Type Here to Get Search Results !

Jan-2019 క్రీడలు

జనవరి - 1
¤ అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ జట్టు 2020 టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ - 12కు అర్హత సాధించింది         » మాజీ ఛాంపియన్‌ శ్రీలంక, బంగ్లాదేశ్‌ మాత్రం 12 జట్ల ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సంపాదించలేపోయాయి         » తొలి ఎనిమిది ర్యాంకుల్లో ఉన్న పాకిస్థాన్, భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్‌తో పాటు అఫ్గాన్‌ ప్రపంచకప్‌ సూపర్‌ - 12లో నేరుగా చోటు దక్కించుకున్నాయి.
జనవరి - 5
¤ ప్రోకబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) సీజన్‌ 6 విజేతగా బెంగళూరు బుల్స్‌ నిలిచింది.         » ముంబయిలో జరిగిన ఫైనల్లో బెంగళూరు బుల్స్‌ జట్టు 38 - 33తో గుజరాత్‌ ఫార్ఛ్యూన్‌ జెయింట్స్‌పై గెలుపొందింది.         » పీకేఎల్‌లో బెంగళూరు విజేతగా నిలవడం ఇదే తొలిసారి. మరోవైపు గుజరాత్‌ వరుసగా రెండోసారి రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది. గత సీజన్‌ ఫైనల్లో గుజరాత్‌ పట్నా చేతిలో ఓడింది.         » బెంగళూరు క్రీడాకారుడు పవన్‌ షెరావత్‌ 22 రైడ్‌ పాయింట్లు సాధించాడు.         » బెంగళూరు జట్టు కెప్టెన్‌ రోహిత్‌. విజేతకు రూ.3 కోట్లు, రన్నరప్‌కు రూ.1.8 కోట్లు ప్రైజ్‌మనీగా లభించింది.¤ అంతర్జాతీయ మిక్స్‌డ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ హాప్‌మన్‌ కప్‌లో రోజర్‌ ఫెదరర్‌ - బెలిండా బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌) జట్టు టైటిల్‌ను గెలుచుకుంది.         » ఫైనల్లో ఈ జోడీ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ - ఏంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ) జోడీపై నెగ్గింది.
జనవరి - 7
¤ ప్రతిష్ఠాత్మక బోర్డర్‌ - గవాస్కర్‌ ట్రోఫీలో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ను భారత జట్టు 2-1 తేడాతో నెగ్గింది. 1947-48లో తొలిసారి భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 71 ఏళ్లుగా ఆ దేశంలో టెస్ట్‌ సిరీస్‌ నెగ్గడం సాధ్యపడలేదు. ఆస్ట్రేలియాలో టెస్ట్‌ సిరీస్‌ నెగ్గిన తొలి ఆసియా జట్టుగా భారత్‌ నిలిచింది. ఈ సిరీస్‌లో 521 పరుగులు సాధించిన చెతేశ్వర్‌ పుజారా మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్, మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు దక్కించుకున్నాడు.
జనవరి - 8
¤ ఐసీసీ ప్రకటించిన టెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్‌ పుజారా మూడో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో పుజారా 521 పరుగులు చేశాడు. ఆ సిరీస్‌లో 350 పరుగులు చేసిన వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ 21 స్థానాలు ఎగబాకి 17వ స్థానంలో నిలిచాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అగ్రస్థానంలో నిలిచాడు. జస్పిత్‌ బుమ్రా 16, షమీ 22వ స్థానాల్లో ఉన్నారు.
జనవరి - 9
¤ జాతీయ సీనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) ఛాంపియన్‌షిప్‌లో ఆకుల శ్రీజ, నిఖత్‌బాను (తెలంగాణ) జోడీ స్వర్ణం నెగ్గింది.¤ మహారాష్ట్రలోని పుణెలో ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ ప్రారంభమయ్యాయి.¤ భారత సీనియర్‌ పురుషుల హాకీ జట్టు కోచ్‌ పదవి నుంచి హరేంద్ర సింగ్‌ను తొలగిస్తూ హాకీ ఇండియా ఉత్తర్వులు జారీ చేసింది.
జనవరి - 10
¤ అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఏఐబీఏ) విడుదల చేసిన ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ర్యాంకింగ్స్‌లో 1700 పాయింట్లతో మేరీకోమ్‌ మొదటిస్థానంలో నిలిచారు. మేరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణంతోపాటు కామన్వెల్త్‌ క్రీడల్లో కూడా పసిడి పతకం సాధించింది.
జనవరి - 11
¤ టీవీ కార్యక్రమంలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన క్రికెటర్లు హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌లను బీసీసీఐ సస్పెండ్‌ చేసింది. వారిపై విచారణకు ఆదేశించిన బోర్డు అది పూర్తయి, తర్వాతి చర్యలు తీసుకునేవరకు వారు ఆడటానికి వీల్లేదని చెప్పింది.
¤ బ్రిటన్‌ ఆటగాడు ఆండీ ముర్రే (31) టెన్నిస్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. జనవరి 14న ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ అతడికి చివరి టోర్నమెంట్‌ కానుంది. 2012లో యూఎస్‌ ఓపెన్‌ గెలిచిన ముర్రే 2016లో వింబుల్డన్‌తోపాటు ఫ్రెంచ్‌ ఓపెన్‌ కూడా సాధించాడు.
¤ భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి సిడ్నీ క్రికెట్‌ స్టేడియం (ఎస్‌సీజీ) గౌరవ సభ్యత్వం పొందారు.
జనవరి - 12
¤ పుణెలో జరుగుతున్న ఖేలో ఇండియా యూత్‌ క్రీడల్లో తెలంగాణ వెయిట్‌ లిఫ్టర్‌ కార్తీక్‌ అండర్‌ -17 బాలుర వెయిట్‌ లిఫ్టింగ్‌ (89 కేజీలు) పసిడి సాధించాడు.
జనవరి - 13
¤ ఫుట్‌బాల్‌ దిగ్గజం మహ్మద్‌ జుల్ఫికరుద్దీన్‌ (82) హైదరాబాద్‌లో మరణించారు.¤ ఖేలో ఇండియా క్రీడల్లో షూటింగ్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ విభాగంలో అభినవ్‌ షా అనే పదేళ్ల బాలుడు స్వర్ణం గెలుచుకున్నాడు.¤ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ నాలుగో సీజన్‌లో బెంగళూరు రాఫ్టర్స్‌ విజేతగా నిలిచింది. ఫైనల్లో 4-3 తేడాతో ముంబయి రాకెట్స్‌పై విజయం సాధించింది.
జనవరి - 14
¤ షార్జాలో జరుగుతున్న ఆసియా కప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో బహ్రెయిన్‌ చేతిలో భారత్‌ ఓడిపోయింది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమణ తప్పలేదు.
జనవరి - 16
¤ ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసులో చెస్‌ గ్రాండ్‌ మాస్టర్‌ హోదా అందుకున్న రెండో క్రీడాకారుడిగా డి. గుకేశ్‌ (12) చరిత్ర సృష్టించాడు. దిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ ఓపెన్‌ చెస్‌ పోటీల్లో పాల్గొన్న చెన్నైకు చెందిన గుహేశ్‌ 12 ఏళ్ల, 7 నెలల 17 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. సర్గీ కర్జికన్‌ (రష్యా) 12 ఏళ్ల, 7 నెలల వయసులో ఈ ఘనత సాధించి జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్నాడు. గతంలో చెన్నైకి చెందిన ప్రజ్ఞానంద భారతీయ పిన్న వయసు గ్రాండ్‌ మాస్టర్‌ రికార్డును తాజాగా గుకేశ్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.¤ సిద్దిపేటలో జరిగిన జాతీయస్థాయి అండర్‌ - 17 హ్యాండ్‌బాల్‌ పోటీల్లో బాలబాలికల విభాగాల్లో తెలంగాణ జట్లు ఛాంపియన్లుగా నిలిచాయి.
జనవరి - 18
¤ భారత జట్టు ఆస్ట్రేలియాలో తొలిసారిగా ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను (2-1) గెలుచుకుంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన చివరి, మూడో వన్డేలో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒక్క ఫార్మాట్‌లో కూడా సిరీస్‌ కోల్పోకుండా ఆస్ట్రేలియాలో పర్యటన ముగించిన తొలి జట్టు భారత్‌దే. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ - యుజ్వేంద్ర చాహల్‌. మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ - ఎం.ఎస్‌. ధోని. ధోనీ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు గెలుచుకోవడం ఇది ఏడోసారి. అత్యంత పెద్ద వయసులో (37 సంవత్సరాల 195 రోజులు) ఈ అవార్డు గెలిచింది ధోనీయే కావడం విశేషం. గతంలో ఈ రికార్డు గావస్కర్‌ పేరిట ఉండేది (37 ఏళ్ల 191 రోజులు, 1987 - శ్రీలంకపై).
¤ భారతదేశానికి చెందిన పారా పవర్‌ లిఫ్టర్‌ విక్రమ్‌సింగ్‌ అధికారిపై అంతర్జాతీయ పారాలింపిక్‌ కమిటీ (ఐపీసీ) నాలుగేళ్ల నిషేధం విధించింది. 2017లో విక్రమ్‌సింగ్‌ నుంచి సేకరించిన మూత్రం శాంపిళ్లలో నిషేధ ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
¤ హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జాతీయ కరాటే పోటీలను మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. జపాన్‌ కరాటే అసోసియేషన్‌ (జేకేఏఐ) వీటిని నిర్వహిస్తోంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ పోటీల్లో 25 రాష్ట్రాల నుంచి సుమారు 1300 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. భారత్‌లో 36 సంవత్సరాలుగా ఈ పోటీలను నిర్వహిస్తున్న జేకేఏఐ తెలంగాణలో ఈ పోటీలు నిర్వహించడం ఇది రెండోసారి.
జనవరి - 20
¤ దోహాలో జరిగే వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌కు ఆసియాడ్‌ పతక విజేత సుధాసింగ్, నీతేంద్ర సింగ్‌ రావత్‌ అర్హత సాధించారు.
¤ బెంగళూరులో జరిగిన ఆలిండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో అండర్‌-19 విభాగంలో మహిళల సింగిల్స్‌ విజేతగా పుల్లెల గాయత్రి గోపీచంద్‌ నిలిచింది. ఫైనల్లో ఉన్నతి బిస్త్‌ను 21-12, 21-13తో ఓడించింది. అండర్‌ -19 బాలుర డబుల్స్‌ ఫైనల్లో నవనీత్‌- విష్ణువర్ధన్‌గౌడ్‌ జోడీ మన్‌జీత్‌సింగ్, డింకూసింగ్‌లను ఓడించింది. మిక్స్‌డ్‌ టైటిల్‌ పోరులో నవనీత్‌ - సాహితి జోడీ రవికృష్ణ - వర్షిణిలపై గెలిచింది.
జనవరి - 21
¤ ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో విరాట్‌ కోహ్లి 922 పాయింట్లతో నంబర్‌వన్‌ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. పుజారా మూడో స్థానం దక్కించుకోగా రిషబ్‌ పంత్‌ 17వ స్థానంలో ఉన్నాడు. టీమ్‌ ర్యాంకింగ్స్‌లో టీమ్‌ ఇండియాదే ప్రథమస్థానం.
జనవరి - 22
¤ ఐసీసీ వార్షిక పురస్కారాల్లో ఒకే ఏడాది మూడు వ్యక్తిగత అవార్డులు సొంతం చేసుకున్న తొలి క్రీడాకారుడిగా విరాట్‌ కోహ్లి చరిత్ర సృష్టించాడు. గ్యారీ సోబర్స్‌ పేరిట ఏర్పాటు చేసిన ‘క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌'తోపాటు వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్, టెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులు విరాట్‌కే దక్కాయి. 2018 సంవత్సరానికి ఐసీసీ ఉత్తమ వర్ధమాన క్రికెటర్‌ అవార్డును రిషబ్‌ పంత్‌ గెలుచుకున్నాడు. అంపైర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ధర్మసేనకు, స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డు కేన్‌ విలియంసన్‌కు దక్కాయి. ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు రెండోసారి నెగ్గిన తొలి క్రికెటర్‌ కోహ్లి. ఐసీసీ వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు మూడుసార్లు (2012, 2017, 2018) ఎంపికైన తొలి భారత క్రికెటర్‌ కూడా విరాట్‌ కోహ్లినే. గతంలో ధోనీకి రెండుసార్లు (2008, 2009) ఈ అవార్డు దక్కింది. ఐసీసీ టెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు పొందిన అయిదో భారత క్రికెటర్‌ కోహ్లి. అంతకు ముందు రాహుల్‌ ద్రవిడ్‌ (2004), గంభీర్‌ (2009), వీరేంద్రసింగ్‌ సెహ్వాగ్‌ (2010), అశ్విన్‌ (2016) ఈ అవార్డు దక్కించుకున్నారు.
జనవరి - 23
¤ వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 వికెట్ల మైలురాయి అందుకున్న భారత బౌలర్‌గా మహ్మద్‌ షమి రికార్డు సృష్టించాడు. అతడి వందో వికెట్‌ కివీస్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌. తన కెరియర్‌లో 56వ వన్డేలో 100 వికెట్ల ఘనత సాధించిన ఇర్ఫాన్‌ పఠాన్‌ రికార్డును (59 వన్డేల్లో 100 వికెట్లు) షమి అధిగమించాడు. జహీర్‌ఖాన్‌ 65 మ్యాచ్‌లలో, అగార్కర్‌ 67 మ్యాచ్‌లలో ఈ మైలురాయిని అందుకున్నారు.¤ నేపియర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగి 38 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది.మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ - మహ్మద్‌ షమి.¤ వన్డేల్లో అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ పరంగా) 5వేల పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా శిఖర్‌ ధావన్‌ నిలిచాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 114 ఇన్నింగ్స్‌లో ఈ పరుగులు సాధించి, మొదటి స్థానంలో ఉన్నాడు.¤ అంతర్జాతీయ వెయిట్‌ లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్‌) భారత వెయిట్‌ లిఫ్టర్‌ సంజిత చానుపై విధించిన ప్రాథమిక నిషేధాన్ని ఎత్తివేసింది. గత ఏడాది కామన్వెల్త్‌ క్రీడల్లో 53 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకున్న చాను ఆ తర్వాత డోప్‌ టెస్ట్‌లో దొరకడంతో ఆమెపై నిషేధం విధించారు. విచారణ అనంతరం ఐడబ్ల్యూఎఫ్‌ ప్రస్తుతానికి ఆమెపై నిషేధాన్ని తొలగించింది.
జనవరి - 24
¤ క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, కె.ఎల్‌. రాహుల్‌పై సస్పెన్షన్‌ను పరిపాలకుల కమిటీ (సీఓఏ) ఎత్తివేసింది. అయితే వారిపై విచారణ కొనసాగుతుంది. సుప్రీంకోర్టు సహాయకుడు పీఎస్‌ నరసింహను సంప్రదించిన సీఓఏ ఈ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ రాజ్యాంగంలోని నిబంధన 16 కింద సస్పెన్షన్‌ ఎత్తివేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. సుప్రీంకోర్టు నియమించే అంబుడ్స్‌మెన్‌ ఈ ఇద్దరు ఆటగాళ్లపై చర్యల విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు. ఇటీవల ఒక టీవీ కార్యక్రమంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హార్దిక్, రాహుల్‌పై సస్పెన్షన్‌ విధించారు.¤ ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ జట్టు 48.4 ఓవర్లలో 192 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. స్మృతి మంధానకు (105 పరుగులు) జెమీమా రోడ్రిగ్జ్‌ (81 నాటౌట్‌) తోడవటంతో 33 ఓవర్లలో 1 వికెట్‌ నష్టానికే భారత జట్టు లక్ష్యాన్ని ఛేదించింది.
జనవరి - 26
¤ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను జపాన్‌కు చెందిన నవోమి ఒసాకా గెలుచుకుంది. మెల్‌బోర్న్‌లోని రాడ్‌ లేవర్‌ ఎరీనాలో జరిగిన ఫైనల్లో ఎనిమిదో సీడ్‌ పెట్రా క్విటోవాను (చెక్‌ రిపబ్లిక్‌) ఓడించి ఛాంపియన్‌గా అవతరించింది. ప్రపంచ నెంబర్‌వన్‌ ర్యాంకును కైవసం చేసుకున్న రెండో అతి పిన్న వయస్కురాలిగా (21 ఏళ్ల 104 రోజులు) ఒసాకా రికార్డు సృష్టించింది. గతంలో 2010లో కరోలిన్‌ వోజ్నియాకి (20 ఏళ్ల 92 రోజులు) ఈ ఘనత సాధించింది. ఒసాకాకు 41 లక్షల ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ.20 కోట్ల 87 లక్షలు), రన్నరప్‌ క్విటోవాకు 20 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు ప్రైజ్‌మనీ లభించింది. ఒసాకా తన కెరియర్‌లో వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
» మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ను క్రెజ్‌కోవా (చెక్‌ రిపబ్లిక్‌), ఆండీ రామ్‌ (అమెరికా) జోడీ సొంతం చేసుకుంది. ఫైనల్లో వీరు 7-6 (7-3), 6-1 తో ఆస్ట్రేలియా వైల్డ్‌కార్డ్‌ జంట అస్త్రశర్మ, స్మిత్‌లను ఓడించారు..
¤ నేపాల్‌ యువ క్రికెటర్‌ రోహిత్‌ పౌడెల్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ 29 ఏళ్ల కిందట నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతి పిన్న వయసులో అర్ధ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా కొత్త రికార్డు నెలకొల్పాడు. యూఏఈతో జరిగిన వన్డే మ్యాచ్‌లో రోహిత్‌ (16 సంవత్సరాల 146 రోజుల వయసు) 58 బంతుల్లో 55 పరుగులు సాధించాడు. దీంతో సచిన్‌ 16 ఏళ్ల 213 రోజుల వయసులో పాకిస్థాన్‌ జట్టుపై టెస్ట్‌ క్రికెట్‌లో చేసిన అర్ధ సెంచరీ రికార్డును అధిగమించినట్లయ్యింది.
¤ న్యూజిలాండ్‌తో అయిదు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 90 పరుగుల తేడాతో విజయం సాధించింది.
జనవరి - 27
¤ జకార్తాలో జరుగుతున్న ఇండోనేసియా మాస్టర్స్‌ ట్రోఫీ ఫైనల్లో సైనా నెహ్వాల్‌ విజేతగా నిలిచింది. ప్రపంచ ఛాంపియన్‌ కరోలినా మారీన్‌ గాయం కారణంగా తప్పుకోవడంతో సైనాకు గెలుపు దక్కింది.
¤ మెల్‌బోర్న్‌లో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేతగా నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) నిలిచాడు. ఫైనల్లో 6-3, 6-2, 6-3తో స్పెయిన్‌కు చెందిన రఫెల్‌ నాదల్‌ను ఓడించాడు. దీంతో ఏడోసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ దక్కించుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. జకోవిచ్‌ గతంలో 2008, 2011, 2012, 2013, 2015, 2016లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేతగా నిలిచాడు.
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత జకోవిచ్‌» నొవాక్‌ జకోవిచ్‌ 15 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో పీట్‌ సంప్రాస్‌ (14) రికార్డును అధిగమించాడు. పురుషుల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలిచిన ఆటగాళ్ల జాబితాలో రోజర్‌ ఫెదరర్‌ (20), రఫెల్‌ నాదల్‌ (17) తర్వాత మూడోస్థానంలో నిలిచాడు.
» జకోవిచ్‌కు ఇది వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. గత ఏడాది అతడు వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌ గెలుచుకున్నాడు.
¤ ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో గారీ సోబర్స్‌ (1974) తర్వాత నెంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా నిలిచిన తొలి వెస్టిండీస్‌ ఆటగాడిగా జేసన్‌ హోల్డర్‌ ఘనత సాధించాడు. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆల్‌రౌండర్ల జాబితాలో షకిబ్‌ అల్‌ హసన్‌ను అధిగమించి మొదటిస్థానం దక్కించుకున్నాడు.
¤ టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నీ టైటిల్‌ను ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ సొంతం చేసుకున్నాడు. నెదర్లాండ్స్‌లోని విజ్‌ కాన్‌ జిలో జరిగిన ఈ టోర్నీలో భారత ఆటగాడు, అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ మూడోస్థానంలో నిలిచాడు.
¤ దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ అండిలె ఫెలుక్వాయోపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినందుకు పాకిస్థాన్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌పై ఐసీసీ 4 మ్యాచ్‌ల నిషేధం విధించింది.
జనవరి - 28
¤ న్యూజిలాండ్‌లో వరుస విజయాలు సాధిస్తున్న భారత జట్టు పదేళ్ల తర్వాత ఆ గడ్డపై వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోనుంది. (చివరిగా 2009లో ధోనీ సారథ్యంలో మన జట్టు న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను గెలుచుకుంది.) తాజా మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌ షమి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' గా నిలిచాడు. వన్డేల్లో అత్యధిక శతక భాగస్వామ్యాలు (16) అందించిన మూడో జోడీగా గిల్‌ క్రిస్ట్‌ - హేడెన్‌లతో సమంగా కోహ్లి - రోహిత్‌ నిలిచారు. సచిన్‌ - గంగూలీ (26), దిల్షాన్‌ - సంగక్కర (20) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. వన్డేల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా (63 వన్డేల్లో) కోహ్లి రెండో స్థానం (47 విజయాలు) పొందాడు. క్లైవ్‌ లాయిడ్, పాంటింగ్‌ (50) మొదటి స్థానంలో ఉన్నారు.
¤ అంతర్జాతీయ క్రికెట్‌ సంఘం (ఐసీసీ) అంబటి రాయుడు ఇకపై ఏ అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ బౌలింగ్‌ చేయడానికి వీల్లేదని నిషేధం విధించింది. జనవరి 12న ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో అతడి బౌలింగ్‌ సందేహ్పాదంగా ఉండటంతో మ్యాచ్‌ రెఫరీ ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాలని ఐసీసీ 14 రోజుల గడువు ఇచ్చింది. రాయుడు దానికి హాజరు కాకపోవడంతో నిబంధనల ప్రకారం అతడిని బౌలింగ్‌ చేయకుండా నిషేధం విధించినట్లు ఐసీసీ పేర్కొంది.
జనవరి - 29
¤ రష్యా గ్రాండ్‌ మాస్టర్, మాజీ ప్రపంచ ఛాంపియన్‌ వ్లాదిమిర్‌ క్రామ్నిక్‌ (43) చెస్‌కు వీడ్కోలు పలికాడు. క్రామ్నిక్‌ 1996లో ప్రపంచ నంబర్‌వన్‌ అయ్యాడు. అప్పట్లో పిన్న వయసులో ప్రపంచ నంబర్‌వన్‌ సాధించిన ఘనత అతడిదే. తర్వాత 2010లో మాగ్నస్‌ కార్ల్‌సన్‌ ఆ రికార్డును అధిగమించాడు. 2000లో గ్యారీ కాస్పరోవ్‌ను ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత క్రామ్నిక్‌ 2007లో విశ్వనాథన్‌ ఆనంద్‌ చేతిలో ఓడిపోయేంత వరకు ఆ కిరీటాన్ని నిలబెట్టుకున్నాడు. తాజాగా నెదర్లాండ్స్‌లో ముగిసిన టాటా స్టీల్‌ చెస్‌ టోర్నీయే క్రామ్నిక్‌ కెరియర్‌లో చివరిది.
¤ మౌంట్‌ మాంగనుయ్‌లో జనవరి 29న న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్మృతి మంధాన (90 నాటౌట్‌), కెప్టెన్‌ మిథాలీరాజ్‌ (63 నాటౌట్‌) జోడీ 151 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలుపు వైపు నడిపించారు. దీంతో భారత్‌ మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ఈ వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. 1994 తర్వాత న్యూజిలాండ్‌లో వన్డే సిరీస్‌ గెలవడం భారత మహిళల జట్టుకు ఇదే తొలిసారి.
¤ వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే 2020 టీ20 ప్రపంచకప్, మహిళల టీ20 ప్రపంచకప్‌ షెడ్యూళ్లను ఐసీసీ విడుదల చేసింది. 2020 అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకు టీ20 ప్రపంచకప్‌ జరుగుతుంది. మహిళల టీ20 ప్రపంచకప్‌ కూడా ఆస్ట్రేలియాలోనే ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు జరగనుంది.
జనవరి - 31
¤ గ్రేటర్‌ నోయిడాలో జనవరి 31 జరిగిన ప్రొ రెజ్లింగ్‌ ఫైనల్లో హరియాణా జట్టు 6-3తో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పంజాబ్‌ రాయల్స్‌పై విజయం సాధించిందిగతమూడు సీజన్లలో రన్నరప్‌గా మిగిలిన హరియాణా హ్యామర్స్‌ తొలిసారి విజేతగానిలిచింది జట్టుకు చెందిన ఖొట్సినిస్కిషబనోవ్కిరణ్రవికుమార్అనిస్తియాప్రస్తుత విజయంలో కీలక పాత్ర పోషించారు.
¤ హామిల్టన్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత జట్టు 92పరుగులకే ఆలౌట్‌ అయ్యిందిఇది వన్డే చరిత్రలో భారత్‌కు ఏడో అత్యల్ప స్కోరు.తొలి మూడు మ్యాచ్‌లలో నెగ్గి భారత్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది విజయంతోన్యూజిలాండ్‌ జట్టు భారత్‌ ఆధిక్యాన్ని 3-1కి తగ్గించిందిచివరిదైన అయిదో వన్డేఫిబ్రవరి 3 వెల్లింగ్టన్‌లో జరగనుంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.