¤ కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా సుధీర్ భార్గవతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దిల్లీలో ప్రమాణం చేయించారు. »కొత్తగా సమాచార కమిషనర్లుగా నియమితులైన మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారి యశ్‌వర్ధన్ కుమార్ సిన్హా, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి వనజ ఎన్ సర్నా, మాజీ ఐఏఎస్ అధికారి నీరజ్ కుమార్ గుప్తా, న్యాయశాఖ మాజీ కార్యదర్శి సురేష్ చంద్ర కూడా ప్రమాణం చేశారు.¤ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) తాత్కాలిక ఛైర్మన్‌గా హేమంత్ భార్గవను ప్రభుత్వం నియమించింది. »వీకే శర్మ స్థానంలో ఈయన బాధ్యతలు స్వీకరిస్తారు. »హేమంత్ భార్గవ ప్రస్తుతం ఎల్‌ఐసీ సీనియర్ ఎండీగా ఉన్నారు.¤ దక్షిణ మధ్య రైల్వే ఇన్‌ఛార్జి జనరల్ మేనేజర్‌గా ఆర్.కె.కుల్ శ్రేష్ఠ బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఇప్పటివరకు దక్షిణ రైల్వే జీఎంగా ఉన్నారు. »దక్షిణ మధ్య రైల్వే జీఎంగా ఉన్న వినోద్‌కుమార్ యాదవ్ రైల్వే బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో కుల్ శ్రేష్ఠ ఇన్‌ఛార్జి జీఎంగా బాధ్యతలు చేపట్టారు.
జనవరి - 14
¤ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ) బోర్డు సభ్యుడిగా, దక్షిణ భారత ప్రతినిధిగా డాక్టర్ పోతినేని రమేష్‌బాబు నియమితులయ్యారు.
జనవరి - 24
¤ హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విభాగానికి సంయుక్త సంచాలకుడిగా (జేడీ) 2005 బ్యాచ్‌కు చెందిన కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ అధికారి అభిషేక్ గోయల్ నియమితులయ్యారు. హైదరాబాద్ ఈడీ విభాగానికి ఇప్పటి వరకు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారులను మాత్రమే నియమించేవారు. ఐపీఎస్ అధికారిని నియమించడం ఇదే తొలిసారి.