¤ పంజాబ్‌లోని జలంధర్‌లో 106వ భారత సైన్స్ కాంగ్రెస్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. » దేశాభివృద్ధిలో పరిశోధన రంగం ప్రాధాన్యతను చాటిచెప్పేలా ప్రధాని మోదీ సరికొత్త నినాదమిచ్చారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్‌ల సరసన జై అనుసంధాన్‌ను చేర్చారు. » రైతులకు ప్రయోజనం కలిగించేలా బిగ్ డేటా అనాలసిస్, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్-ఏఐ), బ్లాక్ - చెయిన్ సాంకేతికతలను వ్యవసాయ రంగంలో ఉపయోగించుకోవాల్సిన అవసరముందని తెలిపారు.
జనవరి - 4
¤ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రస్తుతం మనుషులు రోజూ వాడుతున్న పరికరాలను ‘టైమ్ క్యాప్సూల్ (కాలనాళిక)లో ఉంచి భూగర్భంలో నిక్షిప్తం చేశారు. » లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ)లోని యునిపోలిస్ ఆడిటోరియంలో నిక్షిప్తమైన ఈ క్యాప్సూల్‌ను 100 సంవత్సరాల తర్వాత తెరుస్తారు. » స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, డ్రోన్, వీఆర్ గ్లాసు, ఎలక్ట్రిక్ కుక్ టాప్‌లతో పాటు భారత శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పురోగతికి గుర్తుగా మంగళ్‌యాన్, తేజస్ యుద్ధ విమానం, బ్రహ్మోస్ క్షిపణి నమూనాలను కాలనాళికలో ఉంచారు.
జనవరి - 10
¤ హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో (నిథమ్) 23వ ఇంటర్నేషనల్ జాయింట్ వరల్డ్ టూర్ కల్చర్ టూరిజం సదస్సు ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్‌లో నిర్వహించడం ఇదే తొలిసారి.
జనవరి - 17
¤ సీఐఐ, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కోర్నెల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన అగ్రి విజన్ - 2019 సదస్సును ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ప్రారంభించారు.
జనవరి - 19
¤ హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ‘అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు'ను సామాజికవేత్త అన్నా హజారే, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవితతో కలిసి ప్రారంభించారు. రెండు రోజులపాటు సాగే ఈ సదస్సును తెలంగాణ జాగృతి నిర్వహిస్తోంది. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఉద్దేశించిన ఈ సదస్సులో 135 దేశాలకు చెందిన 550 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ¤ ‘రక్షణ రంగంలో స్వావలంబన' అంశంపై హైదరాబాద్‌లో జాతీయ సదస్సు ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో సైనిక దళాల ఉపాధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ ఎస్‌ఎస్ హసాన్‌బిస్, జాతీయ సైబర్ సెక్యూరిటీ ముఖ్య అధికారి గుల్షన్ రాయ్, రక్షణ పరిశోధన అభివృద్ధి శాఖ డైరెక్టర్ జనరల్, రక్షణ మంత్రి సలహాదారు డాక్టర్ సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు.
జనవరి - 20
¤ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సు ముగింపు సమావేశానికి గవర్నర్ నరసింహన్ హాజరయ్యారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ వర్ధంతిని పురస్కరించుకుని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ సదస్సును తలపెట్టారు. ‘యువ నాయకత్వం - అంతర్జాతీయ ఆవిష్కరణలు', ‘యువత అభివృద్ధిలో అవరోధాలు; విజయాలు, కారణాలు', ‘మహిళా నాయకత్వం, సుస్థిరాభివృద్ధి' అనే అంశాలపై చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. రాజస్థాన్‌కు చెందిన ప్రముఖ పర్యావరణవేత్త రాజేంద్రసింగ్‌కు జీవన సాఫల్య పురస్కారాన్ని; మాలావత్ పూర్ణ, బబిత ఫొగట్‌కు యువ సాఫల్య పురస్కారాలను గవర్నర్ అందించారు.