¤ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎమ్‌ఈ) ఆర్థిక సుస్థిరత నిమిత్తం చేపట్టాల్సిన దీర్ఘకాలిక చర్యలపై సూచనలు చేసేందుకు ఆర్‌బీఐ ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. »ఎనిమిది మంది సభ్యుల ఈ కమిటీకి సెబీ మాజీ ఛైర్మన్ యు.కె. సిన్హా నేతృత్వం వహిస్తారు. »ఎంఎస్‌ఎమ్‌ఈ రంగానికి అనుకున్న సమయానికి రుణాలు లభించే విషయంలో ఎదురవుతున్న అంశాలను కమిటీ అధ్యయనం చేసి, పరిష్కార మార్గాలను నివేదిక రూపంలో 2019 జూన్ నాటికి అందజేస్తుంది. ఇటీవల చేపట్టిన ఆర్థిక సంస్కరణల ప్రభావం ఎంఎస్‌ఎమ్‌ఈ రంగంపై ఎలా ఉందో కూడా కమిటీ పరిశీలిస్తుంది.
జనవరి - 4
¤ విమానాలు, నౌకల్లో మొబైల్ సేవలను (ఐఎఫ్‌ఎంసీ) మూడు నెలల వ్యవధిలోగా అందుబాటులోకి తెచ్చే అంశంపై అంతర్ మంత్రిత్వ శాఖల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.