కరవు కాటకాలతో పాటు వరదలు, సునామీలు, భూకంపాలు, ఉష్ణోగ్రతల్లో తీవ్ర వ్యత్యాసాల వల్ల నష్టపోతున్నారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాల్లోనూ కరవే ప్రధాన శత్రువు. ఇక్కడ పంట నష్టాలు, పశు గణాభివృద్ధి వల్ల కలిగిన నష్టం రూ.1,38,600 కోట్లు (23.7 బిలియన్ డాలర్లు). కేవలం పశువులకు వచ్చే వ్యాధులు, పంట తెగుళ్ల వల్లే ఆఫ్రికా దేశాలు రూ.40,200 కోట్లు నష్టపోయాయి. చిన్నచిన్న దీవుల సముదాయలతో కూడిన దేశాలు తరచూ ప్రకృతి విపత్తుల తాకిడికి గురవుతాయి. సునామీలు, వరదలు, భూకంపాలు, తుపాన్ల వల్ల ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు 2000 - 07 మధ్య రూ.58,960 కోట్లు, 2008 - 15 మధ్య రూ.93,800 కోట్ల విలువైన సంపదను కోల్పోయాయి. ప్రపంచంలో 250 కోట్ల మందికి వ్యవసాయమే జీవనోపాధి మార్గం.విపత్తు 2005 - 15లో నష్టం (రూ.కోట్లలో)కరవులు 1,94,300తుపాన్లు/ వర్షభావం 1,77,550వరదలు 1,27,300భూకంపాలు/ కొండచరియలు 70,350వ్యాధులు/ తెగుళ్లు 63,650కార్చిచ్చులు 6,700ఖండాలవారీగా నష్టం:ప్రాంతం నష్టం (రూ. కోట్లలో)ఆసియా 3,21,600ఆఫ్రికా 1,74,200లాటిన్ అమెరికా/ కరేబియన్ 1,47,400
మార్చి - 18
¤ దేశంలో బాలలపై హింస తీవ్రతరమవుతుందని ఎన్‌సీఆర్‌బీ తాజా నివేదికలో వెల్లడైంది.          » 2015లో దేశవ్యాప్తంగా 94,172 కేసులు నమెదు కాగా, 2016లో ఈ సంఖ్య 1,06,958కు చేరింది. బాలలపై జరుగుతున్న నేరాలు 11 శాతానికి పైగా పెరిగాయి.          » గత దశాబ్ద కాలంలో బాలలపై నేరాలు 500 శాతం మేర పెరిగాయని (2006లో 18,967 నుంచి 2016లో 1,06,958కు) స్వచ్ఛంద సంస్థ క్రై - 'చైల్డ్ రైట్స్ అండ్ యు' పేర్కొంది.          » ఎన్‌సీఆర్‌బీ తాజా సమాచారం ప్రకారం బాలలపై 50 శాతానికి పైగా నేరాలు యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, దిల్లీ, పశ్చిమ్ బంగాల్లోనే నమోదయ్యాయి. వీటిలో 15 శాతం నేరాలతో ఉత్తర్‌ప్రదేశ్ మొదటి స్థానంలో, 14, 13 శాతాలతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.          » చిన్నారులపై నేరాల్లో అపహరణ కేసులే ఎక్కువగా ఉన్నాయి. 2016లో నమోదైన మొత్తం కేసుల్లో వీటి వాటా 48.9 శాతం (52,253) వరకూ ఉంది.          » అపహరణల తర్వాతి స్థానంలో అత్యాచారాలున్నాయి. వీటి వాటా 18 శాతం. మరోవైపు పోక్సో చట్టం కింద నమోదైన కేసులు 33 శాతం వరకూ ఉన్నాయి. (లైంగిక దాడులు, వేధింపులు, అశ్లీల దృశ్యాల చిత్రీకరణ తదితర నేరాలను పోక్సో కింద నమోదు చేస్తారు.)          » 2016లో దేశవ్యాప్తంగా ఆచూకీ గల్లంతైన చిన్నారుల సంఖ్య 1,11,569. (వీరిలో 41,175 మంది బాలురు, 70,394 మంది బాలికలు) ఈ కేసుల్లో పశ్చిమ్ బంగా (15.1శాతం) మొదటి స్థానంలో ఉంది.
మార్చి - 21
¤ దేశవ్యాప్తంగా మహిళలు, పురుషుల స్థితిగతులపై కేంద్ర ప్రభుత్వం వివిధ సంస్థలు, మార్గాల్లో జరిపే అధ్యయనాలను క్రోడీకరించి 2016కు సంబంధించి కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ నివేదిక 2017ను తాజాగా విడుదల చేసింది. అనేక అంశాల్లో రెండు వర్గాలను పోలుస్తూ నివేదికను రూపొందించింది.ముఖ్యాంశాలు దేశంలో 2015తో పోలిస్తే 2016లో అత్యాచారాలు 12 శాతం పెరిగాయి. అన్ని నేరాల్లోకెల్లా అత్యాచారాల పెరుగుదల శాతం అధికంగా ఉంది. మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించి నమోదైన నేరాల్లో భర్త, బంధువులు చేస్తున్నవే అత్యధికంగా 33 శాతమున్నాయి. మొత్తం మహిళలపై నేరాల్లో భార్యపై భర్త దాడి చేసినట్లు నమోదైన వాటిని శాతాల ఆధారంగా చూస్తే తెలంగాణ 5, ఏపీ 7వ స్థానంలో ఉన్నాయి. ఈ తరహా నేరాలు అత్యధికంగా అసోంలో 58.7, పశ్చిమ్‌బంగాలో 42.3 చోటు చేసుకున్నాయి. తెలంగాణలో 39.2, ఏపీలో 25.1 శాతం జరిగాయి. మొత్తం మీద 3.38 లక్షల నేరాలు నమోదవగా 3% వరకట్నం నిరోధక చట్టం కింద ఉన్నాయి. మొత్తం కేసుల్లో 67 శాతమే విచారించి పరిష్కరించారు. మొత్తం కేసుల్లో కోర్టులో విచారణ ప్రారంభమైనవి 2.60 లక్షలుంటే వీటిలో కేవలం 1.7 శాతానికే శిక్షలు పడ్డాయి. అత్యాచారం కేసుల్లో 3.1 శాతం నిందితులకు శిక్షలు పడ్డాయి. వరకట్నం కోసం జరిగిన హత్యల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. దేశంలో ఆత్మహత్య చేసుకుంటున్న మహిళల్లో గృహిణులు అధికంగా 53, విద్యార్థినులు 10, రోజువారీ కూలీలు 8, స్వయం ఉపాధి పొందుతున్నవారు 5, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు ఒక శాతమున్నారు. ఆత్మహత్య చేసుకుంటున్న పురుషుల్లో స్వయం ఉపాధి పొందేవారు 25, రోజువారీ కూలీలు 22, రైతులు 13, ఉద్యోగులు 10, నిరుద్యోగులు 10, వ్యాపారులు 9, విద్యార్థులు 5, ఇతరులు 26 శాతమున్నారు. దేశంలో 2016 మార్చి నాటికి వాణిజ్య బ్యాంకుల డిపాజిట్లలో 32 శాతం మహిళల పేరుతోనే ఉన్నాయి. బ్యాంకు ఉద్యోగుల్లో జాతీయ స్థాయిలో సగటున 22 శాతం మహిళలే ఉన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రకాల వ్యాపార సంస్థల్లో గ్రామీణంలో 24 శాతం మహిళలవి కాగా, పట్టణాల్లో 19 శాతమే. అన్ని రాష్ట్రాల్లోకెల్లా అత్యధికంగా మణిపూర్ గ్రామాల్లో 82, పట్టణాల్లో 77 శాతం వ్యాపార సంస్థలు మహిళల ఆధీనంలో ఉన్నాయి. కుటుంబ నియంత్రణ పాటిస్తున్న మహిళల జాతీయ సగటు 53.5 శాతముండగా అత్యధికంగా పంజాబ్‌లో 75.8 శాతమున్నారు.¤ దక్షిణ, మధ్య భారత్, కొన్ని ఇరుగు పొరుగు దేశాల్లోనూ సుమారు 22 కోట్ల మంది ప్రజలు మాట్లాడే ద్రవిడ భాషల కుటుంబం ఎప్పుడో 4500 సంవత్సరాల క్రితం మనుగడలోకి వచ్చింది. వీరంతా కూడా 80 రకాల ద్రవిడ భాషల (వ్యవహారికంతో కూడా కలిపి)ను మాట్లాడుతున్నట్లు జర్మనీలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్, డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలకు చెందిన పరిశోధకుల సుదీర్ఘ అధ్యయనంలో వెల్లడైంది.          » దక్షిణ భారతావనిలో అత్యధికులు మాట్లాడే భాషలైన కన్నడ, మలయాళం, తమిళం, తెలుగుల్లో తమిళంను అత్యంత ప్రాచీనమైందిగా పరిశోధకులు పేర్కొన్నారు.
మార్చి - 24
¤ ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్యశాఖ 'టీబీ ఇండియా -2018', 'నేషనల్ డ్రగ్ రెసిస్టెన్స్ సర్వే రిపోర్ట్' అనే రెండు నివేదికలను వెలువరించింది.ముఖ్యాంశాలు: ఇతర దేశాల కంటే ఎక్కువగా భారత్‌లో ఏటా కొత్తగా క్షయరోగుల సంఖ్య నమోదవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో భారత్ వాటా 27 శాతం. దేశంలో ఏటా 27.9 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. 2016లో సవరించిన జాతీయ టీబీ నియంత్రణ కార్యక్రమం (ఆర్ఎన్‌టీసీపీ)లో ఈ సంఖ్య 19.4 లక్షలు. ఎండీఆర్ - టీబీ రోగుల్లో ఫ్లోరోక్వినోలోన్ నిరోధకత ఎక్కువగా ఉంది. ఎండీఆర్ - టీబీ రోగుల్లో చికిత్స విజయాల రేటు దాదాపు 46 శాతం, మరణాల రేటు 20 శాతంగా ఉంది. ప్రపంచస్థాయిలో చికిత్స విజయాల రేటు 52 శాతం, మరణాల రేటు 17 శాతంగా ఉంది. భారత్‌లో మొత్తం టీబీ రోగుల్లో ఎండీఆర్ - టీబీ వాటా 6.9 శాతం. ఎండీఆర్ - టీబీ రోగుల్లో చికిత్స వైఫల్యం, మరణాల రేట్లు ఎక్కువగా ఉండటానికి ఫ్లోరోక్వినోలోన్ నిరోధకతే కారణం.¤ బ్రిటన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రిమినల్ పాలసీ రిసెర్చ్ (ఐసీపీఆర్) వెల్లడించిన గణాంకాల ప్రకారం భారత్‌లో ప్రతి లక్ష మంది జనాభాకు 33 మంది నేరగాళ్లు మాత్రమే ఉన్నారు.          » ఈ సంఖ్య అమెరికాలో ప్రతి లక్ష మంది జనాభాకు 666 మందిగా ఉండటం గమనార్హం. సుమారు 21.5 లక్షల మంది ఆ దేశంలో కారాగార ఊచలు లెక్కిస్తున్నారు.          » ప్రతి లక్ష జనాభాకు 410 మంది నేరస్తులతో రష్యా రెండోస్థానంలో ఉంది.          » పొరుగు దేశాలైన చైనా (118), శ్రీలంక (78), నేపాల్ (65), పాకిస్థాన్ (44)తో పోల్చుకున్నప్పటికీ మనదేశంలో నేరాల సంఖ్య తక్కువగా ఉంది.          » కిక్కిరిసిన జైళ్లలో 454% ఆక్యుపెన్సీలతో హైతీ అగ్రస్థానంలో ఉంది. ఈ విషయంలో భారత్ ప్రపంచంలోని 205 దేశాల్లో 86వ స్థానంలో ఉంది. భారతదేశ జైళ్లలో 100 మంది ఖైదీలను ఉంచాల్సిన చోట 114 మందిని నిర్భంధిస్తున్నారు. అమెరికాలో ఇది 104 శాతంగా ఉంది.
మార్చి - 25
¤ కేంద్ర హోం మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల పరిధిలో 106 వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలున్నాయి. వాటిలో 2017లో మొత్తం వామపక్ష తీవ్రవాద హింసకు సంబంధించి 908 ఘటనలు జరగ్గా 804 ఘటనలు (88.5 శాతం) 35 జిల్లాల పరిధిలోనే చోటుచేసుకున్నాయి. అందులో 24 జిల్లాలు ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనివి కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం జిల్లా ఈ జాబితాలో ఉంది.          » ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలు చెరో 8 ఉన్నప్పటికీ, విశాఖపట్నం, ఖమ్మం జిల్లాల పరిధిలో మాత్రమే తీవ్రత అధికంగా ఉంది.          » చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో అత్యధికంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకొన్నాయి. ఆ రాష్ట్రంలోని 8 జిల్లాల పరిధిలో మొత్తంగా 356 ఘటనలు నమోదయ్యాయి. ఇందులో 44.27 శాతం హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.          » ఝార్ఖండ్‌లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల జాబితాలో 21 జిల్లాలున్నాయి. అందులో 16 జిల్లాల్లో 242 హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.          » దేశంలో అత్యధికంగా హింస చోటుచేసుకున్న 35 జిల్లాల్లో నమోదైన ఘటనల్లో 74.36 శాతం ఘటనలు చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగినవే.          » మధ్యప్రదేశ్, పశ్చిమ్ బంగా, ఉత్తర్ ప్రదేశ్‌లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలు ఎనిమిది ఉండగా, ఆ రాష్ట్రాల పరిధిలో ఒక్క హింసాత్మక ఘటన కూడా చోటు చేసుకోలేదు.          » మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఒడిశాలోని కొరపుట్, మల్కన్‌గిరి జిల్లాల్లో, బిహార్‌లోని ఔరంగాబాద్, గయా, జమై, ముజఫర్‌పూర్, బంక, నవద జిల్లాల్లో కూడా హింస అధికంగా చోటుచేసుకుంది.
మార్చి - 30
¤ జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) 2016కు సంబంధించి విడదల చేసిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 972 మంది గిరిజన మహిళలు అత్యాచారానికి గురైనట్లు వెల్లడించారు. ఈ విషయంలో తెలంగాణ - 41 ఘటనలతో ఏడోస్థానం, ఆంధ్రప్రదేశ్ - 29 ఘటనలతో తొమ్మిదో స్థానంలో ఉండటం గమనార్హం.          » గిరిజన మహిళలపై లైంగిక దాడుల్లో మధ్యప్రదేశ్ తొలిస్థానంలో ఉంది. 29 రాష్ట్రాల్లో మొత్తం 972 దుర్ఘటనలు వెలుగుచూడగా ఒక్క మధ్యప్రదేశ్‌లోనే 377 చోటుచేసుకున్నాయి. చత్తీస్‌గఢ్ - 157, ఒడిశా - 91, మహారాష్ట్ర - 85, రాజస్థాన్ - 71, కేరళ - 47, గుజరాత్, తెలంగాణ - 34, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక - 19 ఘటనలతో తొలి పది స్థానాల్లో ఉన్నాయి.          » గిరిజన మహిళల గౌరవానికి భంగం కలిగించడంలో తెలంగాణ అగ్రస్థానంలో, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండటం ఆందోళనకరం.          » సామాజిక మాధ్యమాల్లో లేదా ప్రత్యక్షంగా మహిళల్ని వేధించే విషయంలో మధ్యప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లు ముందు వరసలో ఉన్నాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.