Type Here to Get Search Results !

Feb-2019 అవార్డ్స్

ఫిబ్రవరి - 11
¤ ప్రముఖ చరిత్రకారుడు సంజయ్‌ సుబ్రహ్మణ్యం ప్రతిష్ఠాత్మక డాన్‌ డేవిడ్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ విశ్వవిద్యాలయం ప్రకటించే ఈ అవార్డు కింద ఆయనకు రూ.3.56 కోట్ల నగదు బహుమతి లభిస్తుంది. సంజయ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో అధ్యాపకుడు. ఈయన మాక్రో హిస్టరీలో (పూర్వకాలంలో ప్రపంచంలోని వేర్వేరు దేశాలు, ప్రాంతాల్లోని సంస్కృతుల మధ్య సారూప్యత, వైవిధ్యం, వారధులపై అధ్యయనం) చేసిన పరిశోధనకు ఈ అవార్డు దక్కింది. షికాగో యూనివర్సిటీ చరిత్రకారుడు కెన్నెత్‌ పొమెరాంజ్‌తో సంయుక్తంగా సంజయ్‌ ఈ అవార్డును అందుకోనున్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాలతోపాటు భూత, భవిష్యత్, వర్తమానాల్లో మానవ విజయాలపై అధ్యయనం చేసేవారికి ‘ద డాన్‌ డేవిడ్‌ ఫౌండేషన్‌' తరపున టెల్‌అవీవ్‌ యూనివర్సిటీ ఏటా ఈ అవార్డు ప్రకటిస్తోంది.
¤ అమెరికాలోని లాస్‌ ఏంజెలిస్‌లో 2017-18 సంవత్సరానికి గ్రామీ అవార్డులను ప్రదానం చేశారు. గాయకురాలు అలీసియా కీస్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గ్రామీ వేడుకకు ఒక మహిళ వ్యాఖ్యాతగా ఉండటం 14 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి. గాయకురాలు కసే ముస్‌ గ్రేవ్స్‌ నాలుగు విభాగాల్లో పురస్కారాలు అందుకున్నారు. ఈమె ఆల్బమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (గోల్డెన్‌ అవర్‌), బెస్ట్‌ కంట్రీ ఆల్బమ్, బెస్ట్‌ కంట్రీ సాంగ్, బెస్ట్‌ కంట్రీ సోలో ఫర్‌ఫార్మెన్స్‌ విభాగాల్లో అవార్డులు దక్కించుకున్నారు. సోలో ప్రదర్శనతో బెస్ట్‌ ర్యాప్‌ ఆల్బమ్‌ పురస్కారం అందుకున్న తొలి మహిళగా కార్డి బి నిలిచారు. ప్రముఖ అమెరికన్‌ సంగీత దర్శకుడు క్విన్సీ జోన్స్‌ (85) 70ఏళ్ల తన కెరియర్‌లో 28వ అవార్డును గెలుచుకోవడం ద్వారా గ్రామీ చరిత్రలో అత్యధిక అవార్డులు గెలుచుకున్న వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు.
ఫిబ్రవరి - 28
¤ తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ‘కలైమామణి' పురస్కారాలను ప్రకటించింది. 2011 నుంచి 2018 వరకు ఎనిమిదేళ్లకు సంబంధించి.. సినిమా, నాటకం, సంగీతం, నాట్యం, బుల్లితెర, సాహిత్యంతో పాటు వివిధ రంగాలకు చెందిన మొత్తం 201 మందికి సంబంధిత అవార్డులను ఇస్తున్నట్లు పేర్కొంది. ఇందులో సీనియర్‌ నటీమణులు శారద, కాంచన, రాజశ్రీ, బీఆర్‌ వరలక్ష్మి, కుట్టిపద్మిని, నళిని, ప్రియమణిలు ఉన్నారు. ఎస్‌.జానకికి ‘ఎంఎస్‌ సుబ్బులక్ష్మి జాతీయ అవార్డు', వైజయంతి మాలాబాలీకి ‘బాల సరస్వతి జాతీయ అవార్డు' ప్రకటించారు. నటులు కార్తీ, విజయ్‌సేతుపతి, శశికుమార్, ఎంఎస్‌ భాస్కర్, సంతానం, సూరి, ప్రభుదేవా, సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌రాజా, విజయ్‌ ఆంటోని, నిర్మాత ఏఎం రత్నం, దర్శకుడు సురేష్‌కృష్ణలకు కలైమామణి పురస్కారాలు లభించాయి.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.