Type Here to Get Search Results !

ఏప్రిల్-2018 అవార్డులు

ఏప్రిల్ - 6
¤ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ రైల్వే మంత్రిత్వ శాఖ ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్టు 'బెస్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇనీషియేటివ్‌'కు ఎంపికయ్యారు. ఏప్రిల్ 15న భోపాల్‌లో నిర్వహించే 63వ రైల్వే వారోత్సవాల సభలో ఈ అవార్డును ఆయనకు అందజేయనున్నారు. భారతీయ రైల్వేలో ఈ ఏడాది నుంచే అవార్డును ప్రవేశపెట్టారు. జోన్ సామర్థ్యాన్ని పెంచుతూ చేపట్టిన చర్యలు, నూతన ఆవిష్కరణల్లో చూపిన చొరవ వల్ల ఈ పురస్కారం దక్కింది.
ఏప్రిల్ - 13
¤ దిల్లీలో 65వ జాతీయ అవార్డులను  బాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌ కపూర్‌  ప్రకటించారు. 2017లో విడుదలైన తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో వచ్చిన అద్భుతమైన చిత్రాలను పరిగణనలోకి తీసుకుని విజేతలను ప్రకటించారు.
       » జాతీయ అవార్డుల జ్యూరీ సభ్యులుగా ప్రముఖ నటి గౌతమి, ఇంతియాజ్‌ హుస్సేన్‌, గేయ రచయిత మెహబూబ్‌, పి.శేషాద్రి, అనిరుద్ధా రాయ్‌ చౌదరి, రంజిత్‌ దాస్‌, రాజేశ్‌ మపుస్కర్‌, త్రిపురారి శర్మ, రూమీ జఫ్రే ఉన్నారు. మే3న విజేతలకు అవార్డులు ప్రదానం చేస్తారు.
ఉత్తమ నటి: శ్రీదేవి (మామ్‌)
ఉత్తమ నటుడు: రిద్ధీ సేన్ (నగర్‌ కీర్తన్‌-బెంగాలీ)
ఉత్తమ తెలుగు చిత్రం: ఘాజీ
ఉత్తమ హిందీ చిత్రం: న్యూటన్
ఉత్తమ మలయాళీ చిత్రం: టేకాఫ్
ఉత్తమ తమిళ చిత్రం: టు లెట్‌
ఉత్తమ మరాఠీ చిత్రం: కచ్చా నింబూ
ఉత్తమ కన్నడ చిత్రం: హెబ్బెట్టు రామక్క
ఉత్తమ బెంగాలీ చిత్రం: మయురాక్షి
ఉత్తమ యాక్షన్‌ చిత్రం: బాహుబలి-2
ఉత్తమ సంగీత దర్శకుడు: ఏ.ఆర్‌ రెహమాన్‌ (మామ్‌), (కాట్రు వెలియిదాయ్‌)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌: గణేశ్‌ ఆచార్య (టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథా)
ఉత్తమ దర్శకుడు: జయరాజ్‌ (మలయాళ చిత్రం భయానకం)
ఉత్తమ సహాయ నటుడు: ఫహాద్ ఫాసిల్‌ (తొండిముత్తలం ద్రిసాక్షియుం)
దాదాసాహెబ్‌ ఫాల్కే : బాలీవుడ్‌ నటుడు వినోద్‌ ఖన్నా
ఏప్రిల్ - 17
¤ తెగుళ్లను తట్టుకునే ఆధునిక వంగడాల అభివృద్ధికి, బూజు (ఫంగస్) కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లను సమర్థంగా అడ్డుకునేందుకు పరిశోధనలు చేస్తున్న ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలు డాక్టర్ మమతా శర్మ, డాక్టర్ పూజా భట్నాగర్ మాథుర్‌లు ఇక్రిశాట్ అత్యున్నత అవార్డు 'డోరీన్ మార్గరెట్ మాష్లర్ - 2018' కి ఎంపికయ్యారు.¤ హాలీవుడ్ నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్ లైంగిక వేధింపుల బాగోతాన్ని వెలుగులోకి తెచ్చిన (న్యూయార్క్ టైమ్స్, న్యూయార్కర్‌లకు పులిట్జర్ బహుమతి లభించింది. జోడీ కంటోర్, మెగన్ ట్వోహీల నేతృత్వంలోని టైమ్స్ బృందం, న్యూయార్కర్ కంట్రిబ్యూటర్ రోనన్ ఫారోలకు ఈ ప్రఖ్యాత పురస్కారం దక్కింది.       » పరిశోధనాత్మక పాత్రికేయ విభాగంలో 'వాషింగ్టన్ పోస్ట్' పులిట్జర్ బహుమతిని పొందింది. 2017లో అలబామా సెనేట్ ఎన్నికల సమయంలో రిపబ్లికన్ అభ్యర్థి రాయ్ మూరీ లైంగిక వేధింపులను బయట పెట్టింనందుకు సంస్థకు ఈ అవార్డు లభించింది.       » 2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా పాత్రపై రాసిన వార్తలకుగాను ది టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్‌లు సంయుక్తంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్నాయి.       » అంతర్జాతీయ వార్తల విభాగంలో 'రాయటర్స్‌'కు పులిట్జర్ బహుమతి లభించింది.       » సంగీత విభాగంలో ర్యాప్ రారాజు కెండ్రిక్ ల్యామర్ స్వరపరచిన 'డీఏఎమ్ఎన్' ఆల్బమ్‌కు ఈ ఏడాది పులిట్జర్ దక్కింది.
ఏప్రిల్ - 19
¤ ప్రతిష్ఠాత్మక యుధ్‌వీర ఫౌండేషన్ స్మారక పురస్కారం ఈ ఏడాది హైదరాబాద్ యువకుడు సయ్యద్ ఉస్మాన్ అజహర్ మక్సూసీకి లభించింది.       » ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా ఉచిత అన్నదానం ద్వారా ఎంతో మంది పేదల కడుపు నింపుతున్న మక్సూసీని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లుగా యుధ్‌వీర ఫౌండేషన్ ప్రకటించింది.       » ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, పత్రికా సంపాదకుడు దివంగత యుధ్‌వీర్ జ్ఞాపకార్థం నెలకొల్పిన ఈ పురస్కారాన్ని 1992 నుంచి వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు అందిస్తున్నారు.
ఏప్రిల్ - 23
¤ విధి నిర్వహణలో అసువులు బాసిన సీఆర్‌పీఎఫ్ కమాండెంట్ ప్రమోద్ కుమార్, సైనిక్ హవల్దార్ గిరిష్ గురుంగ్‌లకు మరణానంతరం ప్రకటించిన 'కీర్తిచక్ర' అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రదానం చేశారు.
       » గిరిష్ గురుంగ్ కశ్మీరులోని కుప్వారా జిల్లాలో తీవ్రవాదులతో చేసిన వీరోచిత పోరాటంలో గాయపడి ఆ తర్వాత మరణించాడు. 2016లో శ్రీనగర్‌లో తీవ్రవాదులను ఎదుర్కొంటూ తీవ్రంగా గాయపడిన ప్రమోద్ కుమార్ చికిత్స పొందుతూ మరణించారు.
ఏప్రిల్ - 27
¤ ప్రముఖ గుజరాతీ రచయిత సీతాన్షు యశశ్చంద్ర కవితా సంకలనం 'వాఖర్' 2017 ఏడాదికి సరస్వతి సమ్మాన్ అవార్డు గెలుచుకుంది.
       » 
లోక్‌సభ మాజీ ప్రధాన కార్యదర్శి సుభాష్ సి.కశ్యప్ నేతృత్వంలోని కమిటీ ఈ ఎంపిక చేసింది. 2009లో వాఖర్ ప్రచురితమైంది.       » 1941లో భుజ్‌లో జన్మించిన యశశ్చంద్ర సమకాలీన గుజరాతీ రచయితల్లో అగ్రగణ్యులుగా పేరొందారు. కవి, నాటక రచయిత, అనువాదకుడు, విద్యావేత్త అయిన ఆయన వాఖర్‌తో పాటు మరో రెండు కవితా సంకలనాలనూ రాశారు. నాటకాలపై 10 పుస్తకాలు, విమర్శనాత్మక సాహిత్యంపై మూడు పుస్తకాలు వెలువరించారు.       » కేకే బిర్లా ఫౌండేషన్ ప్రదానం చేసే ఈ అవార్డు కింద రూ. 15 లక్షల నగదు, ప్రశంసా పత్రం, జ్ఞాపిక ఇస్తారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.