Type Here to Get Search Results !

ఏప్రిల్-2018 క్రీడలు

ఏప్రిల్ - 4
¤ ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో ఉన్న కరారా స్టేడియంలో 21వ కామన్వెల్త్ క్రీడలు ఆరంభమయ్యాయి.
        »
 బ్రిటన్ రాణి ప్రతినిధిగా హాజరైన ప్రిన్స్ చార్లెస్ క్రీడలు ఆరంభమైనట్లు అధికారికంగా ప్రకటించాడు.        » ఈ కామన్వెల్త్ మార్చ్‌ఫాస్ట్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు త్రివర్ణ పతాకంతో ముందు నడుస్తూ భారత బృందానికి నేతృత్వం వహించారు.        » పరేడ్‌లో ముందుగా 2014 కామన్వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన స్కాట్లాండ్ బృందం మైదానంలోకి వచ్చింది. మొత్తం 71 దేశాలు మార్చ్‌ఫాస్ట్‌లో పాల్గొన్నాయి.
ఏప్రిల్ - 5
¤ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం దక్కింది. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను మహిళల 48 కేజీల విభాగంలో పసిడి పతకాన్ని గెలుచుకుంది. స్నాచ్‌లో గరిష్ఠంగా 86 కిలోలు ఎత్తిన ఆమె క్లీన్ అండ్ జెర్క్‌లో 110 కిలోలు ఎత్తింది. మొత్తంగా 196 కిలోలతో కామన్వెల్త్ క్రీడల రికార్డును నెలకొల్పింది.        » 2010 దిల్లీ కామన్వెల్త్ క్రీడల్లో 175 కిలోలతో నైజీరియాకు చెందిన ఆగస్టినా న్వయకోలో స్థాపించిన రికార్డును 23 ఏళ్ల చాను బద్దలు కొట్టింది.        » ఈ క్రీడల్లో భారత్‌కు తొలి పసిడి అందించింది చాను అయితే, తొలి పతకం తెచ్చింది మాత్రం గురురాజా. పురుషుల 56 కేజీల విభాగంలో 249 (111 కేజీలు స్నాచ్ + 138 కేజీలు క్లీన్ అండ్ జెర్క్) కిలోలు ఎత్తేసి అతడు రజతం సొంతం చేసుకున్నాడు.        » 21వ కామన్వెల్త్ క్రీడల్లో తొలి స్వర్ణ పతకాన్ని బెర్ముడా ట్రయాథ్లాన్ క్రీడాకారిణి ఫ్లోరా డఫీ సొంతం చేసుకుంది. ట్రయాథ్లాన్ (స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్) రేసును ఆమె 56 నిముషాల 50 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది.¤ ఐపీఎల్ ప్రసార హక్కుల రూపంలో రూ.16,347 కోట్లు ఆర్జించిన బీసీసీఐ టీమ్ ఇండియా దేశవాళీ మ్యాచ్‌ల ప్రసార హక్కుల ద్వారా రూ.6138.1 కోట్లు సంపాదించింది.        » ఐపీఎల్ ప్రసార హక్కులు పొందిన స్టార్ ఇండియా ఈ కాంట్రాక్టును దక్కించుకోవడం విశేషం.        » ఈ బిడ్ ద్వారా ఏప్రిల్ 2018 నుంచి మార్చి 2023 వరకు స్వదేశంలో టీమ్ ఇండియా, దేశవాళీ మ్యాచ్‌ల టీవీ ప్రసారాలు, డిజిటల్ హక్కులు స్టార్ వశమయ్యాయి.        » మొత్తం 102 మ్యాచ్‌లకు గాను రూ.6138.1 కోట్లకు స్టార్ ఇండియా ప్రసార హక్కుల్ని దక్కించుకుంది.        » ఐదేళ్ల క్రితం ఇదే తరహాలో ప్రసార హక్కుల కోసం స్టార్ రూ.3851 కోట్లు చెల్లించింది. దాంతో పోలిస్తే ఇప్పుడు ఏకంగా 59 శాతం ఎక్కువ విలువ పెరగడం విశేషం.
ఏప్రిల్ - 6
¤ కామన్వెల్త్ క్రీడల్లో మహిళల 53 కిలోల విభాగం వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు చెందిన సంజిత చాను కామన్వెల్త్ రికార్డును బద్దలు కొట్టి స్వర్ణం నెగ్గింది. స్నాచ్‌లో 84, క్లీన్ అండ్ జెర్క్‌లో 108 కేజీలు ఎత్తిన ఆమె మొత్తం మీద 192 కేజీలు లిఫ్ట్ చేసి స్వర్ణాన్ని నెగ్గింది.
        »
 నాలుగేళ్ల క్రితం గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో చాను 48 కేజీల విభాగంలో స్వర్ణం నెగ్గింది. వెయిట్ లిఫ్టింగ్‌లో స్వర్ణాలు నెగ్గిన మీరాబాయ్ చాను, సంజిత చానులకు మణిపూర్ ప్రభుత్వం రూ.15 లక్షల చొప్పున నజరానా ప్రకటించింది.
ఏప్రిల్ - 7
¤ కామన్వెల్త్, క్రీడల్లో పురుషుల 85 కిలోల వెయిట్ లిఫ్టింగ్‌లో తెలుగు కుర్రాడు రాగాల వెంకట రాహుల్ 338 కిలోలు (151 + 187) ఎత్తి స్వర్ణం నెగ్గాడు.
        » తమిళనాడుకు చెందిన సతీష్ కుమార్ శివలింగం 77 కిలోల విభాగంలో స్వర్ణాన్ని నెగ్గాడు
.
        » గుంటూరు జిల్లాకు చెందిన రాహుల్ 2017లో గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్‌లో 351 కిలోలు ఎత్తి విజేతగా నిలిచాడు. సతీష్ గ్లాస్గో (2014) కామన్వెల్త్ క్రీడల్లో కూడా బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
¤ ఇండియన్ ప్రీమియర్‌లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ ప్రారంభమైంది. ముంబయిలో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన తొలి పోరులో చెన్నై ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది.
¤ భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. డేవిస్ కప్‌లో అత్యధికంగా 43 డబుల్స్ విజయాలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. నికోలా పెట్రాజెలీ (ఇటలీ, 42 విజయాలు) పేరిట ఉన్న రికార్డును పేస్ బద్దలు కొట్టాడు
.
        » మొదట డబుల్స్‌లో పేస్ - రోహన్ బోపన్న జోడీ, రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌ల్లో రామ్‌కుమార్ రామ్‌నాథన్, ప్రజ్ఞేష్ గుణేశ్వరన్ నెగ్గడంతో భారత్ 3 - 2తో విజయాన్ని సొంతం చేసుకుని వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ దశకు అర్హత సాధించింది.
ఏప్రిల్ - 8
¤ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మూడు స్వర్ణాలు నెగ్గింది.        » కామన్వెల్త్ రికార్డులను బద్దలుకొడుతూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో 16 ఏళ్ల యువ సంచలనం మనుబాకర్ స్వర్ణాన్ని నెగ్గింది. ఆమె మొత్తం 240.9 పాయింట్లు స్కోర్ చేసింది.        » వెయిట్ లిఫ్టర్ పూనమ్ యాదవ్ మహిళల 69 కేజీ విభాగంలో 222 కిలోలు ఎత్తి (100 + 122) స్వర్ణం నెగ్గింది.        » టేబుల్ టెన్నిస్ మహిళల టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు తొలిసారి స్వర్ణం నెగ్గింది. మనిక బత్రా, మధూరిక పట్కార్, మౌమా దాస్‌లతో కూడిన భారత జట్టు 3-1తో సింగపూర్ జట్టుపై నెగ్గింది.
ఏప్రిల్ - 9
¤ కామన్వెల్త్ క్రీడల్లో అయిదో రోజు భారత్ మూడు స్వర్ణాలను నెగ్గింది.        » స్టార్ షూటర్ జీతూరాయ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో బంగారాన్ని నెగ్గాడు.
        »
 టేబుల్ టెన్నిస్ పురుషుల విభాగంలో భారత జట్టు స్వర్ణాన్ని నెగ్గింది.        » బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణం నెగ్గింది. కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి ఈ విభాగంలో బంగారు పతకం సాధించింది.
ఏప్రిల్ - 10
¤ కామన్వెల్త్ క్రీడల్లో ఆరోరోజు భారత షూటింగ్ క్రీడాకారిణి హీనా సిద్దూ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణపతకం నెగ్గింది.
ఏప్రిల్ - 11
¤ కామన్వెల్త్ క్రీడల్లో మహిళల షూటింగ్ డబుల్ ట్రాప్‌లో భారత క్రీడాకారిణి శ్రేయాసి సింగ్ స్వర్ణం సాధించింది.        » 2014 గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో శ్రేయాసి రజతం నెగ్గింది.
ఏప్రిల్ - 12
¤ కామన్వెల్త్ క్రీడల్లో ఎనిమిదో రోజు భారత్ రెండు స్వర్ణాలు సహా ఏడు పతకాలను నెగ్గింది.        » రెజ్లింగ్‌లో పురుషుల 74 కిలోల ఫ్రీస్త్టెల్‌లో సుశీల్ కుమార్, 57 కిలోల ఫ్రీస్త్టెల్‌లో రాహుల్ అవారె స్వర్ణాలు నెగ్గారు.        » కామన్వెల్త్ క్రీడల్లో సుశీల్‌కు ఇది వరుసగా మూడో స్వర్ణం.¤ ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ అగ్రస్థానంలో నిలిచాడు.        » ప్రకాష్ పదుకొణె (1980), సైనా నెహ్వాల్ (2015) తర్వాత ఈ ఘనత సాధించిన భారత షట్లర్‌గా నిలిచాడు.        » విక్టర్ అలెక్సన్ (డెన్మార్క్)ను వెనక్కి నెట్టి నెం.1. ర్యాంకును సాధించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య కంప్యూటరైజ్డ్ ర్యాంకింగ్స్ ప్రవేశపెట్టిన తర్వాత అగ్రస్థానం సాధించిన భారత తొలి ఆటగాడు శ్రీకాంత్.
ఏప్రిల్ - 13
¤ కామన్వెల్త్ క్రీడల పోటీల్లో తొమ్మిదోరోజు భారత్ మూడు స్వర్ణాలు సహా పదకొండు పతకాలు నెగ్గింది.        » పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో హరియాణాకు చెందిన 15 ఏళ్ల అనీష్ బాన్‌వాల్ స్వర్ణం గెలిచి ఈ క్రీడల్లో పసిడి గెలిచిన పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అతను మనుబాకర్ (16 ఏళ్లు) రికార్డును అధిగమించాడు.        » మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్‌లో తేజస్విని సావంత్ స్వర్ణం గెలుచుకుంది.        » పురుషుల రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో భజరంగ్ పునియా స్వర్ణం నెగ్గాడు.¤ రేస్ వాకర్ కేటీ ఇర్ఫాన్, ట్రిపుల్ జంపర్ రాకేష్ బాబులపై కామన్వెల్త్ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్) వేటువేసింది.        » వారి గదుల్లో సిరంజీలు ఉన్న కారణంగా వారిని తక్షణం క్రీడా గ్రామం నుంచి ఖాళీ చేయించింది.
ఏప్రిల్ - 14
¤ కామన్వెల్త్ క్రీడల్లో పదోరోజు భారత్ 17 పతకాలు సాధించింది.        » వీటిలో 8 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి.        » స్వర్ణ పతక విజేతలు: మేరీ కోమ్ (బాక్సింగ్ - మహిళల 48 కేజీ), గౌరవ్ సోలంకి (బాక్సింగ్ - 52 కేజీ), వికాస్ కృష్ణన్ (బాక్సింగ్ - 75 కేజీ), వినేశ్ ఫోగట్ (రెజ్లింగ్ - మహిళల 50 కేజీ), సుమిత్ మాలిక్ (రెజ్లింగ్ - 125 కేజీ), మనిక బత్రా (టీటీ - మహిళల సింగిల్స్), నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్ - జావెలిన్ త్రో), సంజీవ్ రాజ్‌పుత్ (షూటింగ్ - 50 మీ. రైఫిల్ 3 పొజిషన్).        » కామన్వెల్త్‌లో జావెలిన్ త్రోలో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయుడిగా యువ అథ్లెట్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు.        » టేబుల్ టెన్నిస్‌లో సింగిల్స్ విజేతగా నిలిచిన తొలి భారత మహిళగా మనిక బత్రా రికార్డు నెలకొల్పింది.
ఏప్రిల్ - 15
¤ 21వ కామన్వెల్త్ క్రీడలు ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల సందర్భంగా నిర్వహించిన మార్చ్‌ఫాస్ట్‌లో భారత బృందానికి మేరీకోమ్ నాయకత్వం వహించింది.        » 21వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల పట్టికలో మొత్తం 66 పతకాలతో (26 స్వర్ణాలు + 20 రజతాలు + 20 కాంస్యాలు) మూడో స్థానంలో నిలిచింది.        » భారత్‌కు కామన్వెల్త్ క్రీడల చరిత్రలో ఇది మూడో అత్యుత్తమ ప్రదర్శన. 2014 గ్లాస్గో క్రీడల్లో 64 పతకాలతో ఐదో స్థానంలో నిలిచింది.        » 2010 దిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ అత్యధికంగా 101 (38 స్వర్ణాలు) పతకాలు సాధించింది. మాంచెస్టర్ (2002) లో 69 పతకాలు గెలిచింది.        » ఆస్ట్రేలియా (80 + 59 + 59) 198 పతకాలతో అగ్ర స్థానంలో నిలవగా, ఇంగ్లండ్ 136 (45 + 45 + 46) పతకాలతో రెండో స్థానంలో నిలిచింది.        » మొత్తంమీద భారత క్రీడాకారులు షూటింగ్‌లో 16 పతకాలు, రెజ్లింగ్‌లో 12, వెయిట్ లిఫ్టింగ్‌లో 9, బాక్సింగ్‌లో 9, టేబుల్ టెన్నిస్‌లో 8, బ్యాడ్మింటన్‌లో 6, అథ్లెటిక్స్‌లో 3, స్క్వాష్‌లో 2, పవర్ లిఫ్టింగ్‌లో ఒక్క పతకం నెగ్గారు.        » క్రీడల ఆఖరి రోజున భారత్‌కు ఒక స్వర్ణం సహా ఏడు పతకాలు లభించాయి. బ్యాడ్మింటన్‌లో మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ స్వర్ణాన్ని నెగ్గింది. ఫైనల్లో పీవీ సింధుని ఓడించింది.        » టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బత్రా నాలుగు పతకాలతో భారత్ తరఫున అత్యంత విజయవంతమైన క్రీడాకారిణిగా నిలిచింది. పోటీపడ్డ అన్ని విభాగాల్లోనూ పతకాలు గెలిచింది.        » కామన్వెల్త్ క్రీడల్లో 2 వ్యక్తిగత స్వర్ణాలు నెగ్గిన తొలి భారత షట్లర్‌గా సైనా రికార్డు సృష్టించింది.        » బరిలోకి దిగిన ప్రతి ఒక్క భారత రెజ్లర్ ఏదో ఒక పతకం సాధించడం విశేషం. మొత్తం 12 పతకాలు గెలిచారు.        » భారత్ అత్యధికంగా షూటింగ్‌లో 7 స్వర్ణాలు నెగ్గింది. రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్‌ల్లో అయిదేసి చొప్పున నెగ్గింది.        » జమైకా దిగ్గజం ఉసేన్ బోల్ట్ ముగింపు వేడుకలకు హాజరయ్యాడు.        » 2022లో 22వ కామన్వెల్త్ గేమ్స్‌కు బర్మింగ్‌హామ్ ఆతిథ్యమివ్వనుంది.
ఏప్రిల్ - 19
¤ 2026 యూత్ ఒలింపిక్స్, 2030 ఆసియా క్రీడలు, 2032 ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్‌లు వేయాలని భారత్ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నిర్ణయించింది.        » రెండ్రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓఏ) అధ్యక్షుడు థామస్ బాచ్ ఐఓఏ నిర్ణయాన్ని అభినందించారు.
ఏప్రిల్ - 24
¤ దక్షిణ కొరియాలోని చాంగ్‌వాంగ్‌లో జరుగుతున్న షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ తొలి పతకాన్ని నెగ్గింది.        » 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో షాజర్ రిజ్వి రజతం గెలుచుకున్నాడు.        » రష్యా క్రీడాకారుడు ఆర్టెమ్ చెర్నొసొవ్ స్వర్ణం నెగ్గాడు.¤ భారత్ వేదికగా వచ్చే ఏడాది ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించనున్నట్లు ఆసియా వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య వెల్లడించింది.        » ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ భారత్‌లో జరగబోతుండటం ఇదే తొలిసారి.        » ఈ ఛాంపియన్‌షిప్‌ను 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత టోర్నీగా నిర్వహిస్తున్నారు.
ఏప్రిల్ - 26
¤ ఛాంపియన్స్ ట్రోఫీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎట్టకేలకు రద్దు చేసింది. 2021లో భారత్‌లో జరగాల్సి ఉన్న ఈ టోర్నీ స్థానంలో ప్రపంచ టీ20ని నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది.
ఏప్రిల్ - 28
¤ షాంఘైలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత్ ఒక పతకం నెగ్గింది.        » తెలుగమ్మాయి జ్యోతి సురేఖ కాంపౌండ్ మిక్స్‌డ్ పెయిర్ విభాగంలో అభిషేక్ వర్మతో కలిసి కాంస్యం సొంతం చేసుకుంది.¤ చైనాలోని వుహాన్‌లో జరిగిన ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సైనా నెహ్వాల్, హెచ్.ఎస్. ప్రణయ్ కాంస్యాలు నెగ్గారు.        » ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సైనాకు ఇది మూడో కాంస్యం. పురుషుల సింగిల్స్‌లో అనూప్ శ్రీధర్ (2007లో కాంస్యం) తర్వాత పతకం గెలిచిన భారత షూటర్‌గా ప్రణయ్ రికార్డు సృష్టించాడు.
ఏప్రిల్ - 30
¤ కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు గెలిచిన క్రీడాకారులు దిల్లీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలతో విడివిడిగా సమావేశమయ్యారు.
        » క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఈ సందర్భంగా క్రీడాకారులను సన్మానించారు
.
        » కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణపతక విజేతకు రూ.30 లక్షలు, రజత విజేతకు రూ.20 లక్షలు, కాంస్య పతక విజేతకు రూ.10 లక్షల చొప్పున ప్రదానం చేశారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.