Type Here to Get Search Results !

మార్చి-2018 వ్యక్తులు

మార్చి - 1
¤ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (ఎఫ్ ట్యాప్సీ) సెక్రటరీ జనరల్‌గా సంజయ్ కపూర్ ఎంపికయ్యారు. మార్చి 1 నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చినట్లు ఎఫ్‌ట్యాప్సీ అధ్యక్షుడు గౌర శ్రీనివాస్ ప్రకటించారు.
¤ తమిళనాడులోని కంచి కామకోటి పీఠం 70వ పీఠాధిపతిగా శంకర విజయేంద్ర సరస్వతి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆయన మఠం ఉత్తరాధికారిగా కొనసాగారు. పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గురువు జయేంద్ర సరస్వతి బృందావన ప్రవేశ కార్యక్రమాన్ని (అంత్యక్రియలు) నిర్వహించారు
.
        » విజయేంద్రను అప్పటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి 1983, మే 29న శంకర మఠానికి పరంపర వారసుడిగా ప్రకటించి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతిగా నామకరణం చేశారు
.
మార్చి - 2
¤ క్యాన్సర్ చికిత్సలో పరిశోధనకు భారతీయ, అమెరికన్ శాస్త్రవేత్త నవీన్ వరదరాజన్‌కు రూ. 7.65 కోట్ల గ్రాంటును క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్సాస్ (పీపీఆర్ఐటీ) మంజూరు చేసింది. అతడు యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్‌లో కెమికల్, బయోమాలిక్యులర్ ఇంజినీరింగ్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.
మార్చి - 4
¤ పాకిస్థాన్‌లో ప్రపథమంగా ఓ హిందూ దళిత మహిళ సెనేటర్‌గా ఎన్నికయ్యారు.        » సింధ్ ప్రావిన్స్‌కు చెందిన కృష్ణ కుమారి కోహ్లీ (39) అనే మహిళ బిలావల్ భుట్టో జర్దారీ సారథ్యంలోని 'పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ' (పీపీపీ) ప్రతినిధిగా పాక్ సెనేట్‌కు ఎన్నికయ్యారు.        » మైనారిటీలకు ప్రత్యేకించిన సింధ్ స్థానం నుంచి ఈమె ఎన్నికయ్యారు.        » కృష్ణకుమారి సింధ్ ప్రావిన్స్‌లోని మారుమూల జిల్లా అయిన థార్‌లో న‌గ‌ర్‌ప‌ర్క‌ర్‌ అనే కుగ్రామానికి చెందినవారు. సింధ్ విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. సామాజిక కార్యకర్తగా పీపీపీలో చేరారు. నిరుపేద వర్గాల హక్కుల కోసం ఆమె అనితరసాధ్యమైన పోరాటాలు చేశారు.¤ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పశ్చిమ్‌బంగాలో షిబ్‌పూర్‌లోని 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఈఎస్‌టీ)' డి.లిట్‌ను ప్రదానం చేసింది.
మార్చి - 5
¤ అంతర్జాతీయ ఉక్కు దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్అధ్యక్షుడిగా (ప్రెసిడెంట్ఆదిత్య మిట్టల్నియమితులయ్యారుప్రస్తుతం ఆర్సెలర్ మిట్టల్ యూరప్విభాగానికి సీఎఫ్ఓసీఈవోగా ఉన్న ఆదిత్యకు తాజాగాప్రెసిడెంట్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.        » ఆదిత్య ఆర్సెలర్ మిట్టల్ ఛైర్మన్సీఈఓ లక్ష్మీనివాస్ మిట్టల్ కుమారుడు.        » ఆర్సెలర్ మిట్టల్ ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో కార్యకలాపాలునిర్వహిస్తోంది.
మార్చి - 6
¤ దేశంలో సామాజిక మాధ్యమంలో ఎక్కువ మంది అనుసరిస్తున్న నేతల్లో ప్రధాని నరేంద్ర మోదీ తర్వాతి స్థానంలో భాజపా అధ్యక్షుడు అమిత్ షా నిలిచారు.        » ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆయనకు 2 కోట్ల మందికి పైగా అనుచరులు ఉన్నారు.¤ ఫోర్బ్స్ పత్రిక '2018 వరల్డ్ బిలియనీర్స్' జాబితాను విడుదల చేసింది.ముఖ్యాంశాలు: ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఈఓ) జెఫ్ బెజోస్ తొలిసారి అగ్రస్థానంలో నిలిచారు. బెజోస్ సంపద 112 బిలియన్ డాలర్ల (సుమారు రూ.7.28 లక్షల కోట్లు)కు చేరుకుందని ఫోర్బ్స్ వెల్లడించింది. 2017 సంపదతో పోలిస్తే, 39.2 బిలియన్ డాలర్ల మేర పెరగడంతో తాజా జాబితాలో బెజోస్ అగ్రస్థానానికి చేరుకున్నారు. గత 24 సంవత్సరాల్లో 18 ఏళ్ల పాటు అగ్రస్థానంలో ఉన్న మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిట్‌గేట్స్ రెండో స్థానానికి పడిపోయారు. ఈ ఏడాది జాబితాలోని కుబేరుల సంపద మొత్తం విలువ 9.1 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ. 591.5 లక్షల కోట్లు)కు చేరింది. 2017లో ఈ మొత్తం 7.7 లక్షల కోట్ల డాలర్లు. ప్రపంచ కుబేరుల సగటు సంపద మొత్తం 4.1 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ పేర్కొంది. 2018 ఫోర్బ్స్ జాబితాలో భారతీయులు 119 మంది చోటు సాధించారు. ఇందులో 18 మంది కొత్తవారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేష్ అంబానీ 40.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 2.60 లక్షల కోట్లు) సంపదతో మొత్తం జాబితాలో 19వ స్థానంలో, దేశీయంగా అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన తర్వాతి స్థానాల్లో అజీమ్ ప్రేమ్‌జీ (18.8 బిలియన్ డాలర్లు, 58వ స్థానం), లక్ష్మీమిత్తల్ (16.5 బిలియన్ డాలర్లు, 62వ స్థానం), శివ్ నాడార్ (14.6 బిలియన్ డాలర్లు, 98వ స్థానం), దిలీప్ సంఘ్వి (12.8 బి.డా, 115వ స్థానం) ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 3.1 బిలియన్ డాలర్ల సంపదతో 766వ స్థానం పొందారు. 2017లో ఈయన స్థానం 544. తెలుగువారిలో అరబిందో ఫార్మా సహ వ్యవస్థాపకుడు పీవీ రామ్ ప్రసాద్ రెడ్డి 2.5 బి.డాలర్లతో 965వ స్థానంలో, దివీస్ ఛైర్మన్ దివి మురళి 2.3 బిలియన్ డాలర్లతో 1070వ స్థానంలో నిలిచారు. 2018 ఫిబ్రవరి 9 నాటి స్టాక్ విలువలు, ఎక్ఛ్సేంజ్ రేట్ల ఆధారంగా ఈ జాబితా రూపొందించినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. మొత్తం 2,208 మంది ఈ జాబితాలో ఉన్నారు.
మార్చి - 10
¤ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యదర్శిగా సురేష్ భయ్యాజీ జోషి మరోసారి ఎన్నికయ్యారు.        » నాగ్‌పూర్‌లో జరిగిన సంఘ్ సమావేశంలో ఆయన మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆర్ఎస్ఎస్ ప్రచార్ ప్రముఖ్ మన్మోహన్ వైద్య తెలిపారు.        » 2009 నుంచి ప్రధాన కార్యదర్శిగా ఉన్న భయ్యాజీ జోషీ తాజా ఎన్నికతో 2021 వరకు పదవిలో కొనసాగనున్నారు.
మార్చి - 12
¤ పాకిస్థాన్ సెనేటర్‌గా బాధ్యతలు స్వీకరించిన కృష్ణకుమారి కోహ్లీ (39) ఆ పదవిని చేపట్టిన తొలి హిందూ దళిత మహిళగా ఘనతను సాధించారు.        » పాక్ ఎగువ సభలో ఆమెతో సహా 51 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
మార్చి - 13
¤ దేశంలోనే సంపన్న ఎంపీగా జయబచ్చన్ నిలవనున్నారు.        » ప్రముఖ నటి, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన జయా బచ్చన్ యూపీ నుంచి రాజ్యసభకు పోటీచేస్తున్న సందర్భంగా తాజాగా ప్రమాణ పత్రంలో రూ. వెయ్యి కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు.        » ఇంతవరకు అత్యంత సంపన్న ఎంపీగా భాజపాకు చెందిన రవీంద్ర కిశోర్ సిన్హా గుర్తింపు పొందారు. 2014లో ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యే నాటికి తన ఆస్తుల విలువ రూ. 800 కోట్లుగా వెల్లడించారు.        » 2012లో రూ.493 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించిన జయ 2018లో తనకు, తన భర్త అమితాబ్ బచ్చన్‌కు కలిపి రూ.460 కోట్ల స్థిరాస్తులు, రూ.540 కోట్ల చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు.
మార్చి - 15
¤ తమిళనాడు రాజకీయ రాజధాని మదురైలో మరో పార్టీ ఆవిర్భవించింది. శశికళ మేనల్లుడు, ఆర్కేనగర్ స్వతంత్ర ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ 'అమ్మ మక్కల్ మున్నేట్ర కజగమ్ (ఏఎంఎంకే)' పేరుతో సొంత పార్టీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జయలలిత చిత్రంతో కూడిన పార్టీ జెండాను ఆవిష్కరించారు.
మార్చి - 16
¤ విద్యాసంస్థలు స్థాపించి వేలాది మందికి ఉచితంగా విద్య, వసతి సౌకర్యాలు కల్పిస్తున్న ఒడిశాకు చెందిన విద్యావేత్త, సామాజిక కార్యకర్త అచ్యుత సామంత బీజేడీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు.        » తద్వారా ఒడిశా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యులందరిలోకి పేద ఎంపీగా నిలిచారు. ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన పేరు మీద సొంత ఆస్తి పాస్తులు లేవు. బ్యాంకు ఖాతాలో రూ. 3.6 లక్షల నగదు, ఊరిలో రూ. 84 వేల విలువైన వారసత్వ ఆస్తి ఉంది.        » ఒడిశాలో కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కేఐఐటీ), కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (కేఐఎస్ఎస్) విద్యాసంస్థల ద్వారా ఒకటో తరగతి నుంచి పీజీ వరకూ ఉచిత విద్య, భోజన వసతి కల్పిస్తున్నారు.¤ 2018-19 ఆర్థిక సంవత్సరానికి భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), తెలంగాణ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లను ఎన్నుకుంది.        » సంజయ్‌సింగ్ ఛైర్మన్‌గా, డి.రాజు వైస్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.        » సంజయ్‌సింగ్ 2017-18కి వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు.
మార్చి - 21
¤ఎంబీబీఎస్ చదువుతూ రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన 24 ఏళ్ల షహనాజ్ ఖాన్ చరిత్ర సృష్టించింది.        » భరత్‌పూర్ జిల్లాలోని మియో ముస్లింల ఆధిక్యం ఉన్న ప్రాంతంలోని కమాన్ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో సర్పంచ్‌గా ఎంపికైంది.        » ఈమె మరో రికార్డును కూడా అందుకున్నారు. తమ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన నాలుగోతరం వ్యక్తిగా కూడా గుర్తింపు సాధించారు.
మార్చి - 22
¤ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ జేడీ, మహారాష్ట్ర అదనపు డైరెక్టర్ ఆఫ్ జనరల్ (ఏడీజీపీ) వి.వి. లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈయన సర్వీసు మరో ఏడేళ్లు ఉన్నపటికీ ఈ ముందస్తు నిర్ణయంతో వార్తల్లో నిలిచారు.        » జగన్ అక్రమాస్తుల కేసులు, ఓబుళాపురం మైనింగ్ కుంభకోణం, ఎమ్మార్ ప్రాపర్టీస్ లాంటి సంచలనాత్మకమైన కేసులు ఈయన దర్యాప్తు చేశారు.¤ 'సమాచార దుర్వినియోగం' ఆరోపణలు ఎదుర్కొంటున్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకెర్ బర్గ్ క్షమాపణలు చెప్పారు. పొరపాటు జరిగిందని ఆయన అంగీకరించారు. రెండు వందల కోట్ల మంది ఖాతాదారుల వ్యక్తిగత వివరాల భద్రతకు తాము పటిష్ఠ చర్యలు తీసుకుంటామని చెప్పారు.        » అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కోసం పనిచేసిన బ్రిటన్ సంస్థ 'కేంబ్రిడ్జ్ అనలిటికా' ఐదు కోట్ల మంది ఫేస్‌బుక్ ఖాతాదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ వివాదంపై జుకెర్ బర్గ్ తొలిసారిగా స్పందించి క్షమాపణలు తెలిపారు.¤ వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులర్ విలీన ప్రక్రియ తుది అంకానికి చేరింది. ఈ నేపథ్యంలోనే విలీన సంస్థకు నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కుమార మంగళం బిర్లా వ్యవహరిస్తారని ఐడియా సెల్యులర్, వొడాఫోన్ గ్రూప్ ప్రకటించాయి.        » విలీన సంస్థ సీఈఓగా బాలేష్ శర్మ ఉంటారు. ఈయన ప్రస్తుతం వొడాఫోన్ ఇండియా ముఖ్య కార్యనిర్వాహక అధికారి (సీఓఓ)గా ఉన్నారు.
మార్చి - 23
¤ లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే దిల్లీలో నిరవధిక నిరాహార దీక్షను మొదలుపెట్టారు.        » దిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఆయన దీక్ష మొదలైంది.        » 2011లో ఇక్కడి నుంచే ఆయన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం గమనార్హం.        » కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తలను ఏర్పాటు చేయాలంటూ హజారే ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.        » వ్యవసాయరంగ సమస్యలకు పరిష్కారాలను సూచించిన స్వామినాథన్ కమిషన్ నివేదికను అమలు చేయాలన్నది కూడా అన్నాహజారే డిమాండ్‌గా ఉంది.¤ కేంద్ర సాహిత్య అకాడమీ ఏర్పాటు చేసిన తెలుగు సలహామండలిలో ప్రముఖ కవి యాకూబ్‌కు స్థానం కల్పించారు.        » 2018 నుంచి 2022 వరకు సలహామండలిలో ఆయన సభ్యుడిగా కొనసాగుతారు.        » సాహిత్య అకాడమీ తెలుగుకు సంబంధించి నిర్వహించనున్న కార్యక్రమాలు, ప్రచురణల విషయంలో ఆయన సలహాలు తీసుకుంటారు.¤ యూకేలో నివసిస్తున్న బ్రిటిష్ ఆసియన్లలో వరుసగా అయిదో ఏడాది కూడా హిందూజా కుటుంబం అత్యధిక సంపన్న వ్యాపార కుటుంబంగా నిలిచింది.        » లండన్ ప్రధాన కేంద్రంగా అయిదు ఖండాల్లో విస్తరించిన వీరి వ్యాపార సామ్రాజ్యం విలువ సుమారు రూ. 2,02,250 కోట్లు అని 'ఆసియన్' మీడియా గ్రూప్ ఏటా విడుదల చేసే ఆసియన్ సంపన్నుల జాబితాలో వెల్లడించింది.        » హిందూజా సోదరులైన శ్రీచంద్, గోపీచంద్, ప్రకాశ్‌చంద్, అశోక్‌చంద్‌ల ఆస్తులు 2017లో సుమారు రూ. 27,577 కోట్లు పెరిగినట్లు తెలిపింది.        » హిందూజాల తర్వాత భారతీయ స్టీల్ దిగ్గజం లక్ష్మీనివాస్ మిట్టల్ రూ.1,28,704 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తులు రూ. 12,870 కోట్లు పెరిగాయి.        » ఇండోరమా కార్పొరేషన్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ శ్రీ ప్రకాష్ లోహియా రూ. 46,885 కోట్లతో తరువాతి స్థానంలో నిలిచారు.        » యూకేలో ఉంటున్న 101 మంది దక్షిణాసియా సంతతి మిలియనీర్లు మొత్తం రూ. 7,35,456 కోట్ల విలువైన ఆస్తిపాస్తులు కలిగి ఉన్నారు. ఇందులో మొదటి పదిమంది ఆస్తులు రూ. 4,98,731 కోట్లు. మొత్తం ఆస్తిపాస్తుల్లో ఇది 68%.
మార్చి - 24
¤ దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగో కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు 14 ఏళ్ల జైలు శిక్ష, రూ. 60 లక్షల జరిమానా విధిస్తూ రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది.        » ఈ కుంభకోణానికి సంబంధించిన కేసుల్లో లాలూకు పడిన శిక్షల్లో ఇదే అత్యంత తీవ్రమైనది కావడం గమనార్హం.        » 1990లలో అవిభాజ్య బిహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా లాలూ వ్యవహరించిన సమయంలో ఈ దాణా కుంభకోణం చోటు చేసుకుంది.
మార్చి - 26
¤ భారత్ - శ్రీలంక మధ్యనున్న పాక్ జలసంధి (30 కిలోమీటర్లు)ని 8.25 గంటల్లో ఈది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తులసి చైతన్య (30) సరికొత్త రికార్డు సృష్టించారు.        » గతంలో భారత్‌కు చెందిన 10 మంది, శ్రీలంకకు చెందిన ఇద్దరు పాక్ జలసంధిని ఈదారు. 1994లో తమిళనాడుకు చెందిన 12 ఏళ్ల కుట్రాలీశ్వరన్ 12 గంటల వ్యవధిలో ఈది అత్యుత్తమ రికార్డు నెలకొల్పగా దాన్ని తాజాగా చైతన్య అధిగమించారు.        » తులసి చైతన్య విజయవాడ నగర పోలీసు కమిషనరేట్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.
మార్చి - 27
¤ మహారాష్ట్రలోని కరవు పీడిత ప్రాంతాల కోసం తాను ప్రారంభించిన 'శ్రమదాన్' ఉద్యమంలో చేరాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమీర్‌ఖాన్ ప్రజలను ఫేస్‌బుక్ ద్వారా అభ్యర్థించారు.¤ ఫోర్బ్స్ ఆసియా ప్రతిభావంతుల జాబితాలో స్టార్ షట్లర్ సింధు, భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధానాకు చోటు లభించింది.        » ఆసియాలో వివిధ రంగాల్లో తమ ముద్రవేసిన 30 ఏళ్ల లోపు యువత విభాగంలో ఫోర్బ్స్ 30 మందితో ఈ జాబితా ప్రకటించింది.        » వినోదం, క్రీడల విభాగంలో భారత్ నుంచి బాలీవుడ్ నటి, నిర్మాత అనుష్కశర్మ, సింధు, స్మృతి మంధానా, జాతీయ పోలో జట్టు కెప్టెన్ పద్మనాభ్ సింగ్‌కు స్థానం లభించింది.
మార్చి - 29
¤ వారం రోజులుగా నిరసన పాటిస్తున్న సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తన దీక్షను విరమించారు.        » దిల్లీలోని రామ్‌లీలా మైదాన్ వద్ద ఏడో రోజు దీక్ష చేస్తున్న హజారే వద్దకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేందర ఫడనవీస్, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి గజేంద్ర షెకావత్‌లు కేంద్ర ప్రభుత్వ దూతలుగా వచ్చి హజారే డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి దీక్షను విరమింపజేశారు.        » కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాలలో లోకాయుక్తల ఏర్పాటు, వ్యవసాయ సమస్యల పరిష్కారానికి అన్నా హజారే ఈ నిరసన దీక్ష చేపట్టారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.