¤ విశ్రాంత ఐఏఎస్ అధికారి మోహన్ కందా రచించిన ‘ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్ - రిజల్యూషన్ ఆఫ్ డైలమాస్' గ్రంథాన్ని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ¤ ఆచార్య ఎస్.వి.శేషగిరిరావు రచించిన ‘ఇండియన్ ఓషన్ నైబర్‌హుడ్ - నరేంద్ర మోదీ స్ట్రాటజీ ఇనీషియేటివ్స్' పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆవిష్కరించారు. భారతదేశ సముద్ర తీరానికి చుట్టూ ఉన్న దేశాలు, వాటితో సత్సంబంధాల విషయంలో ప్రధాని మోదీ వ్యూహాలు, చొరవ లాంటి అంశాలపై రచయిత ఈ పుస్తకం రచించారు.
జనవరి - 27
¤ విశ్రాంత ఐఆర్‌ఎస్ అధికారి కె.చంద్రహాస్, విశ్రాంత ఐఏఎస్ అధికారి డా.కె. లక్ష్మీనారాయణ ఆంగ్లంలో రచించిన ‘ఎన్టీఆర్: ఎ బయోగ్రఫీ' గ్రంథాన్ని కేంద్ర మాజీ మంత్రి ఆశోక్‌గజపతిరాజు ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ పుస్తకం తొలి ప్రతిని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణకు అందించారు.