నవంబరు 2
|
» సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకులైన బి. రామలింగరాజును 14 ఏళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్‌లో కార్యకలాపాలు నిర్వహించటానికి వీల్లేకుండా నిషేధించింది. దీంతో పాటు చట్ట వ్యతిరేకంగా సంపాదించిన రూ. 813.40 కోట్ల మొత్తాన్ని వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. » బి. రామలింగరాజుతో పాటు ఆయన సోదరులు బి. రామరాజు, బి. సూర్యనారాయణ రాజు, ఎస్‌ఆర్‌ఎస్‌ఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. 14 ఏళ్ల నిషేధ కాలంలో ఇప్పటికే పూర్తయిన కాలం కలిసి ఉంటుంది. ¤ ‘తాలిబన్ల గాడ్‌ఫాదర్'గా పేరుకెక్కిన ప్రముఖ పాకిస్థానీ ఇస్లాం మత బోధకుడు మౌలానా సమీ ఉల్ హఖ్ (82) రావల్పిండిలోని స్వగృహంలో హత్యకు గురయ్యారు. » హఖ్ నడిపిన దారుల్ ఉలూమ్ హఖ్ఖానియా అనే మదర్సా ‘జీహాద్ విశ్వవిద్యాలయం'గా పేరుకెక్కింది. తాలిబన్ సహా పలు ఉగ్రసంస్థల నేతల్లో చాలా మంది ఇక్కడ శిక్షణ పొందారు. » గతంలో పాకిస్థాన్ పార్లమెంటుకు హఖ్ రెండు సార్లు ఎన్నికయ్యారు. దిఫా-ఎ-పాకిస్థానీ పేరుతో ఏర్పాటైన ఓ కూటమికి ఛైర్మన్‌గానూ పనిచేశారు. » ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు చెందిన జమాత్-ఉద్-దవా సంస్థకు కూడా ఇందులో సభ్యత్వం ఉంది. ¤ తెలుగు లిపికి సబంధించి ఐఐఐటీ హైదరాబాద్ పరిశోధన విద్యార్థిని శ్రీకవిత పారుపల్లి సరికొత్త ప్రయత్నం చేశారు. » 21,000 ప్రాచీన తెలుగు పదాలను అంతర్జాలంలో పొందుపర్చడం ద్వారా సాంకేతిక ప్రపంచంలో అవి చిరస్థాయిగా నిలిచిపోయేందుకు కృషిచేసి పరిశోధన పత్రం సమర్పించారు. » 3 నెలల పాటు శ్రమించి ‘తెలుగు వర్డ్ నెట్' ద్వారా తెలుగు పదాలు పొందుపరిచారు. |
నవంబరు 3
|
¤ భారతీయ వైద్య సంఘం (ఇండియన్ మెడికల్ అసోసియేషన్ - ఐఎంఏ) నూతన అధ్యక్షుడిగా శంతను సేన్ (2018-19) ఎంపికయ్యారు.
» 2019-20 సంవత్సరానికి తదుపరి అధ్యక్షుడిగా రాజన్ శర్మ ఎంపికయ్యారు. |
నవంబరు 6
|
» ఈ ఎన్నికలో జునైద్ అజిమ్ బీజేపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీల మద్దతుతో మేయర్ అయ్యారు. » జమ్ముకశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే సెప్టెంబరులో నేషనల్ కాన్ఫరెన్స్‌ను వదిలి జునైద్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ¤ మావోయిస్టు పార్టీ తమ కేంద్ర కమిటీలో భారీ మార్పులు చేపట్టింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి స్థానంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్‌ను నియమించింది. » కేశవరావు ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా, కేంద్ర మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా పార్టీలో అత్యంత కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. » తాజా మార్పుల నేపథ్యంలో ముప్పాళ్ల లక్ష్మణరావు ఇకపై పార్టీకి సలహాదారుగా, మార్గదర్శకుడిగా వ్యవహరించనున్నారు. » కేంద్ర మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీకి బాధ్యతలు అప్పగించారు. |
నవంబరు 7
|
» గత కొంతకాలంగా టెస్లా బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న రాబిన్ డెన్‌హోమ్ ఆస్ట్రేలియాకు చెందిన అతిపెద్ద టెలికాం కంపెనీ టెల్‌స్ట్రాకు చీఫ్ ఫైనాన్షియర్ ఆఫీసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. » అమెరికా స్టాక్ మార్కెట్లలో పబ్లిక్ హోల్డింగ్ కంపెనీగా లిస్టయిన టెస్లాను ప్రైవేటు కంపెనీగా మారుస్తానని, ఇన్వెస్టర్ల షేరుకు 420 డాలర్లు చెల్లిస్తానని ఈ ఏడాది ఆగస్టు 7న టెస్లా ఛైర్మన్ ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టిస్తూ మోసానికి పాల్పడ్డారని అమెరికా స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) అభిప్రాయపడింది. దీంతో మస్క్ అక్టోబరులో తన ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. » టయోటా, సన్ మైక్రో సిస్టమ్స్, జునిపర్ నెట్‌వర్స్క్‌లో కూడా రాబిన్ డెన్‌హోమ్ వివిధ హోదాల్లో పనిచేశారు. |
నవంబరు 9
|
నవంబరు 12
|
» గతంలో ఇదే విన్యాసాన్ని అయిదు నిమిషాల 6.61 సెకన్లలో పూర్తి చేసిన రికార్డును తనకు తానే తిరగరాశాడు. |
నవంబరు 13
|
నవంబరు 14
|
¤ నెహ్రూ యువ కేంద్ర జాతీయ పాలక మండలి వైస్ ఛైర్మన్‌గా బీజేపీ నేత ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి నియమితులయ్యారు. ఈయన మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. » కేంద్ర యువజన సర్వీసుల శాఖ ఈ నియామకం చేసింది. ¤ స్ప్రింటర్ హిమదాస్ యునిసెఫ్ ఇండియా తొలి యువ రాయబారిగా నియమితురాలైంది. ఈ విషయాన్ని యునిసెఫ్ ట్విటర్‌లో వెల్లడించింది. » హిమదాస్ 2018 ఆసియా క్రీడల్లో 4 × 400 రిలేలో స్వర్ణం గెలిచింది.
|
నవంబరు 15
|
¤ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తాత్కాలిక ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌ఓ)గా జయేష్ సంఘ్‌రాజ్‌కా నియమితులయ్యారు. » ప్రస్తుత సీఎఫ్‌ఓ ఎండీ రంగనాథ్ స్థానాన్ని జయేష్ భర్తీ చేయనున్నారు. |
నవంబరు 16
|
» రఘురాం ప్రస్తుతం భారత రొమ్ము శస్త్రచికిత్స నిపుణుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. » ఆసియా పసిఫిక్ రీజియన్‌లో అతి పెద్ద నిపుణుల సంఘంగా, ప్రపంచంలో రెండో అతిపెద్ద సంఘంగా ఏఎస్‌ఐ గుర్తింపు పొందింది. |
నవంబరు 19
|
నవంబరు 21
|
నవంబరు 22
|
» ఈసారి ప్రపంచ వ్యాప్తంగా 14 మందికి ఫెలోషిప్‌ను అందిస్తుండగా అందులో ముగ్గురు మినహా అంతా అమెరికన్లే. భారత్ నుంచి ఈ జాబితాలో రాజీవ్ ఒక్కరే చోటు దక్కించుకన్నారని ఇక్రిశాట్ ప్రకటించింది. » పంటల అభివృద్ధిలో భాగంగా ఆయన జీనోమిక్స్, మాలిక్యులార్ బ్రీడింగ్ అంశాలపై కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ¤ అపోలో టైర్స్‌కు ప్రచారకర్తగా సచిన్ తెందుల్కర్ నియమితులయ్యారు. అయిదేళ్లపాటు ఆయన సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతారు. » అపోలో టైర్స్ తొలిసారిగా తమ బ్రాండ్‌కు ఓ సెలబ్రిటీని ఎంపిక చేసుకుంది. ¤ నిస్సాన్ ఛైర్మన్ కార్లోస్ ఘోన్ తొలగింపునకు బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేశారు. ఈయన ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఇటీవల అరెస్టయ్యారు. సంస్థ జరిపిన అంతర్గత విచారణలో కూడా ఇది నిజమని తేలడంతో ఈ చర్య తీసుకున్నారు. |
నవంబరు 23
|
¤ పాకిస్థాన్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉగ్రవాదులు భీకర దాడులతో మారణహోమం సృష్టించారు.
» కరాచీలోని చైనా కాన్సులేట్‌పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు చనిపోయారు. » ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్‌లో శక్తిమంతమైన బాంబుదాడిలో 32 మంది చనిపోయారు. ఈ ప్రావిన్స్‌లోని గిరిజన ఒరక్‌జాయ్ జిల్లాలోని కలయా ప్రాంతంలో మైనార్టీ షియాలకు పవిత్ర ప్రదేశమైన ఇమామ్‌బర్గాకు సమీపంలో జుమా బజార్ (శుక్రవారం మార్కెట్) వద్ద శక్తిమంతమైన బాంబును పేల్చారు.¤ గూగుల్ తన వినూత్న ‘నైబర్లీ' యాప్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. మన చుట్టూ ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఈ యాప్ అత్యంత అనువైంది. » హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి సందేహాన్ని అయినా ఈ యాప్ ద్వారా పోస్ట్ చేయవచ్చు. దానికి ఎవరో ఒకరు స్పందించి తగిన సమాచారాన్ని అందించవచ్చు. |
నవంబరు 28
|
నవంబరు 29
|
¤ భారత సుప్రీంకోర్టులో మూడో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ పదవీ విరమణ చేశారు. ఈయన 1035 తీర్పులతో టాప్-10 సుప్రీం జడ్జీల జాబితాలో పదోస్థానం దక్కించుకున్నారు. » జస్టిస్ జోసెఫ్ కేరళలో 1953, నవంబరు 30న జన్మించారు. 2010 ఫిబ్రవరి 8 నుంచి 2013 మార్చి వరకూ హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. 2013 మార్చి 8న సుప్రీంకోర్టు జడ్జీగా జోసెఫ్ పదోన్నతి పొందారు.¤ పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఉనికిలి గ్రామానికి చెందిన బొల్లింపల్లి మేఘన నవంబరులో ప్రచురించిన ఫోర్బ్స్ మ్యాగజీన్‌లో అండర్-30 శాస్త్రవేత్తల విభాగంలో చోటు
|
నవంబరు 30
|
¤ మిస్ యూనివర్స్ తుది పోటీల్లో పాల్గొననున్న తొలి ట్రాన్స్ జెండర్‌గా మిస్‌స్పెయిన్ ఏంజెలా పోన్సె రికార్డులకెక్కారు. |